Showing posts with label దీపం. Show all posts
Showing posts with label దీపం. Show all posts

వేడుకోదు


ఆరిపోయే చిరు దీపం నూనె కోసం వేడుకోదు, పోస్తే వెలుగుతుంది లేదా ఆరిపోతుంది, నీ ప్రేమ కోసం వేచి ఉంటా కానీ, అడగను ఆగడాలు చేయను....

A fading little lamp doesn't beg for oil; if you pour it, it will light up, or it will go out. I will wait for your love, but I won't ask for it, and I won't cause trouble....

🩵

వేకువ లేనిదే జీవితాన్నే గడపలేము


దీపం వంటి సన్నిహితులు ఎందరో, కానీ నువ్వు నా వేకువ వెలుగులాంటిదానివి, దీపం లేనిదే చీకటిలో చూడలేము కానీ వేకువ లేనిదే జీవితాన్నే గడపలేము..

There are many closer ones like lamps, but you are my sunshine because while a lamp helps us see through the darkness, our survival depends on the sunlight..

💜💜💜

వెలగదు

మంచుతో కప్పిన దీపములా, వెలిగే ఆశే లేదుకదా, వేకువ మంచును కరిగించినా, దీపాన్ని వెలిగించలేదు కదా..

Like a lamp covered with snow, there is no hope for it to light, Even if the morning melts the snow, it can't light the lamp again..

💜💜

వేకువ దీపము

వేకువన వెలిగించిన దీపము కాదు నీ ప్రేమ వ్యర్ధమవ్వడనికి,
ఆ వెలుగులో కూడా మనసు చీకటైతే వెలుగు చూపించేది నీ ప్రేమ...

Your love is not a lamp lit in broad daylight to be wasted; it is meant to shine and give light when the heart is gloomy, even in the brightest of days..

💜💜

నీతోనే ఉన్నా సరే ఎగరగలను వెలగగలను

ఎగిరే పక్షులకు,
నింగికేసి వెలిగే దీపాలకు,
భూమి ఆకర్షణ పని చేయదేమో అని అనుకుంటే పొరపాటే, ఆకర్షణ ఉన్నా సరే,
అవి ఎగరడం నేర్చుకున్నాయి,
పైకి వెలగడం నేర్చుకున్నాయి, చెలి నువ్వు నన్ను దాసుడిని చేయలేదు,కేవలం నాకు నేను ఎగురుతూ వెలుగుతూ కూడా నీతోటే ఉండటం నేర్చుకున్న మనసును...

For birds that fly,
oil lamps that light up to the sky,
it is a mistake to think that gravity doesn't work.
They have learned to fly and to light up.
Dear, I am not enslaved by you.
Trust me, I do fly and light up,
even if I stick with you always...

💜💜

విరహపు కలుగు

 నా విరహాన్ని సంద్రంలో నింపి,
తోకచుక్కని వత్తిలా ఉండమని వేడుకొని,
వెలిగిస్తా అఖండ దీపాన్ని,
నువ్వు చూడకున్నా నీ కనులను చేరుతుంది ఆ వెలుగు,
నీకు తెలియకనే నీకు తెలుస్తుంది నాలోని విరహపు కలుగు.... 

I want to fill the ocean with the emptiness in my heart,
I'll request the comet to become a wick and light a lamp so bright that your eyes will notice it without a peep,
and you'll understand how much void I'm feeling.


💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...