Showing posts with label మేఘాలు. Show all posts
Showing posts with label మేఘాలు. Show all posts

కన్నీటిని కురిపించకుండా ఉన్నాయి


నీ కలలే నా కనుల మేఘాలు, 
నీ జ్ఞాపకాల ఆవిరిని తీసుకున్నా,
నీ తాకిడికి దూరంగా వాడిపోయి ఎండిపోయినా,
తృప్తి చెంది కన్నీటిని కురిపించకుండా ఉన్నాయి...

My eyes should be the clouds of your dreams,
Having absorbed the vapor of your memory,
Far from moisture, dry and withered,
Yet satiated without raining in your absence...


मेरी आँखें तेरे सपनों के बादल हों,
तेरी याद की भाप पीकर भी,
नमी से कोसों दूर, सूखे हों,
तेरे बिना बरसे बिना भी तृप्त हों।

🩵

పసుపు పాదాలు


పసుపు పాదాలు, 
పారిజాతాలు,
పాల మేఘాలు నేలపై, 
ముద్దబంతి పరవళ్ళు, 
నిమ్మకూ అందని రంగులు,
తెలుగు గడప అలిగేంత 
సొగసు తాపడాలు,
బంగారమే వెలవెలబోయే 
మెత్తని పసిడి పాదాలు...

💕

నా ప్రతి అక్షరం నీకై ఎగురుతూనే ఉంటుంది

ఆవిరై మేఘాలను చేరే దాకా ఆగలేక రెక్కలు కట్టి ఎగిరిన కడలి చుక్కలా,
నీ చూపు తగిలేదాక ఆగకుండా నా ప్రతి అక్షరం నీకై ఎగురుతూనే ఉంటుంది..

Like a droplet flying with its wings, unable to stop until it evaporates and reaches the clouds,
Every letter of mine keeps flying to you without stopping...

💜💜💜


ఆగిపోయాయి అన్నీ

మేఘాలన్నీ ఆగిపోయి దారి ఇవ్వట్లేదు అంటోంది ఈ రాతిరి, చీకటి నుంచి వేకువకు తన ప్రయాణం ఆగిపోయింది,
వెలుగు పురివిప్పి నువ్వు అందాన్ని చల్లుతుంటే, మత్తులో తూలి ఆగిపోయాయి అన్నీ..

The night complained that all the clouds had stopped and did not give way. Its journey from darkness to dawn came to a halt when you spread the wings of light and sprayed your beauty all over the sky. It intoxicated everything, causing everything to come to a stop..

💜💜

ఓడిపోయాను

నీ మనసును వినాలనుకునే క్రమంలో నా వినికిడిని ఎంతగానో పెంచుకున్నా, 
నత్త వేసే అడుగుల చప్పుడు వినగలిగాను, 
మొగ్గ పువ్వుగా మారేటప్పుడు అది పగిలే శబ్దాన్ని వినగలిగాను,
ఉప్పు నీళ్ళ కలయికలో వచ్చే అలజడిని వినగలిగాను,
కదిలే మేఘాల అలికిడిని వినగలిగాను,
కానీ ఇంకా నీ మనసు పలికే మౌనాన్ని అందుకోలేకున్నాను ఓడిపోయాను...

In the process of hearing your heart, I enhanced my hearing.
I could hear the snail's footsteps.
I could hear the sound of a bud bursting into a flower.
I could hear the tumult of saltwater mixing.
I could hear the waves of moving clouds.
But still, I can't grasp the silence that speaks your heart, and I'm defeated...

💜💜

చూపుల ఆవిరులే

నీ చూపుల ఆవిరులే కవితలు కురిపించే నా ఆకాశానికి నీలి మేఘాలు...

The vapours from your gaze is the dark clouds of my words raining sky...

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...