ఎప్పుడు నీ చూపులో నేనొక చుక్కనైతే చాలు,
నీ ప్రపంచం ఎంత పెద్దదైనా నేను నీ నీడనుంటే చాలు,
నీ చేతిలో ఒక గువ్వనయ్యే అదృష్టం లేకున్నా,
నీ చుట్టూ తిరిగే తుమ్మెదైనా చాలు...
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
మోయవే నా మాటలన్నీ చేర్చవే నా ఊసులన్నీ మాయమైన స్నేహానికి మరపురాని నేస్తానికి ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా తన కనులు చూసి పలకరించు చినుకు చల్లి చెలిమి కోరు పరవశించి నాట్యమాడే అందమంతా నాకు చేర్చు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా కడలి చేరు తీరమంత వెతికి చూడు తన అడుగు జాడలు ఉన్నవేమో చిరునామా మరి తెలియునేమో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా దూరమంటూ ఆగిపోకు అంతటి స్నేహం ఎక్కడా దొరకదు తన చెలిమిని నీకు పంచుతాను వేగమంది తనను చేరు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా దారివెంబడి పూలు ఉంటాయి వాటి మత్తులోకి జారిపోకు మాయ చేసే మనుషులుంటారు మోసపోయి దారి మరచిపోకు కేరింతలు కవ్వింతలకు ఆదమరచి కురిపించకు దాచినదంత తనకే ఈ భారమంతా అ స్నేహానికే ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా |
చక్కనోడు చందురోడు పున్నమై వచ్చాడు చల్లని మేఘాలనల్లి నా చెలిని దాచాడు తారలలో ఉందేమో చూపులను పంపిస్తే వెన్నలను చూపించి నా కనులను దోచాడు మభునై పయనిస్తూ విను వీధులు వెతుకుంటే చల్లని గాలినే పంపి నన్ను చినుకులా మార్చాడు నా ప్రయత్నమంతా మానుకొని అలా చూస్తున్దిపోతుంటే తెలిసింది ఆ జాబిలే నా చెలి అని నాకోసమే అ కవ్వింతలని.... |
| అందని ఆకాశం నీవు అందాల ఓ పావురం నేలపై రాలిన ఎండుటాకులా చేసాను ఓ సాహసం రెక్కలు లేవు పక్షిని కాను గాలికి తోడై వస్తున్నా ఎంత సేపని గాలిలో ఉండను చావని ఆశల బరువుతో ఉన్నా నీతో స్నేహం కల అనుకున్నానే నాకై చినుకై దిగివోచ్చావే సీత కొకలా నటిస్తున్నా నన్ను చిలుకలా మర్చేస్తున్నావే నాపై అందరి అడుగులు పడకుండా నన్నే అడుగులు వేయించావు నీకిది తెలియదేమో ఈ ఎండుటాకునే పైపైకి చేసి ఒక నక్షత్రంల మర్చేస్తునావు నీకెలా రుణపడి ఉండను అ రుణాలకే అతీతంగా ఓ బందానిచ్చావే... |
![]() | జోకొట్టే జోరీగ రాగాలు నావి.. జో జో జో జో జో .. కిట్టయ్య వేణువు రాగాలు నావి .. జో జో జో జో జో... పాపాయి పల్లకి ఊయలలో .. పండిన వెన్నల నవ్వులలో.. నిండిన ఎదలో పొంగిన ప్రేమ... చెప్పే తియ్యటి కబురే నాది... ప్రేమ పంచె పాపాయికి ఈ లాలి పాట ఒక ఈడగునా.. స్నేహం పెంచే ఈ చిట్టికి నా మనసు మాట అంత హాయిచునా. నాలో ఏదో ఉప్పొంగుతునా .. భావాల వెల్లువ ఈ లాలి.. నాకై దాచిన ఈ ప్రాణంతో .. చేసిన పాటనే ఈ లాలి.. ఈ లాలి నిదురోవాలి.. ఈ రేయి హాయినివ్వాలి.. నా స్నేహం నీతోటే.. కలకాలం నిజమవాలి.. జోకొట్టే జోరీగ రాగాలు నావి.. జో జో జో జో జో .. కిట్టయ్య వేణువు రాగాలు నావి .. జో జో జో జో జో... |
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...