Showing posts with label బ్రహ్మ. Show all posts
Showing posts with label బ్రహ్మ. Show all posts

రెప్పల వేగాన్ని నిర్ణయించేది నా హృదయమే


నా కనురెప్పలను చేసింది బ్రహ్మే కానీ నిన్ను చూస్తున్నప్పుడు ఆ రెప్పల వేగాన్ని నిర్ణయించేది నా హృదయమే...

The creator crafted my eyelids, but it's my heart that controls their pace as I look at you...

💜💜💜

పారిజాతమా

బ్రహ్మ సృష్టిని తప్పించుకున్న పారిజాతమా మన్మధుడు బాణం వేస్తే పుట్టుకొచ్చావా..

Oh, night jasmine, are you the one who escaped from Brahma's creation and was born from the arrow shot by Manmadha?

💜💜💜

కొత్త దేవత

కొత్త దేవతను నియమించాడో ఏమో ఆ బ్రహ్మ, అతను నీకు హృదయాన్ని పెట్టకుండా తేనె తుట్ట పెట్టాడు, నా విధి రాతలో బ్రహ్మ చెప్పింది రాయకుండా, కొంత మరచిపోయి నన్నే రాసుకోమన్నాడు, తప్పు మీద తప్పు చేసినా మంచిదే జరిగింది, అసమాన్యమైన నీ పరిచయం కావాలని రాసుకున్నా, తేనెలొలికే నీ హృదయాన్ని రుచి చూస్తూ ఉన్నా, నేను రాయని విధిలో ఇంకేముందో తెలియదు కానీ, నీ దూరం తప్ప ఏమున్నా సరే జరగని....

💜💜

చుక్కలన్ని అమ్మలక్కలై

చుక్కలన్ని అమ్మలక్కలై నీ గురించే మాట్లాడుకుంటున్నాయి ఎవరీ కొత్త జాబిలమ్మ అని, అసలైన జాబిలి బ్రహ్మకు మొర పెట్టుకుంది తన స్థానానికి రాజీనామా చెయ్యనని...

All stars are gossiping about this new moon, and the existing moon is pleading with Lord Brahma not to be replaced with you.

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...