Showing posts with label పేరు. Show all posts
Showing posts with label పేరు. Show all posts

నిన్ను తలచుకొని రాసినంతలో అక్షరంపై నీటిబొట్టు


నిన్ను తలచుకొని రాసినంతలో అక్షరంపై నీటిబొట్టు, ఇంతకు రాసింది నీ పేరు మట్టుకే, మేఘం దానికే కరిగిపోయిందా అనుకున్నా, కానీ నా గదికి పైకప్పు ఉండగా మేఘం ఎలా చదివింది అనుకున్నా, కానీ అవి నా కనుల మేఘాలు, చినుకు కాదది నా కన్నీటి బొట్టు...

As I write thinking of you, a drop of water fell on the letter. I thought the cloud had melted away, having only written your name. But then I wondered how the cloud could read it, since my room has a ceiling. Then I realized these were the clouds of my eyes, and the drops were tears from my eyes...

तुम्हारे बारे में सोचते हुए लिख रहा था कि अक्षर पर पानी की एक बूंद गिर पड़ी। मैंने सोचा कि बादल सिर्फ तुम्हारा नाम लिखकर पिघल गया होगा, लेकिन मेरा कमरा तो छत वाला है, तो बादल ने कैसे पढ़ा? फिर समझ आया कि ये मेरी आंखों के बादल हैं और ये बूंदें मेरी आंखों के ही आंसू हैं।

🩵

నా మనసుపై రాశాను పదిలమైపోయింది


రాతి పలకలపై నీ పేరు రాస్తుంటే కరిగిపోతున్నాయి, పూల రేకులపై రాస్తుంటే వాడిపోతున్నాయి, నీటి అలలపై రాస్తుంటే నీరు ఆవిరైపోతోంది, నా మనసుపై రాశాను పదిలమైపోయింది, అక్కడ తప్ప నీ పేరు ఇంకెక్కడ ఉండనంది...

I wrote your name on stone slabs, they melted away.
Wrote it on flower petals, they withered.
Wrote it on the waves of the water, the water evaporated.
I wrote it on my heart, and it remained there forever.
There is no place where your name will be more cherished than here..

💙

నిఘంటువు కూడా వివరించలేదు



ప్రతి నిఘంటువులో నీ పేరుకి అర్థం ఉంది కానీ నీ అర్థాన్ని వివరించలేదు, నీ సొంతం అయిన వాడికే ఆ అర్థం తెలుస్తుంది కాబట్టే నాకు తెలిసింది...

Every dictionary has a meaning of your name but it doesn't explain your meaning, only one who owns you knows that meaning so I know...

💞

నీ పేరు



నేను నిన్ను కలిసిన తర్వాత, మేఘాలు సంద్రాల ఆవిరిని కాక అంతకంటే పరిమాణంలో ఎక్కువగా ఉన్న నా భావాల ఆవిరిని సంగ్రహించడం ప్రారంభించాయి. నువ్వు ఎప్పుడైనా వర్షంలో చిక్కుకుని, నీటి బిందువులకు బదులుగా చుక్కలు నీ పేరును కలిగి ఉండటం చూస్తే ఆశ్చర్యపోకు..

After I met you, clouds began to consider capturing the vapors of my feelings, as they exceed the volume of water in the oceans. Don't be surprised if you ever get caught in the rain and see drops spelling out your name instead of water droplets..

💞

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...