Showing posts with label తోట. Show all posts
Showing posts with label తోట. Show all posts

నా మాట లో నీ అందం


హాయిగొలిపే ఎండుటాకుల అలజడిలా, నా అందం నా మాటలలో కనిపిస్తుంది, మెత్తని లేత పూరేకులా, నీ అందం నీ కోమలత్వంలో దాగుంది, నా మాటకు నాపై ప్రేమ కలుగుతుంది నీ అందంతో నీపై ప్రేమ కలుగుతుంది, మన ఇద్దరం ఒకటైతే ఆ తోటను ప్రతి ఒక్కరూ ప్రేమించరా...

My beauty lies in the sound of my words, akin to the rustle of dry leaves flowing in the wind. Your beauty lies in the tenderness you possess, resembling the soft petals of a flower. I am loved for my voice, and you are loved for your beauty. Together, we dwell in a garden cherished by all...

💞

ఊసులాడుతుంది


ఎక్కడో ఒక పువ్వు వాడిపోయుంటుంది,
ఎక్కడో ఒక మొగ్గ నలిగిపోయుంటుంది,
ఎక్కడో రెమ్మ చిగురు కుళ్ళిపోయుంటుంది,
కానీ తోట రంగులు అద్దుకొని,
సువాసనలు వెదజల్లుతూ,
ఆ గాయాలను లెక్క చేయకుండా చిరుగాలి వచ్చినపుడు 
నవ్వుతూ ఊగుతూ ఊసులాడుతుంది...

Somewhere, a dead flower,
Somewhere, a crushed bud,
Somewhere, a rotten stem,
But the garden, adorned with colors,
spreads scent,
smiles and whispers their joy when the breeze arrives...

💜💜💜

నీ చెంత ఉంటే కలిగే తాపం



వేల రకాల పూలు తోటలో ఉంటే ఏ పువ్వు పరిమళాన్ని ఆస్వాదించాలో తెలియక సతమతమౌతూ మనసు పడే కష్టమే నీ చెంత ఉంటే కలిగే తాపం...

If there are thousands of varieties of flowers in the garden, it is difficult to know which flower to enjoy the fragrance of. The same struggle happens when I am with you...

💜💜💜

కన్నీరు ఉండచ్చు కానీ భయం కాదు

నా కన్నీటితో నిండిన సరస్సు పుట్టుకొని రావచ్చేమో కానీ భయంతో నిండినది కాదు, ఎందుకంటే నీ ప్రేమలో మనసు గాయపడచ్చు ఆ బాధ ఎలా ఉంటుందంటే, తోటను చేరకుండా ఆపే కంచె లాగా ఉంటుంది కానీ రాయి కింద పడి నలగినట్టు కాదు, కంచె వెనకాల ఏముందో కనిపించే దాకా విశ్రమించను దాటే ప్రయత్నం చేస్తూనే ఉంటాను, కానీ కనిపించకుండా మొత్తం మూసేస్తే దానిపై విశ్రమిస్తానే కానీ వదిలి పోను...

In the realm of my love for you, tears fill the lake, not fears. Though love can bring pain, it resembles a fence that prevents me from entering the garden, rather than someone crushing me under a stone. I'll persist in crossing the fence as long as it lets me catch glimpses beyond. If not, I'll rest upon it, refusing to depart..

💜💜💜

నీ పలకరింపుతో వేడి కాకుండా వెలుగునిచ్చాయి

వేకువ కిరణాలు వేసవి కిరణాలు మండి మండి,
వాటికీ సేద తీరాలని, వాటికీ నేల తాకాలని,
హిమగిరులపై వాలాయి గిరులే కరిగిపోయాయి,
పూల తోటపై వాలాయి అవి వాడిపోయాయి,
గడ్డి వాముపై వాలితే కాలిపోయింది,
చివరికి నీపై వాలాయి నెమ్మదించాయి,
నీ పలకరింపుతో వేడి కాకుండా వెలుగునిచ్చాయి...

After burning for so long, the rays of the summer sun wanted to rest. They landed on icy mountains, causing the mountains to melt. They then rested on the flora, causing the flowers to fade. When they tried to rest on the grass, they got burnt. After a long search, they finally rested on you and gave light instead of heat..

💜💜

నీ అందంలోని రుచి చావదు

వేపతోటనంతా సారం తీసి కలిపినా నీ అందంలోని రుచి చావదు, ఎందుకింత అందంగా ఉన్నావు?

Your beauty's taste will not fade away, even if it were mixed with the essence of the entire neem garden. Why are you so beautiful?

💜💜

కొండ దిగువున పూల తోటకు ఎన్ని ముప్పులో


కొండ దిగువున పూల తోటకు ఎన్ని ముప్పులో, ఏ చరియ పడి వాటిని నలిపేస్తుందో, అయినా ఆ నీడలోని ప్రేమకోసం ఆ ముప్పును లెక్కచేయవు...

No matter how many threats to the flower garden at the foot of the hill, wouldn't know which cliff falls and crushes them, still that threat does not count for the love in Hill's shadow...

💜💜, ఏ చరియ పడి వాటిని నలిపేస్తుందో, అయినా ఆ నీడలోని ప్రేమకోసం ఆ ముప్పును లెక్కచేయవు...

No matter how many threats to the flower garden at the foot of the hill, wouldn't know which cliff falls and crushes them, still that threat does not count for the love in Hill's shadow...

💜💜

గాలి పలకపై నీకై లేఖలు

గాలి పలకపై నీకై లేఖలు రాస్తే ఎన్ని పూల తోటలు ఈర్ష్య పడ్డాయో ఆ లేఖను చదివి,
ఇంత అందగత్తె ఎక్కడ ఉందని వెతకడానికి ఆ లేఖను వెంబడిస్తూ వెళ్ళాయి కదిలి,
ఆ ఉత్తరం స్వర్గాలను దాటి అద్భుత లోకాన్ని చేరుతుందేమో అని అనుకున్నాయి,
కానీ ఈ భూలోకాన్నే ఉన్న నిన్ను చేరుకోవడంతో నువున్న చోటే అద్బుతం అని తెలుసుకున్నాయి...

all the gardens become envious of you after reading the letter I wrote on the wind slate, 
They chased the letter to find out where such a beautiful woman is,
they were expecting that it may reach the sky and cross all the heavens,
to their despair it reached you on this earth,
So they realised your presence makes any place a wonderland and so you are a lovely woman....

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...