నిర్మానుష్యం ఆ ఆకాశం నిర్వీర్యం అ వెన్నల సౌధం ఎన్ని చుక్కలు వుంటేనేమి ఎంత చీకటి కమ్మితేనేమి జ్యోతి లేని ఆ నింగి నీరు లేని కడలిలా వెల వెల పోతుంటే నేనున్నానంటూ చిగురించింది ఓ పరిమళం అది చల్లని గాలో లేక వెచ్చని వెలుగో తెలియదు ఎప్పటికి నిరంతరాయంగా సాగిపోయే స్వేచ్చా జీవిలా అందరికి ప్రాణమందించే స్నేహ భావంలా నవరసాల సమ్మేళనంతో నవరసభరితంగా సాగిపోతోంది |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
నవరసభరితం
Subscribe to:
Post Comments (Atom)
you are a poem
வரிகளில்லை — எழுத இயலாத ஒன்றாக அது. அழகாக ஒன்று, அன்பாக ஒன்று. பக்கங்களுக்குள் கட்டிவைக்க எந்தப் புத்தகத்துக்கும் இயலாதது. தங்கிப் போகப் பிற...

10 comments:
బాగుంది
అమావాస్య దాటి, నెలవంక వెన్నెల తోడుగా అడుగిడగా..కడలి అలలలో చైతన్య ఝరి..నవరసభరితంగా సాగే వెన్నెల ప్రవాహంలో అరవిరిసిన పువ్వుల పరిమళాలకు తోడుగా ప్రకృతికాంత కళ్యాణ రాగాలు...
వచ్చేసా కళ్యాణ్ గారూ! మీకు నా హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు! మీ జీవితం నవరసభరితంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను! wish you a very happy birthday!
కళ్యాణ్ గారూ...ఇవాళ మీ పుట్టినరోజా.. చెప్పనే లేదు. జన్మదిన శుభాకాంక్షలు...మీ జీవనయానం నవ్వుల నదిలో పువ్వుల పడవలా సాగిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
కవిత బాగుంది కళ్యాణ్‌గారూ...
మీకు హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు..
పుట్టిన రోజు శుభకాంక్షలు.
Happy Birthday to you.. Kalyan garu! :)
కళ్యాణ్ గారూ జన్మదిన శుభాకాంక్షలు..పైన జ్యోతిర్మయి గారి కామెంటు అదుర్స్. ఇక నవరసజ్ఞభరితం గురించి ఎంత చెప్పినా తక్కువే లెండి. కవిత బాగుంది చాలా.
కళ్యాణ్ గారికి సంకలిని తరఫున జన్మదిన శుభాకాంక్షలు
http://www.sankalini.org/
ఇంతింతై వెలుగంతై
కోటి సూర్య కాంతులై
నా స్నేహమై
నా మంచి కోరుతూ
అందించిన సుభాకాంక్షలకు అందరికి నా ధన్యవాదాలు :)
Post a Comment