Showing posts with label తేనె. Show all posts
Showing posts with label తేనె. Show all posts

తేనెపట్టు


ఏ జాతి తేనెటీగకి ఇంత నేర్పు ఉందో తెలియట్లేదు,
తేనెపట్టు చెట్టుకే కాదు కడుపులోనూ ఉంటుందని నిన్ను చేతికి తీసుకున్నాక తెలిసింది,
సమయం గడిచేకొద్దీ ఈ తేనెపట్టు నవ్వుల తేనెలూరిస్తూ మరింత పెరుగుతోంది...

I wonder what kind of bee could be so skilled,
To build a honeycomb, not in a tree, but within one's belly.
I only realized this when I held you in my hand.
As time passes, this honeycomb fills with honeyed laughter, growing ever larger...

❤️

మధురంగా ఉండాలని


ఆదేశాలు ఇచ్చాను తేనెటీగకు మబ్బులన్నీ తేనె పట్టుతో కప్పమంటూ, తనపై వాలే ప్రతి చినుకు మధురంగా ఉండాలని మధురంగా ఉండాలని..

I gave instructions to the bees to cover all the clouds with honeycomb, so that every drop that falls on her would be sweet enough...

💞

నింగి తేనెపట్టు


అందరిపై మబ్బునున్న చినుకులు పడుతుంటే, నాపై తేనె చుక్కలు కురిశాయి, ఏ తేనెటీగ నింగిలో తేనెపట్టు పెట్టిందో, ఆ తేనె రుచుల కన్నా నాకు ఆ తేనెటీగ పైన మనసు మళ్లింది...

While misty drizzle soaked everyone, drops of honey landed on me. I couldn't tell which bee built a hive in the sky, but my heart searched for that bee more fervently than for the sweetest honey...

💜💜💜

పెదవిపై మరుజన్మ


పువ్వు నుంచి విడిపోయి, చచ్చిపోయి, నీ నవ్వే పెదవిపై మరుజన్మ తీయాలని తేనెటీగ నోటిలోని తేనె చుక్క కోరుకోదా?

Separated from the flower, being dead, won't the honey drop in the mouth of the bee, wishing to fall on your smiling lips and be reborn again?

💜💜💜

కొంతసేపు ఆ మహాద్భుతాన్ని ఆస్వాదిస్తా

తేనె కొలనులో పడితే తియ్యటి అనుభూతి కలిగినా ఈదగలరా ఎవరైనా? సఖీ నీ చిక్కటి ప్రేమలోనూ ఎనలేని తియ్యదనం ఉంది కానీ ఈదడం మాని మునగడం నేర్చుకుంటున్నాను, తెలిసి కూడా ఈది తల్లడిల్లేకంటే మునిగిపోయి ప్రాణం ఉన్న కొంతసేపు ఆ మహాద్భుతాన్ని ఆస్వాదిస్తాను..

Can anyone swim in a pool of honey, even if it feels sweet? My dear, your love is thick with infinite sweetness. So I've stopped swimming and am learning to sink. Knowing that I will sink, I choose to embrace the greatness for a while instead of struggling..


💜💜

నీ ప్రేమ రవ్వంత చాలు

ఎంత బంగారమున్నా తేనెటీగ వాలదు, తేనె ఒక చుక్క చాలు అది వాలడానికి, నా చుట్టూ ఎంత మంది ఉంటే నాకెందుకు, రవ్వంత అయినా సరే నీ ప్రేమ చాలు..

Regardless of the abundance of gold, the bee will not surrender to its allure. It only takes a mere drop of honey to attract it. Similarly, no matter how many are with me, it holds no significance. A single glimpse of your grace is enough...

💜💜

కొత్త దేవత

కొత్త దేవతను నియమించాడో ఏమో ఆ బ్రహ్మ, అతను నీకు హృదయాన్ని పెట్టకుండా తేనె తుట్ట పెట్టాడు, నా విధి రాతలో బ్రహ్మ చెప్పింది రాయకుండా, కొంత మరచిపోయి నన్నే రాసుకోమన్నాడు, తప్పు మీద తప్పు చేసినా మంచిదే జరిగింది, అసమాన్యమైన నీ పరిచయం కావాలని రాసుకున్నా, తేనెలొలికే నీ హృదయాన్ని రుచి చూస్తూ ఉన్నా, నేను రాయని విధిలో ఇంకేముందో తెలియదు కానీ, నీ దూరం తప్ప ఏమున్నా సరే జరగని....

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...