Showing posts with label అలలు. Show all posts
Showing posts with label అలలు. Show all posts

మన అడుగులను తుడుస్తూ తుడుస్తూ అలలు అలసిపోవాలి



తీరంపై ఎన్ని జ్ఞాపకాలు ముద్రించాలో తెలుసా, మన అడుగులను తుడుస్తూ తుడుస్తూ అలలు అలసిపోవాలి...

Do you know how many memories we have to print on the shore? The waves have to get tired by washing away our prints...

💞


పిచ్చి ప్రేమ



వెనక్కి తగ్గి దారి వదలదు ఏ సంద్రము, దరికి రావద్దు అని పదే పదే తోసిపుచ్చే అలల పదజాలము, అయినా సరే వెళ్లగలిగేది ఇద్దరే, ఈత తెలిసి ధైర్యం ఉన్నవాడు, పిచ్చి ప్రేమతో అందులోనే మునిగి ఈత నేర్చుకునేవాడు....

No shore gives you the way to come in; the waves always keep us at bay and tell us not to come in. But still, the only ones who can go are the brave ones who know how to swim, the ones who learn swimming by diving into it with crazy love..

💜💜💜

సంద్రంలో కొండను విసిరినా

సంద్రంలో కొండను విసిరినా అది కలిగించే అలజడి ఎంతమాత్రమూ తెలియదు, 
పడిన చోట గుర్తు తెలియదు,
కానీ నా భావ సంద్రంలో విసిరే నీ ఆవగింజంత పలకరింపైనా,
మది తీరాన్ని ముంచేలా అలజడి రేపుతుంది,
నింగిని తాకేలా అలలు ఎగసిపడతాయి...

Throwing a hill into the ocean does not reveal how much of a stir it will make, nor will it leave a mark on the place it is present. 
However, even if you throw a word the size of a mustard seed into my heart, 
it engulfs my heart's shore,
and it raises the waves sky high...

💜💜

తృప్తి చెందుతావో సాహసివై సంద్రాన్ని ఎలుతావో

పడి లేచే అలలు,
పిల్లల కోసం,
ఆటుపోట్ల కెరటాలు ఆటగాళ్ళ కోసం,
నడి సంద్రంలోని అందాలు సాహసించే వారికోసం,
అలలతో ఆగుతావో ఆటుపోట్లు చూసి తృప్తి చెందుతావో సాహసివై సంద్రాన్ని ఎలుతావో...

The waves are for children, the tidal waves are for players, the beauty of the ocean's middle is for those who dare. It's up to you whether you stop with the waves, are satisfied with the tides, or choose to be adventurous and rule the ocean.


💜💜

సంద్రం కలిగిన తీరు ఇదేనేమో

సంద్రం కలిగిన తీరు ఇదేనేమో,
నేల మనసులో నింగి కలిగించిన విరహానికి,
తల్లడిల్లి తన మనసు కరిగిపోయి ఆటు పొట్లు కలిగాయేమో,
నింగిని తను చూస్తునంతకాలం అలలు ఆగిపోవడం జరగదేమో....

Maybe this is the way the ocean was created? The heavy feelings that the sky created in the heart of the earth caused it to melt and resulted in everlasting tides. Until the sea reaches the sky, the tides will never stop..

💜💜
నావికుడి ధైర్యం సముద్రం యొక్క లోతు, ఓడ యొక్క బలం మరియు గమ్యం యొక్క దూరానికి సరిపోలాలి; లేకుంటే, అతను అలల మీద పొరపాట్లు చేసి చివరికి చేరుకోలేడు. నిజమైన ప్రేమికుడివి కావాలనుకుంటే, అటువంటి ధైర్యసాహసాలు కలిగిన నావికుడిగా ఉండు. 

The bravery of a sailor should match the depth of the ocean, the strength of the ship, and the distance of the destination; otherwise, he may stumble upon waves and fail to reach the end. If you want to be a true lover, be a sailor who possesses such bravery

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...