Showing posts with label సౌందర్యం. Show all posts
Showing posts with label సౌందర్యం. Show all posts

ఓడిపోతోంది



తేలికపాటి దుమ్ము కణిక కూడా కింద వాలాల్సిందే, అయినప్పటికీ భూమి తనవైపు లాగలేని ఒకేఒక్కటి ఏంటో తెలుసా? నీ అందం, అంతులేని సౌందర్యంతో అంత బరువున్నా లాగలేకుంది ఓడిపోతోంది..
Even the lightest speck of dust has to fall, yet do you know what the Earth can't pull towards itself? Your beauty. Though it's endless and heavy, gravity fails to do so..

💞

నువ్వు ఎక్కడ


తామర కనిపించకుండా దాని తూడు కనిపిస్తే చూడాలని ఎంత ఆసక్తిగా ఉంటుందో నువ్వు కనిపించకుండా నీ పాదం మట్టుకే కనిపిస్తే అలాగే ఉంటుంది. నిన్ను చూడటానికి ఆ పాదాలను కదలమని కాస్త విన్నవించుకోనా?

It sparks curiosity when the Lotus stalk is visible, even if the flower itself is not, much like your foot being visible without you. May I ask your feet to sway a bit and reveal your beauty to me?

💞

నీ ప్రేమను ఎలా పొందను


నీ అందాన్ని కాగితంపై బంధించడానికి కావలసిన కుంచె మరియు రంగులు ఎంత మహిమగలవై ఉండాలో ఊహించుకోవడమే కష్టం అంటే,
నీ సౌందర్యాన్ని ఎలా వర్ణించను!
నీ ప్రేమను ఎలా పొందను ప్రియతమా!..

It is difficult to even imagine how magical the brush and colors must be to capture your essence on the canvas. How can I go beyond and depict your beauty and win your love! My dear.

💞

హరివిల్లుల ప్రపంచానికి రాణివి


చెలి! మోసపోకు! నిన్ను మనిషిగా చూస్తారు, నిజానికి నువ్వు హరివిల్లుల ప్రపంచానికి రాణివి...

Don't fool yourself, as others see you as a human being, but you are indeed a queen in the world of rainbows...

💞

సొగసుల సౌధం


ఏదైనా గీయగల కలలకు అందని రూపం, ఏదైనా చూడగల ఊహకు అందని అందం, నీ సౌందర్యం ఓ సొగసుల సౌధం...

Your charm exceeds what dreams can draw and what thoughts can imagine; it's like a palace made of beauty bricks..

💜💜💜

నీ అందం అపురూపం అనిర్వచనీయం

నిన్ను చూసేటప్పుడు నా కనురెప్పలపై ఎంత బరువు మోపినా వాలదు,
కొండంత బరువైన నిదుర వాలని,
మిన్నంత లోతైన నొప్పి వాలని,
చలించదు చూపు మరలదు,
ఓ సౌందర్యవతి నీ అందం అపురూపం అనిర్వచనీయం...

No matter how much weight falls on my eyelids,
they don't blink while looking at you,
Weight can be the sleep as heavy as a mountain or weight can be the pain as deep as space,
oh beautiful lady, your charm is incredibly indescribable...

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...