Showing posts with label నేల. Show all posts
Showing posts with label నేల. Show all posts

చులకన

ఎగిరే గాలిపటానికి చులకన అయ్యాను నేను కింద ఉన్నందుకు, తనను ఎగురవేసింది నేనే అని మరచి, నింగితో సావాసం చేసింది తారకై అక్కడే ఉండిపోయింది....

I was disregarded by the soaring kite because I was on the ground while it was flying high, forgetting that it was I who made it fly. It mingled with the sky and stayed there, turning into a star..

उड़ते हुए पतंग ने मुझे नज़रअंदाज़ कर दिया क्योंकि मैं जमीन पर था जबकि वह ऊंची उड़ रही थी, यह भूल गया कि मैंने ही इसे उड़ाया था। यह आसमान में मिल गया और वहीं रह गया, एक तारे में बदल गया।

🩵

కరువు

నేలకి కరువు కానీ నింగికి కాదు,
మనిషికి కరువు కానీ అందని తలపులకు కొదవ లేదు...

The earth may face drought, but the sky does not. Man may face scarcity, but there's no shortage of unattainable thoughts...

💔

మంచు మనసు



పొగమంచు మనసే నీది, నన్ను ఆపనంది కానీ నా చూపులను ఆపుతోంది, వేసే అడుగు లోయలోనో, నేలపైనో, తెలియక మనసు తికమక పడుతోంది...

You heart is like fog, it does not stop me, but it blurs the vision.
Uncertainty at every step, whether in the valley or on the ground, the heart is confused...

तेरा दिल कोहरे की तरह है, मुझे रोकता तो नहीं, लेकिन नज़र को धुंधला कर देता है। हर क़दम पर अनिश्चितता, चाहे घाटी में हो या ज़मीन पर, दिल भ्रमित है।

🩵

రెక్కలు కట్టు


పక్షి నేల వాలితే తిరిగి ఎగిరి కొమ్మను అందుకోగలదు, ఆకు నేల వాలితే తిరిగి కొమ్మను చేరుకోలేదు, రెక్కలు కట్టి పక్షిలా మారు, ఒకే కొమ్మకు ఆకులా ఉండి తిరిగి ఎగరలేక వాలిపోకు...

अगर एक पक्षी जमीन पर गिर जाता है, तो वह वापस उड़कर शाखा तक पहुंच सकता है; अगर एक पत्ता जमीन पर गिर जाता है, तो वह फिर से शाखा तक नहीं पहुंच सकता। उसी तरह, पंख प्राप्त करो और एक पक्षी की तरह बनो, पेड़ की शाखा पर ऐसे पत्ते की तरह मत रहो जो वापस उड़ न सके।..

If a bird falls to the ground, it can fly back to a branch; If a leaf falls to the ground, it cannot reach the branch again. In the same way, get wings and become like a bird, do not remain like a leaf on the branch of a tree that cannot fly back..

💞

పూలను అప్పులిచ్చి తెచ్చుకున్న తారకే నువ్వు


జాబిలమ్మ ఇష్టపడే జాజిపూలు నవ్వులే కదా నీ నవ్వులే కదా, నేల సీమకు చక్కనమ్మ కావాలంటే కోట్ల పూలను అప్పులిచ్చి తెచ్చుకున్న తారకే నువ్వు..

Your smile is the jasmine the moon adores; you are the star borrowed from the sky by this earth gifting millions of flowers...

तुम्हारी मुस्कान चाँद को भाने वाली चमेली है; तुम वह तारा हो जिसे यह पृथ्वी आकाश से उधार लेकर लाई है, लाखों फूलों का उपहार देते हुए।..

💞

తొంభై తొమ్మిది శాతం అందాన్ని చూసా


నిన్ను చూసాక ఈ భూమిపై తొంభై తొమ్మిది శాతం అందాన్ని చూసా అని అనిపిస్తోంది, ఇంక ఒక్క శాతం పోతే పోయింది అది చేరుకోలేని ఆకాశంలో ఉంది అనుకుంటా, నీకంటే మరింత అందంగా ఈ నేలపై ఏముండబోతుంది?

After seeing you, it feels like I've found 99% of the world's beauty, and the remaining 1% is up in the sky. What on this earth could be more beautiful than you?

💞

విలువైన ప్రేమ

చినుకులు తగిలిన నేల మెరుగుపడుతుంది కానీ నేల నాణ్యత చూసి చినుకు పడదు, నీ ప్రేమ సోకి నా విలువ పెరిగిందే కానీ నా విలువ చూసి నువ్వు నన్ను ప్రేమించలేదు...

The quality of the land touched by raindrops improves. Otherwise, the raindrops won't consider the quality of the land they shower upon. Just as your love improved my life, but you didn't love me for something valuable in me...

💞

మేఘం రాసిన కన్నీటి కావ్యమే సంద్రం


రాసింది మేఘం తన బాధలన్నీ నేలపై, పొంగిందేమో సంద్రం ఆ బాధ రూపమై...

The cloud etched its sorrow onto the land, giving rise to the ocean...

💜💜💜



ప్రేమగా మారిపోదా


నేల వదిలి సంద్రమైన ఆకాశాన చేరిపోదా నువ్వే మేఘం అయితే, రాయి రప్ప పువ్వు మొగ్గ తారలుగా మారిపోవా నువ్వే నింగి వైతే, తలపులు నిండిన నా హృదయం ప్రేమగా మారిపోదా నువ్వే ఎదురొస్తే...

If you become the cloud, then the oceans will fly to stay with you. If you become the sky, the flowers, buds, and stones will become stars in the sky. My heart, full of feelings, will turn into love when I face you...

💜💜💜

మరో ప్రేమకై చోటు ఎక్కడ ఉంటుంది


నీ నీడ వాలిన ఏ నేల కూడా వేరే నీడకు చోటు ఇవ్వనంది, మరి నీ ప్రేమ సోకిన నా మనసులో మరో ప్రేమకై చోటు ఎక్కడ ఉంటుంది...

Wherever your shadow has graced the land, it forbids other shadows from descending. Your love has taken root in my heart, leaving no room for another to flourish...

💜💜💜

నేను కూడా మెరిసే బిందువై మిగిలిపోవాలి



బురద నేలపై నీటి బిందువులు ఎన్నున్నా మెరవ్వు సరి కదా కనిపించవు కూడా, కానీ తామరాకుపై ఒక్క నీటి బిందువు ఉన్నా చాలు మెరుస్తూ ఉంటుంది,
సఖీ నీ ఆలోచనలో నేను కూడా మెరిసే బిందువై మిగిలిపోవాలి...

The water droplets on the muddy ground won't shine at all, but even a single droplet on the lotus leaf shines. Dear, I aspire to be the shiny droplet in your thoughts...

💜💜💜

ఊదా రంగు చినుకు




చినుకులలో ముత్యాలయ్యే చినుకులు కొన్ని,
నేలను చెమ్మ చేసి ముద్దాడే చినుకులు కొన్ని,
కానీ రంగు మారి నా దోసిళ్ళలో పడ్డ చినుకు నువ్వు,
 జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతంగా మిగిలావు...

A few pearly drops among thousands of raindrops,
A few drops that kiss the ground and keep it wet,
But you are a purple drop that fell into my hands directly, becoming a once-in-a-lifetime occurrence...

💜💜💜

మంచు దుమ్ము


నీ ప్రేమ కూడా పైన పడిన దుమ్ము లాంటిదే కానీ మట్టి దుమ్ము కాదు మంచు దుమ్ము, ఎంత పడితే అంత హాయి...

Your love is also like dust, not the dust of the soil, but the dust of the snow. The more it falls, the better it feels...

💜💜💜

చీలిపో



నేల చీలితే చిగురు తొడుగుతుంది,
నా మనసు కూడా చీలిపోని,
ప్రేమ పెరుగుతుంది...

Shoots sprout only when the soil can crack,
Maybe my heart is breaking to strengthen the love...

💜💜💜

వెన్న పరుచుకున్న నేల

నిన్ను చూస్తుంటే మట్టి నేలపై పూచిన పువ్వులా తోచట్లేదు, వెన్న పరుచుకున్న నేలపై వెన్నల ధారకు వికసించిన మల్లె పువ్వులా ఉన్నావు..

Looking at you, you do not look like a flower that has flourished on sandy soil; you look like a jasmine flower that has flourished on butter-spread land, shimmering with the stream of moonlight...

💜💜💜

అందమంతా నిండిన మబ్బు నువ్వే కదా

వెన్నెలంతా ఆవిరై నేల చేరితే,
ఆ అందమంతా నిండిన మబ్బు నువ్వే కదా...

If all the moonlight evaporates and reaches the ground,
aren't you the cloud full of all that beauty?

💜💜


సుతి మెత్తని అడుగులు

వేకువ కిరణాల తాకిడికి నేలపై దుమ్ము లేస్తుందేమో,
కానీ నీ అడుగుల చుట్టూ తిరిగే నా కళ్ళకు ఎప్పుడు దుమ్ము అంటలేదు,
అంత మెత్తగా అడుగు మోపుతావు నీ భారాన్ని గాలి భరిస్తోందా,
లేక నీ అడుగును వదిలి దూరంగా పోవడానికి ఆ ధూళికి ఇష్టం లేదా,
ఓ వయ్యారి ఇంత సున్నితమైన నీ పాదానికి నేను సేవ చేసుకోనా,
ఆ భారాన్ని నేను భరించనా ...

Dust may rise from the ground due to the impact of the morning rays,
But my eyes, wandering around your feet, never catch the dust.
You tread so softly; does the wind bear your burden,
Or does the dust not want to leave your foot and go away?
O beautiful, may I serve your tender feet,
I want to bear that burden...

💜💜

మరక అంటదు జాబిలికి

జాబిలి వెలుగు నేలనంటినా నేలపై దుమ్ము జాబిలిని అంటలేదు...

The moonlight touches the ground, but the dust on the ground cannot stain the moon...

💜💜

ఆవగింజ బరువుకు కొండలు పిండికాని

రతనాలు రాలని ,
ముత్యాలు కురవని,
నేలనే నింగికేగి వీడుకోలు పలకని,
ఆవగింజ బరువుకు కొండలు పిండికాని,
పసుపు సూరీడు పండులా మారని ,
ఇన్ని అసాధ్యాలు సుసాధ్యమైతే ,
మన బంధము తెగిపోని.... 

Let the gems fall,
let the pearls rain,
let the land fly to the sky and bid farewell,
let the mountains crush under the weight of a mustard seed,
let the yellow sun turn into a fruit,
if so many miracles are possible,
let our bond also break..

💜💜

తారలకు కరువు పూలకు కొరత

నింగిలో ఎన్ని చుక్కలో,
నేలపై ఎన్ని పూలో,
లెక్క రాసి పెట్టుకున్నా,
కానీ ఒక్కసారిగా నింగిలో తారలకు కరువొచ్చింది,
నేలపై పూలకు కొరతొచ్చింది,
ఆ అద్భుతాలు సోయగాలు నీలో పెట్టి పుట్టించాడేమో దేవుడు, మిగతావారిని శ్వాసతో రక్తంతో చేసి సరిపెట్టుకున్నాడు...

I had a count of the number of stars in the sky and the number of flowers on the earth, but all of a sudden, there was a scarcity of both. It seems like God used those wonders and fragrances to create you, while the rest of us are made with only breath and blood...

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...