Showing posts with label నిజం. Show all posts
Showing posts with label నిజం. Show all posts

నిజాన్ని కలగా మార్చావు

నిజాన్ని కలగా మార్చిన ఘనత నీ పరిచయానిది, ఎందుకంటే, కలలోనే కదా దేవతలు కనిపించగలరు? అందుకే నీ పరిచయం నిజమైనా సరే కలలానే అనుకుంటున్నా... 

உண்மையை கனவாக மாற்றிய மகிமை உன்னுடையது.
ஏனெனில், தேவதைகள் கனவில்தான் தோன்றுகிறார்களே?
அதனால்தான், உன் அண்மை உண்மையானதாயிருந்தாலும்,
அதை நான் இன்னும் கனவாகவே உணர்கிறேன்…

The honor of turning reality into a dream belongs to you. After all, isn’t it only in dreams that we see angels? That’s why, even though your presence is real, I can’t help but feel it’s still a dream…

♥️

కల నిజం


I've met you twice, and I think that's enough. If you ask how twice could be enough, I'd say once in a dream and once in reality. Where else could I have missed you? If you tell me, I'll meet you there too.

मैं आपसे दो बार मिल चुका हूं और मुझे लगता है कि यह काफी है। यदि आप पूछें कि दो बार कैसे पर्याप्त हो सकता है, तो मैं कहूंगा एक बार सपने में और एक बार हकीकत मे। मैं तुम्हें और कहाँ भूल सकता था? अगर आप कहें तो मैं भी आपसे वहीं मिलूंगा.

🩵

మంచి కల కోసం అన్ని అంగళ్ళల్లో వెతికాను


మంచి కల కోసం అన్ని అంగళ్ళల్లో వెతికాను, కానీ వెతికే దారిలో ఒకటి దొరికింది, ఎవరో పారేసుకున్నది దొరికింది, నిజమై నాతో ఉండిపోయింది...

I tirelessly searched countless night markets, yearning for a perfect dream. Yet, amidst this futile quest, I stumbled upon a dream discarded by another. This dream, however, has become a precious gem of my reality, forever etched in my heart..

एक अच्छे सपने की प्यास बुझाने के लिए कई रात के बाजारों में लगातार खोजा। लेकिन, इस निष्फल यात्रा के बीच, मुझे किसी का खोया हुआ सपना मिला। वह सपना अब मेरी हकीकत का एक अनमोल रत्न बन गया है, हमेशा के लिए मेरे दिल में अंकित हो गया है..

🩵

కలను దాటి వచ్చిన నిజం


కలను దాటి వచ్చిన నిజం, ఎదను దాటి పోయిన క్షణం, కొలను పైకి ఎగిరిన చేప, తిరిగి దూకే లోపే కొలను గడ్డకడితే...

A dream turned into reality, but it left the heart without notice. It’s like a fish jumping out of a pond for a change, only to find the pond frozen over before it can swim back in...

एक सपना हकीकत बन गया, पर दिल में खालीपन रह गया। यह ऐसा है जैसे कोई मछली तालाब से बाहर कूद जाए, लेकिन वापस लौटने से पहले तालाब बर्फ से जम जाए।

🩵

అలలెంత పొంగినా జాబిలి తడిసేనా


అలలెంత పొంగినా జాబిలి తడిసేనా, నా ప్రేమెంత పొంగినా నీ మనసు కరిగేనా, తారంటే కర్రకి అందే పండు కాదని, నీ రూపం నా చూపుకు కూడా అందనిదని, ఎంతగా చెప్పుకున్నా నమ్మలేనిది ఈ నిజం, కొత్తగా పుట్టుకొస్తే ఇస్తావా సర్వస్వం...

No matter how high the waves rise, will the moon get wet?
Just as my love swells, will your heart melt?
A star is not a fruit within reach of a stick,
Your beauty is beyond the reach of my sight.
This truth, no matter how often I say, is hard to believe.
If I were born anew, would you give me everything?

कितनी भी ऊँची लहरें उठें, चाँद भीगता क्या?
मेरा प्यार कितना भी बढ़े, तेरा दिल पिघलता क्या?
तारा तो छड़ी से तोड़ा जाने वाला फल नहीं,
तेरी सुंदरता मेरी निगाहों से ओझल है।
यह सच कितनी बार कहूँ, विश्वास नहीं होता।
अगर फिर से पैदा हुआ, तो क्या सब कुछ देगी?

🩵

నమ్మేంతగా లేదు నీ ప్రేమ


నమ్మేంతగా లేదు నీ ప్రేమ, నీ నవ్వు చూసి పొరబడ్డానా, లేక కల కంటున్నానా, నిజములో నీలా ఒకరుంటారని నమ్మలేకున్నా, అందుకే దొరికినా సరే నమ్మేంతగా లేదు నీ ప్రేమ....

मुझे तुम्हारा प्यार सच नहीं लगता
क्या तेरी मुस्कराहट ने मुझे धोखा दिया, या ये सपना है?
सच में तुम जैसे कोई होते हैं, ये मुझ पर विश्वास नहीं होता
इसलिए, मिल भी गया हूं तो भी, तुम्हारा प्यार मुझे इतना सच नहीं लगता..

I can't believe your love is real.
Have I been deceived by your smile?
Or am I simply dreaming?
I can't believe someone like you actually exists.
That's why, even though I've found you, I can't fully believe your love...

🩵

నిజమైన మార్పు

A true change doesn't struggle much. It is as soft as a root that can pierce through any hard ground.

వెన్నలకోసారి కల వచ్చింది



వెన్నలకోసారి కల వచ్చింది, వేకువ చూసినట్టుగా, రాతిరి వీడినట్టుగా, ఆ కల నాకు పంపి అడిగింది నిజమెంత అని, నా చెలి నను వీడటం నిజమైతే నీ కల కూడా నిజమౌతుంది అని విన్నవించాను...

Once upon a time, the moon had a dream, as if it had seen the dawn and left the night. It sent that dream to me and asked how true it was. I pleaded that if it is indeed true that my beloved is leaving me, then your dream will come true..

💞

కదా నీపై మనసయ్యంది కదా

దివి దించిన కర్పూరమా,
దివ్వెలకు రారాణి నీ రూపమా,
మది పెంచిన మందారమా,
కంపించే భావాలకు ఆరాద్యమా,
లేత గాలి లేడీ పరుగు తీస్తుంటే ,
నాలో వేటగాడు బానమేస్తున్నాడే,
ఏడు జన్మలు నీతోటే అని తెలిసుంటే నాకు,
ప్రతి సారి ఇది మొదటి జన్మే అని విధిరాతను మోసం చేస్తుంటానే,
ముద్దాయిగా నన్ను నిలబడమంటే, 
నీ అడుగుల సాక్ష్యం మట్టుకే తీసుకుంటాను,
వాటికి ఏ అభ్యంతరం లేకుంటే,
మరిన్ని చిలిపి నేరాలు నీతో చేస్తూ పోతాను,
కదా నీపై మనసయ్యంది కదా,
కదా నాలో మెరుపొచ్చింది కదా,
అలా నిను చూస్తుంటే అలా,
కలా ఇది నిజమా కలా...

💜💜

నిజం కల

ఇలలో నిజం కూరుకుంది, కలలో చిగురించాయి దాని చివురులు,
ప్రేమ పోసి నిజాన్ని పెంచి పోషిస్తుంటే,
వాటి పూలు కలలో పూచాయి,
కనులతో చూడగలుగుతున్నానే తప్ప,
చేతులతో అందుకోలేకున్నా...

I sowed truth in reality; its ends sprouted in dreams.
Love was used to nurture the truth.
Its flowers bloomed in dreams.
I am able to see with my eyes,
but I can't touch with my hands...

💜💜

నీది జ్వలించే ప్రేమ కానీ ధహించే ప్రేమ కాదు

నీది జ్వలించే ప్రేమ కానీ ధహించే ప్రేమ కాదు, నిన్ను చూసేవారికి కనిపించేది నిప్పు, కానీ నీలో ఉన్నది రగిలే నిజం మాత్రమే...

Your love throws flames, but it doesn't burn anyone. Those who look at you can see the fire, but what you truly possess is intensified truth and honesty..

💜💜

దాగున్న నిజం

సూర్యకాంతికై ఎదురుచూసే నిద్రాణమైన విత్తనంలా నిజం ఒక్కోసారి కప్పబడి ఉంటుంది, వేకువ కిరణం తగిలినంతలో చిగురిస్తూ అద్భుతాలు ఊపిరిపోసుకుని వెలిగిపోతుంది....

Like a dormant seed awaiting the sunshine,
Truth lies hidden, shrouded in disdain,
Yet in the glow of the morning sun,
Its radiance shines bright, its beauty won...

💜💜

ప్రేమించలేదు అనడం సాధ్యమా?

మహా వృక్షమైన విత్తనాన్ని చూపించి నేను ఎన్నడూ దాన్ని ప్రేమించలేదు అనడం నేలకు సాధ్యమా? నాలో పొదిగిన పెరిగిన భావాలనడుగు నీ ప్రేమ ఎంతని 

the soil cannot deny the fact that it never cared the seed when it already become a tree and there is nothing else to sprout. Look at me and my grown feelings to understand how much you loved me...

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...