వెతుకుటాకులు...











తినేవారికి మంచి ఆకులు

తరువాత ఎంగిలాకులు

పొట్టకూటికి లేని వారికి వరముటాకులు

దుర్భరమైన జీవితాన ఇవే ఉచితమైన ఆకలి వెతుకుటాకులు....


7 comments:

సుభ/subha said...

" పొట్టకూటికి లేని వారికి వరముటాకులు "
నిజంగానే వాళ్ళకి ఒక వరమండీ అవి.. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటారు.. కానీ ఏ దేశమేగినా ఇలాంటి దృశ్యాలు కళ్ళకి కడతాయి..బహుశా ఏ దేశానికైనా అదే గర్వకారణమేమో ( సిగ్గు పడక పోవడంలో ) కూడా..

జ్యోతిర్మయి said...

చూడడానికి చాలా బాధగా ఉంది కళ్యాణ్ గారూ..

Kalyan said...

@సుభ
@జ్యోతిర్మయి గారు అవునండి బాధ గానే ఉంది నాకు కూడా... ఇలాంటి దృశ్యాలు నేను తరచు చూస్తుంటా ఇక్కడ, మనసు కలచివేస్తుంది కాని నా వల్ల అయింది ఏమైనా చేస్తా కాని అంతకుమించి ఏమి చేయలేకున్నా .... ఇలాంటి నవ్య సమాజంలో ఈ పరిస్థితి అందరికి మాట్లాడుకోవడానికి మాటగా అవుతోందే తప్ప పరిష్కారం మాత్రం దొరకట్లేదు ... మనము కనుగోనాలన్నదే నా అభిప్రాయము.. దీనికి అందరు తోడ్పడతారని ఆశిస్తున్నాను... ధన్యవాదాలు..

రసజ్ఞ said...

తిండి ఎక్కువయ్యి ఒబేసిటీ తో మరణించేవారు ఒక ప్రక్క
తిండి దొరకక మలమలా మాడి ఆకలి చావులు ఇంకొక ప్రక్క
దొరికినది నచ్చలేదని కడుపు మార్చుకునే వారు ఒక ప్రక్క
తినడానికి ఏదీ దొరకక ఖాళీ కడుపుతో పడుకునే వారు ఇంకొక ప్రక్క
ఆకలి అనేది ప్రతీ మనిషి కడుపులోను మొలిచే కలుపు మొక్క
అది పెరిగి వృక్షమవ్వక ముందే దాని వేళ్ళను పెకలించాలి!


మన్నించాలి కళ్యాణ్ గారూ ఏదో ఈ చిత్రం చూసిన బాధలో ఆవేశంతో ఇలా వ్రాసాను!

రసజ్ఞ said...

క్షమించాలి! అచ్చు తప్పు మార్చుకునే కాదు మాడ్చుకునే

సుభ/subha said...

ఆవేశపడినా చాలా చక్కగా చెప్పారు రసజ్ఞా..

Kalyan said...

@రసజ్ఞ గారు పర్లేదు ఆవేశం నుంచే ఆలోచనలు వస్తాయి . దీనికి త్వరలోనే పరిష్కారం కనుగొనాలి. అందరి సహకారానికి ధన్యవాదాలు.

మరక

నాపై ఎన్నో మరకలు, అన్నింటినీ శుభ్రం చేయాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు చేసిన మరక నా గుర్తింపుగా మారింది, నేను దాన్ని శుభ్రం చేయడానికి బ...