గుణము














మన చర్యలు తారలై తళుకుమన్నా ....

జాబిలంటి గుణము లేకుంటే ఆ నింగి వైపు ఏ కనులు చూడవు....


దూరమైన నేస్తాన్ని గుర్తుచేస్తూ


















కమ్మని చలి గాలుల రాగాలు,

వెచ్చని నిట్టూర్పుల మనసు గుసగుసలు,

తెల్లని మంచు తెరల్లో చిక్కుకున్న నా కను పాపలు,

తోడున్నా దూరమైన నేస్తాన్ని గుర్తుచేస్తూ,

తోడైన నా మాటలను నీకు కానుకచేసెనీపొద్దు .....


బొచ్చు వదిలిన బుర్ర













బొచ్చు వదిలిన బుర్ర

కష్టం లేని జీవితం లాంటిది

భారమంతా వదిలేసిన

గాడిద సుఖము లాంటిది

స్నేహమే దూరని మగువ మనసులో

ప్రేమ దూరినంత హాయి లాంటిది


భ్రమ కూడా కొంత నిజమని మరచిపోకు













కనులు కనలేనిది ఇలనే లేదని

చెవులకు తోచనిది శబ్ధమే కాదని

భ్రమ పడి నీవు మోసపోకు

ఆ భ్రమ కూడా కొంత నిజమని మరచిపోకు


నా స్నేహితురాలు సాధ్వి పుట్టిన రోజు


















నా పరిచయానికి స్నేహానివి

అ స్నేహానికి చక్కని అర్థానివి

అ అర్థము పుట్టిన రోజు ఈరోజు

విచ్చిన పూ పరిమళాలకు మొదటి రోజు

ఎప్పటికి వాడిపోని చిరునవ్వుతో

పదిలమైన ప్రేమానురాగాలతో

తల్లి తండ్రులకు కూతురిగా

సమాజానికి తలమానికంగా

నీ ఆశయాలకు సారధిగా

విజయ తీరాలకు చేరుకోవాలని కోరుకుంటూ

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు




ఆలోచనా వైఖరి

















சுட்டால் உயிர் போகும் மனிதனக்கு

சுட்டால் உயிர் வரும் செங்கல்லுக்கு



பட்டால் புரியும் பரம்பொருள்

விட்டால் கிடைக்கும் அந்த பொருள்



நின்றால் வரும் உன்கிட்டே சிலது

சென்றால் போகும் இடம் எல்லாம் உன்னுடையது


--------------------------------------------------------------

తమిళములో తోచినది అందు చేత అందులోనే రాసాను కిందది దాని భావము మాత్రమే

--------------------------------------------------------------


వేడి తగిలితే ప్రాణం పోతుంది మనుజుడికి

అదే వేడి ఇటుకను తాకితే దానికి ప్రానమోస్తుంది



దెబ్బ తగిలితే కాని తెలియదు ఆ దైవము యొక్క ఉనికి

అన్నీ వదిలితే కాని దొరకదు ఆ దర్శనము



ఉన్నచోటే వుంటే కొన్నేనీదెగ్గరికి వస్తాయి

నీవై కదిలితే అన్నీ నీదౌతాయి


నవరసభరితం















నిర్మానుష్యం ఆ ఆకాశం

నిర్వీర్యం అ వెన్నల సౌధం

ఎన్ని చుక్కలు వుంటేనేమి

ఎంత చీకటి కమ్మితేనేమి

జ్యోతి లేని ఆ నింగి నీరు లేని కడలిలా వెల వెల పోతుంటే

నేనున్నానంటూ చిగురించింది ఓ పరిమళం

అది చల్లని గాలో లేక వెచ్చని వెలుగో తెలియదు

ఎప్పటికి నిరంతరాయంగా సాగిపోయే స్వేచ్చా జీవిలా

అందరికి ప్రాణమందించే స్నేహ భావంలా

నవరసాల సమ్మేళనంతో నవరసభరితంగా సాగిపోతోంది


చుయ్ చుయ్ వడలు













చుయ్ చుయ్ వడలు వడలు నూనెలో...

చుష్ చుష్ వేయి వేయి నూనెలో...

వేడి వేడి గా చలి పోయేలా...

కమ్మగా కమ్మగా అమ్మను గుర్తు చేసేలా...

చలి కాలపు మంచును తలదన్నే పొగలతో...

బుగ్గలో దాచుకుంటూ మైమరచిపోతూ...

రుచుల వెల్లువ పోట్టేత్తేలా మజా ఐన వడలు...

నాలుక ప్రేమించే చక్కని ప్రియురాలు ఈ వడలు...



తల్లి అనే మరో ప్రాణం జన్మిస్తుంది ..











నూరేళ్ళ జీవితం ఆ ఒక్క క్షణానికి సరితూగుతుంది

పచ్చని సంసారానికి భవిష్యత్తు తోడౌతుంది

అమ్మ అనే మాటకు అర్థం చేకూరుతుంది

తల్లి అనే మరో ప్రాణం జన్మిస్తుంది .....


అలజడి లేని చల్లని చిరుగాలి ..








( మా స్నేహానికి గుర్తుగా ఆ కుందేలు )

నీ అల్లరి అలజడి లేని చల్లని చిరుగాలి ....


నీ పల్లవి కొందరికే వినపడే స్నేహపు మురళి...


నిశ్సబ్ధమైన చీకటిలో ఉర్రూతలూగే వెన్నల లోగిలి....


కలలలోను మదిలోను దాగిపోయే జ్ఞాపకాల సరళి..




  


మందేరా గొప్ప....








మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  


జాతి బేధము అసలే లేదు


కులమతాలతో పనియే లేదు


ఆడ మగల తేడా లేదు


మత్తు దిగిందా ఇక స్వర్గము చూడు





నడకలు రాని రోజులు తెలుసా ఇప్పుడు చూసుకో


కష్టాలు తెలియని చిన్నతనాన్ని గుర్తుచేసుకో


తప్పు కాదిది తప్పే కాదు


తప్పుటడుగుల తొలిరోజులు


ఒప్పు కాదిది ఒప్పే కాదని


ఒప్పుకుంటే మరి తప్పు


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  





చూసావా ఆ జెండా గాలికి ఆడట్లేదు 


మత్తు మంత్రులు ఎగరేసిన మహిమ


దానికి కూడా దిగులు కాబోలు


దానిని పట్టించుకునే ప్రభుత్వానికి కూడా 


మందంటే తారక మంత్రము 


అ మంత్రము చెబుతూ కూటమి వేసి


మనకు కావాలి  స్వరాజ్యమనరా


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  





మందు లేని అ సీసా చూడు


మన తలరాతలు చూడు


తన దిగులంత మనకిచ్చి


మన దిగులును పోగొట్టే త్యాగశీలి


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  





అందరిని ఒకలా చూపుతుంది


కాని మన దారిని వేరు చేస్తుంది


అభిమానం మరీ ఎక్కువైతే


మెలుకవ రాని నిదురనిస్తుంది


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా

  

ఆలోచనలో స్థాయిలో మార్పు కావాలి
















చినుకు తడిపింది చూసున్నాను

అ చినుకే తడిస్తే చూడాలని ఉంది

ప్రేమించే మనసు చూసాను

మనసును ప్రేమించే తరుణానికై వేచివున్నాను

ఆగని కాలంలో ఆగిన రేణువై వున్నాను

అ రేణువును వెలుగుల రేడుగా మార్చాలనుకుంటున్నాను

ఇది వరకు అన్ని నేర్పించాలనుకున్నాను

ఇకపై నే నేర్చుకోవాలనుకుంటున్నాను......  

ఆడుతోంది నా యవ్వనం...














చల్లని చిరు గాలితో

చినుకుల సయ్యాటతో

పులకరించి పరవశించే ఈ సమయం

మెరుపుల మేనత్తకు

మబ్బుల మావయ్యకు

గొడవలతో హోరెత్తే ఈ సమయం

ఆగమన్నా ఆగనంది వయసుమీద ఉల్లాసం

చాలన్నా బలవంతం చేస్తోంది ఆ మేఘం

దారి తెలియక తికమక తో వాగు వంక పోతుంటే

చాలధంటూ చలి మంచు దారి కప్పుతుంటే

ఆగకుండా ఆవేశంతో ఆడుతోంది నా యవ్వనం...


అందరికి ఆదర్శమౌతుంది ..














మైకం నుంచి పుట్టిన ఆలోచనలో 
ఆవేశము
 తప్ప వివేకముండదు

మబ్బు మాయలో పడ్డ సుడిగాలికి వేగము తప్ప చెట్టును హత్తుకునే ఆలోచన ఉండదు

ఆ వేగానికి కట్ట వేస్తే ఎంతటి వరదలైనా ప్రాణమిచ్చే నీరుగా మారుతుంది

అందరికి ఆదర్శమౌతుంది ...


చిట్టి పొట్టి చీమలో ఎన్ని ఎన్ని యుక్తులో














చిట్టి పొట్టి చీమలో ఎన్ని ఎన్ని యుక్తులో

చక చక నడుచుకుంటూ పరిగెడుతూ ఉంటుంది

కొండైనా అది చక్కెరైతే నిమిషంలో కరిగిస్తుంది

పోట్టిధైనా గేట్టిదే తనకు మూడింతలు మోస్తుంది

ఎవ్వరికిందా పని చేయదు స్వాభిమానం కలది

పుట్టలు మేడలు కట్టేస్తుంది ఏ అడ్డమైనా ఎక్కేస్తుంది

దోచుకోదు ఎప్పుడు కావలసినది దాచుకుంటుంది

కష్టమైనా చేసుకుంటూ కాలం గడుపుతుంది

క్రమశిక్షణ కలది అది కొలవలేనిది


నమ్మకమే జీవితం











వదలలేని జీవితంలో వల్లమాలిన ఆప్యాయతలు


ఎంతదూరమో ఎంత చెరువో మన చెంతనున్నా తెలియదు


వాటికి లెక్కలేసుకుంటే ఫలితము రాదూ


నమ్ముకుంటేనే ఆ కల నిజమయ్యేది 

అదే లేకుంటే ఇంక ఈ జీవితమేది ...... 


వెతుకుటాకులు...











తినేవారికి మంచి ఆకులు

తరువాత ఎంగిలాకులు

పొట్టకూటికి లేని వారికి వరముటాకులు

దుర్భరమైన జీవితాన ఇవే ఉచితమైన ఆకలి వెతుకుటాకులు....


అవుతున్నా నేనే ఓ చకోరం.























అ చిత్రాన్ని బహుకరించిన సుభ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ... :) 






దాహం తీర్చే మేఘం... 

తనువును పులకరింప జేసె మేఘం.... 

మట్టిలోని ప్రాణాన్ని చిగురింపజేసే మేఘం....

జల్లులుగా మారి చిగురాకులపై ఊయలలూగే మేఘం.

 అలలలో కలగా కలిసిపొయే మేఘం..

 రతనాల తోటలో ముత్యమై మెరిసే మేఘం... 

అర విరిసిన కుసుమాలపై ముద్దులు కురిపించే మేఘం... 

అలాంటి ఆ మేఘం కోసం అవుతున్నా నేనే ఓ చకోరం... 


ప్రోత్సాహించే స్నేహం..




























నా మనసులో మీ స్థానం ఒక సుభాషితం 


ఆ పరిచయం నా దారిని చేసింది జ్యోతిర్మయం


ఆ వెలుగులో నా ఆనందమిక నవరసభరితం


నన్ను ఇంతగా ప్రోత్సాహించే మీ స్నేహానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 


నా చెలి పాదము జాగ్రత


























నా చెలి పాదము జాగ్రత్త 


చక్కని పాదము జాగ్రత్త





ప్రేమతో అడుగులు వేస్తూ

నను చేరే పాదము

ఓ గోరింటాకు తననేమనకు

తనతో స్నేహం చేస్తూ ఎర్రగామారు

తను చూసే సరికి పెదవిపై చిరు నవ్వుగా మారు ... 




వర్షా కాలం..

























చిటపట చిటపట చినుకుల వాన


బెక బెక బెక బెక కప్పల రాగం



తప తప తప తప  బురదలో తాళం


కిర్ కిర్ కిర్ కిర్ చెప్పుల శబ్దం

ఇంతే ఇంతే వర్షా కాలం  

దీపావళి శుభాకాంక్షలు

























వెలుగు పూలు విరబూసే అరుదైన తోట 

బంధాలను బద్రపరిచే మంచి ఘడియ 

ఆనందాలను గుర్తుచేసే గొప్ప వేదిక

అందరికి కనుల పండుగ

బేధాలు లేని దీపావళి పండుగ...

అందరికి హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు ..

అలసట తెలియని మహా యోధులు..























జుట్టు తెల్లబారినా తెలియదు


ఒళ్ళు నల్లబారినా తెలియదు 


కష్ట మొక్కటే తెలుసు కార్మికులకు


 


ఎన్ని భవనాలు కట్టినా 


మన కలలను వారు నిజాము చేసినా


పేదవారే కాని ధనవంతులు కారు 





మన నాలుకకు రుచులు వారిచ్చినవే


మన మానానికి బట్టలు వారిచ్చినవే


అయినా రుచుల సౌకర్యాలు తెలియని వారు





మన రాచమార్గము వారి అడుగుల పుణ్యమే


పాదరక్షలు వారి చేతుల చలవే


అయినా ముళ్ళభాటపైనే  వారి అడుగులు 





వేకువతో మొదలౌతారు 


చీకటితో నిదురిస్తారు


అలసట తెలియని మహా యోధులు


వారినే నమ్ముకుంటూ హాయిగా జీవిస్తారు 


చేరదీయి నీ స్వాభిమానమును..



















పరులు నివ్వెరపోని ...

పంతాలు మోసుకొని...

మనకేమి భయము మనకేమి...

పాండిత్యము కాదు ఇతరుల శ్రేయస్సులోనే గొప్పతనము...

అనుకువలో కాదు అనుకున్నది చేయుటలోనే విజయము..

తోసిపుచ్చు దుఖాఃన్ని  ...

చేరదీయి నీ స్వాభిమానమును... 

Excuse Me


while checking the options in my blogger settings by mistake the comments to some of the postings were deleted. Excuse me for this. I miss your great comments :(

గాజులోయమ్మ చిలిపి నేస్తాలు

















గాజుల వాకిలి తెరవంగానే

రమణుల రాకలు మొదలాయే

రాసులు కాసులు ఉండంగ కూడా

చేతికి గాజులే మురిపెములాయే

బావను సక్కంగా ఉంచడానికి

గేట్టినైన ఈ మట్టి గాజులు

అమ్మానాన్నల ప్రేమను చూపే

గల గల గల పట్టీల గాజులు

ఇంటిల్లి పాది అందాలు చూపే

మెరిసిపోయే ముత్యాల గాజులు

గాజులోయమ్మ నవ్వేటి గాజులు

అందాల చేతికి అనువైన గాజులు

గాజులోయమ్మ చిలిపి నేస్తాలు

మెత్తాని చేతికి చేమంతి గాజులు....

రైతన్న















అన్న రా మాయన్న ఆకలి తీర్చేటన్న...


మట్టిలో ఆడుకుంటూ సాగులు చేసేటన్న ...


ఎండిన ముత్యాలను పంటలుగా మార్చేటన్న..


కాలమేధైనా కష్టాన్ని నమ్మేటన్న ..


అందరిలో పెదన్న..


ఆ అన్నే మా రైతన్న...


మా మనసులలో వెలుగన్న...



నా స్నేహితురాలు సుకన్య పుట్టినరోజు .























ఏదారికోదారి అ దారిలో చిన్నారి

స్నేహాన్ని కలుపుకుంటూ 


కన్నవారి ఆశయాలను పంచుకుంటూ


ఎంత ఎదిగినా అంత కింత ఒదుగుతూ


మళ్ళి ఈరోజు పాపై పుట్టెనే 


మా అందరి మదిలో పదిలంగా నిలిచిపోయేనే..





నీ ఆశయాలు నెరవేరాలని


ప్రయత్నాలు నిజమవ్వాలని


ఏ బరువైన మోయగల భలము నీకు కలగాలని

మనసారా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు...  














నీవు ఓ పడతి రూపమే.






















మైనం లాంటి మేని సొగసు

కరిగిపోయే లేత మనసు


హత్తుకుంటే పొంగిపోయే పరిమళాలు


అన్ని నీ సొంతమే

ఓ  సబ్బు బిళ్ళా నీవు ఓ పడతి రూపమే...  











 

నాకోసమే అ కవ్వింతలని....


















చక్కనోడు చందురోడు పున్నమై వచ్చాడు 

చల్లని మేఘాలనల్లి  నా చెలిని దాచాడు


తారలలో ఉందేమో చూపులను పంపిస్తే


వెన్నలను చూపించి నా కనులను దోచాడు


మభునై పయనిస్తూ విను వీధులు వెతుకుంటే


చల్లని గాలినే పంపి నన్ను చినుకులా మార్చాడు


నా ప్రయత్నమంతా మానుకొని అలా చూస్తున్దిపోతుంటే


తెలిసింది ఆ జాబిలే నా చెలి అని 

నాకోసమే అ కవ్వింతలని.... 









తానే దైవమై దెయ్యమును పెట్టె .
















మానవత్వము పెట్టి బేధములు పెట్టి

ప్రాణము పెట్టి దానికి విషము పెట్టి


బలము పెట్టి బలహీనతను పెట్టి

తానే దైవమై దెయ్యమును పెట్టె .. 








హాజరు పట్టీలు
























మనుషులుండరు  కాని


వారి వరుసలు వుంటాయి 



తప్పు చేయకున్నా గడులలో బందీలౌతారు


ఎప్పటికి పారిపోలేరు కాని 


అప్పుడప్పుడు మాయమౌతుంటారు  


పట్టీలలో కాలక్షేపం చేస్తుంటారు

అ పట్టీలే హాజరు పట్టీలు  





తెలుగు బాష లేకుంటే కట్ట దాటదు అ భావము




















మనసు నీవని చెప్పదలచినా


మమత కోవెల కట్ట దలచినా


బాష కరువైతే అ ఆలోచనే అంతంత మాత్రమే 





ముద్దు పెట్టే పెధవులున్నా 


ప్రేమించే మనసు ఉన్నా


అడగడానికి బాష లేకుంటే అ క్షణము వ్యర్ధము





బాష పరిబాషలెనున్నా


పరవశించే మనసుకు 

తెలుగు బాష లేకుంటే కట్ట దాటదు అ భావము  


కలనై నేనే కదులుతాను



















తోడు రావే రామ చిలుక


పొద్దు  పోయే వేళాయే


జాబిలమ్మ తోడు ఒచ్చినా  


చిలక పలుకులు లేవాయే





తారలనుకొని మోసపోకు


తోట పూచినా మల్లె పూలు


పాములనుకొని భయపడకు


నీ కబురు విని సిగ్గు పడ్డ మల్లె తీగలు


నన్ను చూసి ఒంటరనుకునేవు 


నీ తలపులుండ నే ఒంటరి కాదు





రెక్కలందుకో వేగమందుకో


రెప్ప పాటున వాలిపోవే


రేయి దాటిన దిగులు లేదు


ఎక్కడునా భద్రము


దూరమైతే కబురుపంపు


కలనై నేనే కదులుతాను 



హాయిగా నవ్వించే హాస్యము















హాస్యము హాస్యము హాస్యము

హాయిగా నవ్వించే హాస్యము

కూడదు కూడదు కోపము

కోపానికి విరుగుడే హాస్యము





నవ్వే పెదవులు చెప్పే హాస్యము

అమాయకాన్ని చూపే హాస్యము

తన్నులు తింటే పండే హాస్యము

కోపం లోను కరకర హాస్యము

మతే లేని తికమక హాస్యము

అర్థం కాకుంటే అది ఒక హాస్యము

నవుతూ పోతే అంతా హాస్యము

హాస్యమే లేకుంటే అంతా వ్యర్ధము ..





హాస్యము హాస్యము హాస్యము

హాయిగా నవ్వించే హాస్యము





చిన్నారుల తడబాటే హాస్యము

బామల తాతల గొడవలు హాస్యము

ప్రేమలోని అలకలు హాస్యము

తనకు తాను మాట్లాడితే హాస్యము

పరుగులు తీసే చినారి హాస్యము

గుబులు పుట్టించే కన్నె సైగ హాస్యము





హాస్యము హాస్యము హాస్యము

హాయిగా నవ్వించే హాస్యము





నవ్వించే వన్ని హాస్యము కాదు

నవ్వు రాని వన్ని హాస్యము కాకుండా పోదు

మనమే హాస్యమైతే జీవితమే ఆనందము

ఇంకోరిని హాస్యము చేస్తే అది నీలో ఒక లోపము





హాస్యము హాస్యము హాస్యము

హాయిగా నవ్వించే హాస్యము


పదే పదే పలకరించే ప్రాణంలా నీవో వరం..

















ఏదో ఏదో నీలో సగం నేనై పోతునానే


పొద్దున్నే కళ్ళను మరచి నిన్నే అనుకుంటానే 


స్నేహమా నీవే కదా నాలో దాగున్న నిజం


పదే పదే పలకరించే ప్రాణంలా నీవో వరం...


రానివే చీకటి నాపైకి


నీ నవ్వులో దాగిన వెన్నల చూపి వెలుగే తెపిస్తానే


రానివే ఓటమి నా వైపు


నీ స్నేహాన్ని మించిన గెలుపే లేదని


ఓటమినే ఓడిస్తానే


ఏది లేదని నీలోనన్న ప్రశ్నే లేదు 


అందలానికి మించిన అనురాగం ఉన్నది


ఏది ఉందని నాలో అన్న అనుమానమే లేదు

అంతా నీవే ఆణువణువూ నీ స్నేహమే..


నన్నే అడుగులు వేయించావు











అందని ఆకాశం నీవు

అందాల ఓ పావురం

నేలపై రాలిన ఎండుటాకులా

చేసాను ఓ సాహసం



రెక్కలు లేవు పక్షిని కాను

గాలికి తోడై వస్తున్నా

ఎంత సేపని గాలిలో ఉండను

చావని ఆశల బరువుతో ఉన్నా



నీతో స్నేహం కల అనుకున్నానే

నాకై చినుకై దిగివోచ్చావే

సీత కొకలా నటిస్తున్నా

నన్ను చిలుకలా మర్చేస్తున్నావే



నాపై అందరి అడుగులు పడకుండా

నన్నే అడుగులు వేయించావు

నీకిది తెలియదేమో

ఈ ఎండుటాకునే పైపైకి చేసి

ఒక నక్షత్రంల మర్చేస్తునావు

నీకెలా రుణపడి ఉండను

అ రుణాలకే అతీతంగా ఓ బందానిచ్చావే...


జో జో జో జో



జోకొట్టే జోరీగ రాగాలు నావి..

జో జో జో జో జో ..

కిట్టయ్య వేణువు రాగాలు నావి ..

జో జో జో జో జో...

పాపాయి పల్లకి ఊయలలో ..

పండిన వెన్నల నవ్వులలో..

నిండిన ఎదలో పొంగిన ప్రేమ...

చెప్పే తియ్యటి కబురే నాది...



ప్రేమ పంచె పాపాయికి

ఈ లాలి పాట ఒక ఈడగునా..

స్నేహం పెంచే ఈ చిట్టికి

నా మనసు మాట అంత హాయిచునా.

నాలో ఏదో ఉప్పొంగుతునా ..

భావాల వెల్లువ ఈ లాలి..

నాకై దాచిన ఈ ప్రాణంతో ..

చేసిన పాటనే ఈ లాలి..

ఈ లాలి నిదురోవాలి..

ఈ రేయి హాయినివ్వాలి..

నా స్నేహం నీతోటే..

కలకాలం నిజమవాలి..



జోకొట్టే జోరీగ రాగాలు నావి..

జో జో జో జో జో ..

కిట్టయ్య వేణువు రాగాలు నావి ..

జో జో జో జో జో...           

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ...









ఆశయం మీ చేతిలో ఒక అనువైతేనే స్వాన్తంత్రయం మా జీవితాలకు ఆయువుపోస్తుంది...

అంకితభావం మీ గుండెల్లో నాటుకుంటేనే అన్ని వేళలా మా స్వప్నాలు సాకారమౌతాయి ...

మాకోసమే జీవించే మీ నిస్వార్దానికి జోహార్లు మీకు మా స్వాన్తంత్రయదిన శుభాకాంక్షలు ...



अगर नियोग है तुम्हारी जिंदगी का बाग़ है थो हम जिंदगी पा सकते हो ,

अगर तुम्हारे दिल मे उमंगें बार धे जय तो तुम अपने सपनो को पूरा कर सकए हो

मेरे सैनिको तुम्हे तुमारी मतलबी न होना के लिए सलाम और मुबारक हो तुम्हे ये स्वतन्त्र दिवस - Translated by my friend parul bansal



only if machine is a part of your life we get the lives..

only if dedication is filled in your hearts our dreams come true...

o my indian soldiers salute to your selflessness and wish you happy independence day...           


ఎన్నో సంశయాలు...









అందనిది ఏదైనా అందంగా ఉంటుంది ..

అందితే ప్రేమైనా చులకనౌతుంది...

అందని ఆకాశం కూడా అయ్యింది ఒక గమ్యం..

అందే మమకారం ఎవరికి పరిహారం..

చుక్కలు లెక్కించే లెక్కల తెలివుంది..

మనసును తెలుసుకునే సమయం మనకేది..

పరిశోధనలకు పట్టాలు వ్యాఖ్యానాలకు బహుమతులు..

వరి పండించే చేతులకి చినుకంత ఓదార్పులు..

ఎవరనుకున్నా ఏమౌతుందని అనుకున్నా అది జేరిగేదేనా..

సందేహాలు సంసారాలు ఇలా ఎన్నో సంశయాలు...


ఆశించకుండా స్నేహమై పోతే..





నా తూరుపున సూరీడు ఉధయించలేదని...

సూర్యకాంతి పూయడం మానేస్తుంద ??

నా చెంతకు పూలు రాలేదని...

తుమ్మెద రాగాలు ఆపెస్తుందా ??

మనచెంతకు రానపుడు మనమే దారి మరులుతు..

ఏమి ఆశించకుండా స్నేహమై పోతే..

అ సూర్యుని వెలుగు నీపై పడుతుంది అ పువ్వులోని తీపి కూడా నీదౌతుంది..

స్నేహానికి ఆలయం..





చూడని ఒక లోకం..

స్నేహానికి ఆలయం..

ఒక మనసులో అది పదిలం...

అది నీదే నీదే నా నేస్తం..



చేరువున్న చందమామలా ఒక్కటే నా కనులలో...

దూరమైన తారకవైనా నీపై ఆలోచనలు ఎన్నో నాలో...

నిదురే లేని చీకటై నన్ను హాయిగా లాలిస్తావే..

ఇంతకు ఆ హాయిని చూడలేదు కాని పిల్ల గాలుల మహిమలు తెలుసు...

ఎంతకు నిను మరువనని తెలుసు నన్ను నేను మరచిపోతు...

నా అలవాటుకు వీడ్కోలు ..





ఇన్నాళ్ళు నాకోసం నీవునావ్...

సమయమంటూ చూడకుండా నాతోటి ఆడుకున్నావ్..

నిన్ను నే వదలలేకున్న వదలిపో నన్ను...

నా అలవాటుగా ఇన్నాళ్ళ నీ సేవకు వీడ్కోలు ఈరోజు...

స్నేహానికై చూస్తే మనము..





మబ్బులకై చూస్తే చీకటి...

వెన్నలకై చూస్తే జాబిలీ...

మనసుకై చూస్తే ప్రేమ..

జీవితానికై చూస్తే బంధాలు..

కోరికలకై చూస్తే దుఖం...

ఆరోగ్యానికై చూస్తే నియమం...

ఆమనికై చూస్తే కోయిల..

అందానికై చూస్తే ప్రకృతి..

స్నేహానికై చూస్తే మనము..

ఇలా ఒకటికై చూస్తే మరొకటి తారసపడక తప్పదు..

మన స్నేహం





కనుపాపల కలవరరింతకు తాలమేసే దారిలేదు....

ప్రాణమాగితే కాని వాటి శబ్దం తీరిపోదు....

మన స్నేహం వాటితో పోటి పడని...

వాటి సమయం కన్నా మన కాలం పెరిగిపోని...

అనుకోని వాన జల్లు..





అనుకోని వాన జల్లు నాపై కురిసింది...

బయపడుతూ తనలోని చలిని నాకై పంపింది...

అందుకున్నా ఆస్వాదిస్తూ హతుకున్న బయములేధంటూ...

నవ్వే మనసెపుడు వాడిపోదు...





నవ్వే మనసెపుడు వాడిపోదు...

నిదురనున్న కనులెపుడు కన్నీరు కార్చలేవు...

ఆలోచనకు ఎపుడు అలసట ఉండదు..

అన్ని కలసి ఉంటే సంతోషం నీతోడు..

పునమ్మి వెన్నల.





జాబిలమ్మ మారినా చీకటి నలుపు రూపము మారదు...

కాని ఆ చీకటి నమకాన్నే ఏదో ఒకరోజు పునమ్మి వెన్నలగా కురిపిస్తుంది...




గోపయ్య చినుకా రాధకై వచ్చావా...

రామయ్య చినుకా సీతకై వచ్చావా...

ఎవరికోసం వచ్చినా ఎవరై వచ్చినా...

ఇంతకాలం మాలాగ వేచి ఉండాలి మాటకోసం...

వరదై పొంగినా సరే చాలదు నీ నిరీక్షణ.. 
 
  

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...