క్షణ బంధం

నాకోసమే నువ్వేమో

నీకోసమే నేనేమో

మిగిలిపోతున్నా నీ జ్ఞాపకంతో ఈ రాతిరికి

నీ నిదురమోస్తూ నే కలలుగంటూ

లేత గాయానికి సాక్షినౌతు

చెప్పలేకున్నా నీకు ఆ హాయి  నే అనుభవిస్తూ

కొద్ది సేపే ఈ పయనమైనా కొత్తగా అనుభవం

క్షణ కాలపు అనుబంధమైనా ఏ జన్మదో ఈ ఋణం

ఇలా తీర్చుకున్నా నీ సేవలో

పదే పదే తలచుకుంటున్నా నీకది తెలియకున్నా  ....

సుభాషిని గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

మీ స్నేహం గురించి ఎంత చెప్పినా చాలదు అందుకే ఈ అక్షర మాలికలతో మీకు మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు.

గమనిక : ఇందులో కేకు ఎవరికైనా కనిపిస్తే తీస్కోని తినేయండి . కనిపించలేదే అనుకుంటే కాస్త ఏకాగ్రతతో కళ్ళను జూమ్ అవుట్ చేసి చూడండి 

SubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubhaSubha

నవ్వే పారిజాతం

నవ్వే పారిజాతం

పలుకే తేనె పాతం

నిన్నే తలచినా పడిలేచే అలలా ప్రాయం

నేల రాలిన చినుకుల్లో కలసిన ఒక తారకలా

అది మళ్ళీ ఒక ముత్యమై కడలిలో దాగక

నీలా తిరుగుతుందేమో

అందరి మదిని దోస్తోందేమో ......

ఏ పేరు లేనిదీ ఎల్లప్పుడు నిలిచుండేది ..

ఏ బంధం పెట్టుకుంది శ్వాస నా ప్రాణంతో నేన్నెప్పుడు అడగలేదు

ఏ నమ్మకం పెట్టుకుంది నిదుర నా కనులపై నేనెన్నడు ఆలోచించలేదు

ఎటువంటి ప్రశ్నలేక అల్లుకునే బంధాల్లో నీవు ఒకటి

అది ఏ పేరు లేనిదీ ఎల్లప్పుడు నిలిచుండేది .....

తిరిగిరాదా నీ స్నేహపు రవళి

తిరిగిరాదా నీ స్నేహపు రవళి

పూర్వపు కాంతిని వెదజల్లుతూ

చీకటిని తొలచుకుంటూ

వెన్నల కన్నా మిన్నగా

మనసు కన్నా లేలేతగా

నా చేతికి పసిపాపలా తోచే నీ స్నేహం తిరిగిరాదా .....

కన్నుల కాంతులు మిరిమిట్లు గొలుపుతున్నా

నవ్వుల హరివిల్లులు గొడుగులా విరబూస్తున్నా

నీవు లేని ఈ కన్నుల పండుగ కాంతిలేని దీపం లా మూగపోతోంది

ఆ మౌనపు ఆరాధనే నిన్ను తిరిగి నా చెంతకు రప్పిస్తుందని ఆశిస్తున్నాను

నీకై ఎప్పటికి అదే కనులతో చిన్నారి భావనతో వేచి చూస్తుంటాను....

నా ప్రాణమే నీవైనావు

వాడిన పూలనే బ్రతికించే చిరు గాలి నన్ను తాకినా ప్రేమ చిగురించలేదు

చంద్రుడే కోరుకునే చిరుజల్లులు నన్ను తదిపినా ప్రేమ కలుగలేదు

నీవెవరో ఎక్కడనుంచి వచ్చావో నా మనసును తాకావు

తాకినంతలో ప్రేమ కలుగలేదు కాని నా ప్రాణమే నీవైనావు

నీవంటి ప్రేమ స్వరూపాలు ఉంటే చెప్పు కొన్ని వేల హృదయాలను కాపాడుతాను

వారికి నిజమైన ప్రేమనందిస్తాను .........

నా ప్రేమకు నీవే ఆయువు .....

ఎటూ తోచని చందమామ నింగిలో ఎదురైంది ఎందుకని ?

తానై వచ్చిన జాజికొమ్మ పొమ్మంటోంది ఎందుకని ?

ప్రేమ నిన్నిలా చూస్తుంటే నాకే జాలేస్తోంది

మనసే కాదని మధనపడుతుంటే ప్రాణమే పోయినట్టుంది

ఎద కూరుపులో అర్థంలేదని

నా మాటలే నిజము కావని

నీకేమైనా అందిందా సందేశం ?

చందమామకు వేరే దారి లేదని నాపై పన్నిన పన్నాగం

నమ్మకు తన మాటలు నా ప్రేమకు నీవే ఆయువు .....

నీకై తపించాలని

ఎన్నాలకైనా వస్తుందా జాబిలీ

ఉదయించే కాలమౌతోంది

వదన్నా కూడా పరిచింది చీకటి

తను రాకుండా ఎక్కడో దాగిపోయింది

మాటిచ్చి మల్లెలు కూడా విరబూయనన్నవి

మంచు పాడే మత్తు పాట ఆపనన్నది

ఎటెళ్ళ లేక నేలనున్న

కళ్ళు మూసుకుంటూ నిన్ను చూస్తున్న

నువ్ వస్తావని కాదు

మనసిస్తావని కాదు

నీకై నేను కాస్తైనా తపించాలని

ఆ జ్ఞాపకాలను పదిలపరచాలని ..

ఎందుకీ మౌనం ?

మబ్బులన్నీ మాయం

వెండి వెన్నల దర్పం

అయినా ఎందుకో ఈ చీకటిలో మౌనం

నాలో కలిగించెను సందేహం...

మేఘ సందేశం

మోయవే నా మాటలన్నీ

చేర్చవే నా ఊసులన్నీ

మాయమైన స్నేహానికి

మరపురాని నేస్తానికి

ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఓ మేఘమా పో మేఘమా

తన కనులు చూసి పలకరించు

చినుకు చల్లి చెలిమి కోరు

పరవశించి నాట్యమాడే

అందమంతా నాకు చేర్చు

ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఓ మేఘమా పో మేఘమా

కడలి చేరు తీరమంత వెతికి చూడు

తన అడుగు జాడలు ఉన్నవేమో

చిరునామా మరి తెలియునేమో

ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఓ మేఘమా పో మేఘమా

దూరమంటూ ఆగిపోకు

అంతటి స్నేహం ఎక్కడా దొరకదు

తన చెలిమిని నీకు పంచుతాను

వేగమంది తనను చేరు

ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఓ మేఘమా పో మేఘమా

దారివెంబడి పూలు ఉంటాయి

వాటి మత్తులోకి జారిపోకు

మాయ చేసే మనుషులుంటారు

మోసపోయి దారి మరచిపోకు

కేరింతలు కవ్వింతలకు ఆదమరచి కురిపించకు

దాచినదంత తనకే ఈ భారమంతా అ స్నేహానికే

ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఓ మేఘమా పో మేఘమా

ఆత్మ విశ్వాసం

నీడ వంక చూసావా నీడలేకున్నది

తోడు వంక చూసావా తరలిపోతున్నది

నిప్పుకాలం రగిలే హృదయం

కన్నీటితోను ఆరనంది

చెలిమి కూడా తీర్చలేనిది లోన ఏదో ఉంది

ఐనా ఆగవే మది ఆగిపోకే అందమైన లోకమిది

చూడవే కనులతోటి మొత్తమంతా నీదౌతుంది

ఆశ చేర్చు ఊపిరి తిరిగొస్తుంది

దేనిని వదులుకోకు మళ్ళీ కోరుకున్నా రాదు మరి...

.

పేరేమిటి

లతవై పరిమళించి

సుధవై ఉదయించి

పరిమళాల కిరణాలు వెదజల్లుతూ

సుదూరాలు పయనిస్తూ

నా మనసు చేరి నీ పేరడిగితే

మైమరచి పోవటమే నా వంతు కాని

నీ పేరెక్కడ నే వెతికేది.....

గుడ్ ఫ్రైడే

సిలువ పొందిన ఏసువు కష్టాలు తీరుస్తాడు

కరుణామయుడి రూపము మన తోడే ఎల్లపుడు

మనసారా కొలిస్తే ఒక వెలుగై వస్తాడు

ప్రార్ధించి చూడు పాపాలను తొలగిస్తాడు

తానై కదలివస్తాడు వరములు అందిస్తాడు

ఏ బేధము లేని ఆత్మబంధువు .....

ఉండవే అక్కో నా పెండ్లి దాక

ఒకానొక అక్కకి ఇది అంకితం :D

ఉండవే అక్కో నా పెండ్లి దాక ...

ను ఉండవే అక్కో నా పెండ్లి దాక ....

సరి జోడిని వెతకాలే... తాంబూలమివ్వాలే ..

నా దాన్ని సూసి సూసి మురిసిపోవాలే...

ఉండవే అక్కో నా పెండ్లి దాక...

ను ఉండవే అక్కో నా పెండ్లి దాక....

అక్కో అక్కో అక్కో పెళ్లాయే వేళాయే ...

పెండ్లాము దెగ్గరాయే...

నువ్వు తాళి అందివ్వాలే...

తయ్య తక్క లాడాలే ..

చపట్లు కొట్టలే పాటలు పాడాలె ...

ఉండవే అక్కో నా పెండ్లి దాక ...

నువ్ ఉండవే అక్కో నా పెండ్లి దాక...

ఆపైన నా కొడకు నీ చేత పెరగాలే ...

వాడి పెండ్లి కూడా నువ్వే జెరిపించాలే ...

ఉండవే అక్కో నా పెండ్లి దాక...

ఉండుండవే అక్కో వాడి పెండ్లి దాక ...

శివరాత్రి శుభాకాంక్షలు

మిత్రులకు శ్రేయోభిలాషులకు శివరాత్రి శుభాకాంక్షలు . ఆ త్రినేత్రుడు అందరిని చల్లగా కాపాడాలని వేడుకుందాం .

చెలిమి గుర్తులను మరువలేను

మట్టికి కూడా తెలియని నీ లేలేత అడుగు జాడలు,

నా స్నేహపు తీరంపై ఇంకా చెరగలేదు చెరిగిపోదు,

అలజడి లా వచ్చే అ అలలను తాకనివ్వను ,

కన్నీటి ధారలా మోసం చేసే ఆ చినుకులను తాకనివ్వను,

ఇంకే అడుగును కూడా దానిపై పడనివ్వను,

ఎండబారిన నేలనై నే శిధిలమై పదిలపరుస్తా కాని,

అ ముచ్చటైన చెలిమి గుర్తులను మరువలేను,

ఇకపై ఆ చెలిమిని పెంచాలని వేడుకుంటాను...

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు - నిన్ను నువ్వు ప్రేమించు

చేరువయ్యే బంధాలన్నీ ప్రేమ కావు.. చేరువకానివన్ని ప్రేమ కాకుండా పోదు.. నీలో కలిగే మార్పులను ప్రేమనుకొని మోసపోకు... ఓ యువత ఇంకా నీకు అంత నమ్మకం ఉంటే ప్రేమను వదలకు నీ ప్రాణాలను వదలకు...

హృదయమన్నది ప్రేమకే కాదు

సాధనకు శోధనకు

కలత అన్నది విరహానికే కాదు

ఓర్పుకు నేర్పుకు

ప్రేమను జయించి నిన్ను నువ్వు ప్రేమించు

నీవనుకున్న ప్రేమ నీదౌతుంది

నీతోపాటు ఓ ప్రాణంలా తోడుంటుంది...

***********మనసల్లుకున్న బ్లాగులు ***********

కడలి - సుభ - హాయినిచ్చే కడలి  తీరం కనులకు చక్కని చిత్ర కావ్యం 

గాజు ప్రేమ

గాజు పగిలేకొద్ధి పదునుగా మారుతుంది, అదే విధంగా నా మనసు విరిగేకొద్ది నీపై ప్రేమపై ధ్యాస మరింత పెరుగుతూ ఉంటుంది.. As the glass breaks it becom...