నమ్మకమే జీవితం











వదలలేని జీవితంలో వల్లమాలిన ఆప్యాయతలు


ఎంతదూరమో ఎంత చెరువో మన చెంతనున్నా తెలియదు


వాటికి లెక్కలేసుకుంటే ఫలితము రాదూ


నమ్ముకుంటేనే ఆ కల నిజమయ్యేది 

అదే లేకుంటే ఇంక ఈ జీవితమేది ...... 


5 comments:

రసజ్ఞ said...

చాలా చక్కగా చెప్పారు! నమ్మకం అనగానే నాకు గుర్తుకు వచ్చేది, బాగా నచిన డైలాగ్ ఏమిటంటే ప్రయాణం సినిమాలో ఆఖరిలో బ్రహ్మానందం అంటాడు చూడు బాబు నేను రైతుని ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మనిషిని, మట్టిని నమ్మడం మానలేను అని! ఒంటరిగా వచ్చాం ఒంటరిగా పోతాం కానీ ఏదో సాధించాలన్న తపన, ఎవరో తోడుంటారన్న నమ్మకం మనిషిని ముందుకు నడుపుతాయని నాకనిపిస్తుంది! నమ్మకమే అద్భుతాలని కూడా చేయిస్తుంది!

సుభ/subha said...

ఎంతదూరమో ఎంత చేరువో మన చెంతనున్నా తెలియదు.. నిజం అండీ. కొందరికి ఎదుటి వారు దగ్గరగా ఉన్నారు అని అనిపించేలా ఉంటారు. మనసుల్లో యెంత దూరమో వాళ్ళకి తెలియదు. కొంతమంది ఎంతో దూరంగా ఉంటారు. ఎంత దగ్గరగా ఉన్నారో అన్న సంగతి ఆ భావనని అనుభవించే వాళ్ళకి కూడా తెలియదు. ఇవన్నీ తూకం వేసుకుంటే జీవితమే ఎలా ఉంటుందో అన్న ఊహ కొంచెం నరకమే.. కానీ నమ్మకాన్ని పెట్టుబడిగా పెడితే ఇలాంటి నరకాలన్నీ వమ్ము కాక తప్పదు. రసజ్ఞ గారన్నట్టు ఎదుటి వారు తోడున్నారన్న నమ్మకంతో అద్భుతాలను సాధించవచ్చు. నాలుగు వాఖ్యాల్లో చాలా బాగా చెప్పారు కల్యాణ్ గారు .

Kalyan said...

@ రసజ్ఞ గారు అవను నమ్మకమే లేకుంటే ఎటువంటి కట్టుబాట్లు వుండవు ప్రేమ స్నేహం ఇలాంటి తియ తియ్యని బందాలుండవు . ధన్యవాదాలు నా నమ్మకాన్ని మరింతగా పెంచినందుకు :)

@సుభ గారు మీకు తెలుసో లేదో నేను నమ్మకాన్ని చూసాను తెలుసా ? ఓహ్ ఎలాగంటార మీరందరు ఉన్నారు కదటండి మరి నమ్మకాన్ని చూసినట్టే కదా ! ధన్యవాదాలు ధన్యవాదాలు నా నమ్మకాన్ని రెండో సారి పెంచినందుకు :)

జ్యోతిర్మయి said...

మన గురించి అలోచి౦చే వారు, మన సౌఖ్యం కోరేవారూ వున్నారన్న నమ్మక౦ చాలా తృప్తిని కలిగిస్తుంది. జీవితం సాఫీగా సాగడానికి ఈ నమ్మకం చాలా అవసరం. ఎదురుగా చూడలేని ఈ చేరువ, దూరం కేవలం మనసుతోనే కొలవగలం. చాలా మంచి విషయం చెప్పారు కళ్యాణ్ గారూ..

Kalyan said...

@జ్యోతిర్మయి ఇదిగో ఇంతలోనే ఇంకో నమ్మకం గారు వ్రాసేసారు చక్కగా. అవునండి మనసుతోనే కొలవగాలము. ధన్యవాదాలు ధన్యవాదాలు నా నమ్మకాన్ని మూడింతలు చేసినందుకు :)

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...