నిన్ను నువ్వు

నిన్ను నువ్వు అందంగా చూపించుకుంటే ఆ అందానికి మించిన అపురూపం ఆ రూపానికి మించిన అందం మరొకటి లేదు....

కొంతసమయం వరకే

మంచునుంచి కోలుకోదు వేకువ, 
విరహం నుంచి కోలుకోదు మనసు, 
కొంతసమయం వరకే....

అనురాగాలకు సమాధి

అభిప్రాయాలకు గుడికట్టి పూజించుకుంటే అనురాగాలకు సమాధి కట్టవలసిందే...

చీకటి రంగు

పగటికి చీకటి రంగు వేసావు నీ కురులతో....

నిహాల్ స్కంద

చిన్న వేషమే శ్రీనివాసుడా,
అల్లరి చేసే వెంకటేశుడా,
పడుకొనే ఎన్నెన్నో మహిమలు,
చూపాడు ఆ చిన్ని కృష్ణుడు,
పడుకొనే మా హృదయాలని,
గెలిచాడు ఈ కృష్ణుడు,
చేతులూపరా,
కాళ్ళు ఊపరా,
పాల బుగ్గల చిన్ని గోవిందా .... 


నామాలకు ఎంత మహిమో ,
నీ నవ్వులకు అంతే మహిమ,
ఆ పాదాలేమో ముక్తి నిచ్చునో,
ఈ పాదాలు మా ముద్దు తీర్చును,
అటు చూడరా,
ఇటు చూడరా,
ముసి ముసి నవ్వుల చిన్ని గోవిందా,
చిన్న వేషమే శ్రీనివాసుడా,
అల్లరి చేసే వెంకటేశుడా.... 


ఏడు కొండలు దాటితే కానీ ఆ దేవ దేవుడు,
చిన్ని ఊయల చేరితే చాలు మా చిన్ని బాలుడు,
తన భార్య కోపము కొండనెక్కిస్తే,
మా కోపము ను తీరిస్తే,
వాడికంటే ను గొప్ప దేవుడు,
మా మధ్యనున్న చిన్ని గోవింద,
చిన్న వేషమే శ్రీనివాసుడా,
అల్లరి చేసే వెంకటేశుడా....

మనకెందుకులే నాకేమిలే

మనకెందుకులే అని ఈ లోకాన్ని వదిలి కళ్ళు తిప్పుకుంటే, 
అది తిరిగి నన్నే చూస్తోంది,
కానీ లోకం వేరుగా నేను వేరుగా కనిపిస్తోంది,
లోకం తప్పు చేస్తే నేరం నేను చేస్తే చిన్న పొరపాటు,
అది మనసును ముక్కలు చేస్తే మోసం నేను చేస్తే సందర్భం,
అది సాయపడకుంటే నిర్దాక్షిణ్యం నేను చేయకుంటే చేతకానితనం,
ఎందుకో ఇంత తేడా అహం  పేరుకుపోయిందేమో నాలో,
అహమే కనుక తోలుపై ఉండేదైతే,
కోసివేసి కుంపటిలో పారవేసి ఉంటానే,
కాని కనిపించదు వదలిపోదు,
అవును ఒప్పుకుంటున్నా లోకమా నీలో నేను ఒకడినే, 
నువ్వే నేను నేనే నువ్వు,
నేను మారితే నువ్వూ మారుతావు...

ఒకే ఒక్క నక్షత్రం ఉన్న ఆకాశం

ఒకే ఒక్క నక్షత్రం ఉన్న ఆకాశాన్ని చూడాలా?  అయితే నువ్వు మాత్రమే ఉన్న నా మనసును చూడు....

దీపావళి

ఆ జువ్వ కంటే నా మదిని తాకే నీ నవ్వులే నాకు దీపావళి,
ఈ చీకటంతా వెన్నెలగా మార్చే నీ చూపులే నాకు దీపావళి,
మనది ఎన్నో పేలుళ్ల జీవితం,
అందులో కొన్నే సందళ్లు శాశ్వతం,
సగం చీకటి సగం వెలుగు కలిసిన పండుగై,
ఇద్దరమూ ఒక వేడుకై సాగిపోదాం...

గుండెకోత

కోసుకుంటే రక్తం కాక కన్నీరు ఎందుకో,
మోస్తూవుంటే బరువులేదు కానీ భారమెందుకో...

ఒక చక్కని పలకరింపు

విధిలేక వేకువ పలకరిస్తున్నా దానికి శోభ తెచ్చేది ఒక చక్కని పలకరింపు...

నేను గాలిని

నేను గాలిని,
స్వేచ్ఛగా తిరుగుతుంటా,
మంచి ముక్కులో దూరుతా,
చెడ్డ ముక్కులోను దూరుతా,
భేదాలు లేవు,
నన్ను ఆపని వారికి శ్వాసనౌతా,
నన్ను ఆపేవారిని దాటిపోతుంటా....

రాయి ఉలి ప్రేమ

రాయి సరైన ఉలిని ఎంచుకోలేకపోయినా, తప్పుడు ఉలితో విరుగుతుంది. అలాగే, హృదయానికి నిజమైన ప్రేమను ఎంచుకునే అవకాశం లేకపోవచ్చు, కానీ భూటకపు ప్రేమతో...