నడిచే పువ్వు

అందమైన పూలని ఎంత లెక్కించినా ఒక పువ్వు తగ్గుతోంది అందులో. ఎందుకని చూస్తే నడిచే పువ్వును ఎవరు చూసుంటారు ఈ లోకంలో...

చాలు

ఎప్పుడు నీ చూపులో నేనొక చుక్కనైతే చాలు,
నీ ప్రపంచం ఎంత పెద్దదైనా నేను నీ నీడనుంటే చాలు,
నీ చేతిలో ఒక గువ్వనయ్యే అదృష్టం లేకున్నా,
నీ చుట్టూ తిరిగే తుమ్మెదైనా చాలు...

మండే వెన్నల

నీ మండే వెన్నల లేకుంటే ఈ చీకటి వెలుగులో ఎలా ఉండేది...

వదిలిపోయిన జ్ఞాపకమా

కనులెదురుగా లేకున్నా కళ్ళముందు కనిపిస్తుంటే కనుపాప చేసేది మోసమా లేక నీ ప్రేమ వదిలిపోయిన జ్ఞాపకమా....

చాలు

ఎప్పుడు నీ చూపులో నేనొక చుక్కనైతే చాలు,
నీ ప్రపంచం ఎంత పెద్దదైనా నేను నీ నీడనుంటే చాలు,
నీ చేతిలో ఒక గువ్వనయ్యే అదృష్టం లేకున్నా,
నీ చుట్టూ తిరిగే తుమ్మెదైనా చాలు...

నమ్మకం

నమ్మకాన్ని ఎంత మెరుగుపరిచినా అది కలలోని సంపాదనే ఇలలో పనికిరాదు, 
మన నమ్మకం ఏదైనా ఎంత బలమైనదైనా కాలము చలించదు,
నమ్మింది నిజమైతే అది యాదృచ్ఛికం కానీ మన గొప్పతనం కాదు,
భక్తికీ నమ్మకానికి ఏంతో దూరం ఉంది....

నీ అంత అందంగా ఉండదు

ఒక మంచు మొగ్గ అందమైన స్త్రీగా వికశించినా అది నీ అంత అందంగా ఉండదు...

ఆకాశం నుంచి తారను వేరుచేసినట్టే

వేరే ధ్యాసలో నిన్ను మరచిపోతే మేఘం వెనుక దాగిన తారలా నీ ఆలోచన మరుగౌతుంది, 
ఆ మేఘం పోయిన కాసేపట్లో  మళ్ళీ ప్రత్యక్షమౌతుంది, 
నా నుంచి నీ ఆలోచనను తీయడమంటే ఆకాశం నుంచి తారను వేరుచేసినట్టే, 
వచ్చి పోయే మేఘాలు ఎనున్నా మన బంధాన్ని తుడిపేయలేవంతే...

గోరు రంగులో దాగాయి

అన్ని కలిసిన పూల బుట్టలో కొన్ని పారిపోయి నీ గోరు రంగులో దాగాయి...

నిన్ను చూసుకుంటూ వింటూ కలుస్తూ మిగిలిపోతాను

నిన్ను చూడాలని తపించే కనులు పోయాయి, 
నీ మాట వినాలనుకునే తపన పోయింది, 
నిన్ను కలవాలనే ఆలోచన సన్నగిల్లింది, 
ప్రతి క్షణం నువ్వే నాలో అని తెలిసి నాలోనే నిన్ను చూసుకుంటూ వింటూ కలుస్తూ మిగిలిపోతాను....

నీ కళ్ళ వద్దే ఆగిపోతోంది

నీ నీడన నేను చూడలేకున్నా ఎందుకంటే నా చూపు నీ కళ్ళ వద్దే ఆగిపోతోంది...

ప్రేమ వలస

వలస వెసులుబాటు ఉంటే నా ప్రేమను నీ మనసులోకి పంపేయనా...

నా భార్య

 కట్టిన తాడుకే నాతోడు జీవితకాలం వచ్చే నీ చెరిగిపోని ప్రేమకు వందనం,

పెట్టిన కుంకుమలో నను చూసుకునే నీ అమూల్యమైన ప్రేమకు వందనం,

నా అడుగులలో నీ దారి వెతుకున్న నీ గుడ్డి ప్రేమకు వందనం,

నీ నీడలో నన్ను చూసుకునే నీ పిచ్చి ప్రేమకు వందనం,

నీదేదైనా నాకు ఇచ్చే నీ నిస్వార్ధపు ప్రేమకు వందనం,

నిన్ను విస్మరించే నా సమయాన్ని జ్ఞాపకాలతో నింపుకునే నీ అపురూపమైన ప్రేమకు వందనం,

నిన్ను ఓడించే నా మాటలును కూడా ఆదరించే నీ కన్నీటి ప్రేమకు వందనం,

ప్రేమకు తూకం లేకున్నా అనిపిస్తుంది నీ ప్రేమకు నేను సరితూగనని అదృష్టం అంటే ఇదేనని.... 🙏❤️

Google Anuvaadham

Greetings for your unrequited love that will last a lifetime just for the rope I tied,

Greetings to your precious love that you feel in the bindhi I put,

Greetings to your blind love which you follow my steps,

Greetings to your mad love which you see me in your shadow,

Greetings for your selfless love which can give me anything that you own,

Greetings to your unconditional love that fills your mind with our memories even when I ignore you,

Greetings to your tearful love that embraces even my words that defeat you,

Love seems to have no weight but I feel my love is less before yours and that difference is called luck...

మీకు అంటిన మసి మాకు ఎందుకు

బాధ్యతగల ఒకరి కష్టం వింటుంటే ఇలా తోచింది.

పాతరకి ఉన్న మసి కంటే అందులోని వంటకమే అందరికి ఇష్టం, 
ఆ మసే అంటకుంటే వంటకు రుచి పచి ఉండదు, 
మీరు మసిబారి ఎన్నో వంటలు చేస్తున్నారు, 
వంట రుచి చూస్తాము అంతే కాని మీకు అంటిన మసి మాకు ఎందుకు....

తనని తాను మరిచి అటు సమాజాన్ని ఇటు ఇంటిని  మోసే ప్రతి స్త్రీకి ఇది అంకితం 🙏

అందం అంటే తెలియాల్సిందే

నీపై పడ్డ ఏ చూపుకైనా అందం అంటే తెలియాల్సిందే...

నీడనే ముద్దు కోరితే

నీ నీడనే నీకు ముద్దు పెట్టేంతగా ముద్దొస్తున్నావు, చెలి నీ అందాన్ని నేను ఏమని వర్ణించను... आप इतनी प्यारी हैं कि आपकी परछाई भी आपको चूमना चाह...