Showing posts with label చినుకు. Show all posts
Showing posts with label చినుకు. Show all posts

మధురంగా ఉండాలని


ఆదేశాలు ఇచ్చాను తేనెటీగకు మబ్బులన్నీ తేనె పట్టుతో కప్పమంటూ, తనపై వాలే ప్రతి చినుకు మధురంగా ఉండాలని మధురంగా ఉండాలని..

I gave instructions to the bees to cover all the clouds with honeycomb, so that every drop that falls on her would be sweet enough...

💞

విలువైన ప్రేమ

చినుకులు తగిలిన నేల మెరుగుపడుతుంది కానీ నేల నాణ్యత చూసి చినుకు పడదు, నీ ప్రేమ సోకి నా విలువ పెరిగిందే కానీ నా విలువ చూసి నువ్వు నన్ను ప్రేమించలేదు...

The quality of the land touched by raindrops improves. Otherwise, the raindrops won't consider the quality of the land they shower upon. Just as your love improved my life, but you didn't love me for something valuable in me...

💞

ఏమో


నీటిలో పడ్డ ఒక చినుకును వెతికి వెలికి తీయగలవా, అయితే తన ప్రేమను పొందగలవు...

If you can rescue the raindrop drowning in the water, then yes, you can gain her love...

💜💜💜

ఊదా రంగు చినుకు




చినుకులలో ముత్యాలయ్యే చినుకులు కొన్ని,
నేలను చెమ్మ చేసి ముద్దాడే చినుకులు కొన్ని,
కానీ రంగు మారి నా దోసిళ్ళలో పడ్డ చినుకు నువ్వు,
 జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతంగా మిగిలావు...

A few pearly drops among thousands of raindrops,
A few drops that kiss the ground and keep it wet,
But you are a purple drop that fell into my hands directly, becoming a once-in-a-lifetime occurrence...

💜💜💜

కరగని అందం

నీ అందాన్ని మోసి తీసుకురావాలని వాలే ప్రతి చినుకుకు పని ఇచ్చాను, మబ్బులు కరిగిపోయాయి,
సంద్రం నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని కురిపించింది,
సంద్రం మాయమైంది,
ఎంత మోసినా తరగనిది నీ అందం అని తెలిసి ప్రయత్నాన్ని విరమించుకున్నా, అక్షరాలతో నా వరకు వచ్చిన అందాన్ని నింపుతున్నా..

I entrusted every rain drop to carry your beauty; the clouds melted away.
The sky borrowed drops from the oceans and poured it,
The oceans vanished,
Knowing that your beauty is inexhaustible.
No matter how much I carry it, I gave up the effort,
Instead, I am reforming the beauty that came to me with letters...

💜💜

క్షణికమైన వాన చినుకు కాదు

నీ ప్రేమ క్షణికమైన వాన చినుకు కాదు, అది అరుదుగా పడే గ్రహశకలంలా బలంగా ఢీకొడుతుంది, ఒక్కసారి పడితే తిరిగి పోదు, దాని ప్రభావం జీవితాంతం ఉండిపోతుంది చరిత్రలో నిలిచిపోతుంది....

Your love is not a raindrop fleeting,But it hits hard like a rare asteroid, Once it falls, its impact endures, Etched in history, forevermore...

💜💜
కలలో కాలం ఆగిపోతుంటే, ఇలలో వేగం పెరిగిపోతుంటే, ఏలోకంలో నా నివాసమో తెలియక అటు ఇటు ఊగుతున్నా, నిత్యం రగిలే అగ్ని పర్వతంపై పడిన చినుకులా మరలా ఆవిరై మేఘాలను చేరిపోతున్నా, అంతు చిక్కని ఈ చక్రంలో చిక్కుకొనిపోతున్నా..

the time is slow in the dreams, and the time is too faster in reality, I am swaying between the worlds not knowing where my abode is, like a drop fell on a forever erupting volcano, evaporating again to reach the clouds, and getting stuck in an never ending cycle ..

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...