Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

తీరపు మనసును గాయపరిచిన కెరటం

ఎందుకో లేవనంది కెరటం,
తీరానికి మాట ఇచ్చి నింగి అంచులోనే ఆగిపోయిన కెరటం,
మనసులో తడి చేర్చుకుంటూ ఎదురుచూసే మట్టిని తాకలేక,
దాని కనులను తడిచేసిన కెరటం,
ఎండ వేడికి ఆవిరై తీరాన్ని తాకుతానంది,
కానీ మబ్బు నీడకు అక్కడే ఉండిపోయిన కెరటం,
సుదూరాలకు చేరుకొని దారి మరచిన కెరటం,
తీరపు మనసును గాయపరిచిన కెరటం...

నీవు ఓ పడతి రూపమే.






















మైనం లాంటి మేని సొగసు

కరిగిపోయే లేత మనసు


హత్తుకుంటే పొంగిపోయే పరిమళాలు


అన్ని నీ సొంతమే

ఓ  సబ్బు బిళ్ళా నీవు ఓ పడతి రూపమే...  











 

హాజరు పట్టీలు
























మనుషులుండరు  కాని


వారి వరుసలు వుంటాయి 



తప్పు చేయకున్నా గడులలో బందీలౌతారు


ఎప్పటికి పారిపోలేరు కాని 


అప్పుడప్పుడు మాయమౌతుంటారు  


పట్టీలలో కాలక్షేపం చేస్తుంటారు

అ పట్టీలే హాజరు పట్టీలు  





కవితా భావము







చేయి మలచిన చక్కని చిత్రాలు...

గొంతు తెరచిన తియ్యటి రాగాలు..

పదములు పరవశించిన అది నాట్యము...

మనసు కధలివొచ్చేది కవితా భావము...

అది హద్దులు లేని పద జాలము..

కవితలు పలు రకాలు





ప్రియుడి కవిత ప్రేయాసికై..

ప్రజల కవిత ప్రభుత్వానికై..

రాజకీయుల కవిత పదవికై..

సన్యాసి కవిత మోక్షానికై..

నటుల కవిత తమ పాత్రలకై..

పేదల కవిత పొట్టకూటికై..

మనుజుని కవిత స్వార్ధానికి..

భక్తుల కవిత పుణ్యానికి..

నా కవిత సమాజ స్పృహకై..

తెలుసుకోండి బాగా మసులుకోండి..

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...