Showing posts with label రాయి. Show all posts
Showing posts with label రాయి. Show all posts

బంగారం రాయి

బంగారాన్ని రాయికి రుద్దితే రాయి మెరుస్తుంది కానీ బంగారంగా మారదు..

Rubbing the gold on the stone makes it shine like gold, but it cannot turn the stone into gold..

💡

నా మనసుపై రాశాను పదిలమైపోయింది


రాతి పలకలపై నీ పేరు రాస్తుంటే కరిగిపోతున్నాయి, పూల రేకులపై రాస్తుంటే వాడిపోతున్నాయి, నీటి అలలపై రాస్తుంటే నీరు ఆవిరైపోతోంది, నా మనసుపై రాశాను పదిలమైపోయింది, అక్కడ తప్ప నీ పేరు ఇంకెక్కడ ఉండనంది...

I wrote your name on stone slabs, they melted away.
Wrote it on flower petals, they withered.
Wrote it on the waves of the water, the water evaporated.
I wrote it on my heart, and it remained there forever.
There is no place where your name will be more cherished than here..

💙

రాయి ఉలి ప్రేమ


రాయి సరైన ఉలిని ఎంచుకోలేకపోయినా, తప్పుడు ఉలితో విరుగుతుంది. అలాగే, హృదయానికి నిజమైన ప్రేమను ఎంచుకునే అవకాశం లేకపోవచ్చు, కానీ భూటకపు ప్రేమతో విరుగుతుంది....

Just as stone cannot choose the right chisel but breaks with the wrong one, similarly, heart may not have the choice to select the right love, but it breaks with the fake one...

जिस तरह पत्थर सही हथौड़ी नहीं चुन सकता, लेकिन गलत से टूट जाता है, उसी तरह दिल को भी शायद सच्चा प्यार पाने का हक न हो, लेकिन नकली से टूट जाता है...

💞

నీ మనసు నీడ


నువ్వు తాకిన రాళ్లను చాదితే పరిమళాలు వెదజల్లుతాయి, మరి నీ మనసు నీడలో ఉంటే నాలో ప్రేమ కలగదా..

When the stones you've touched are ground, the fine fragrance fills the air, won't my heart simply fall in love in your presence?

आपके छुए हुए पत्थरों को पीसने पर, हवा में चन्दन की खुशबू भर जाती है, क्या आपकी मौजूदगी में मेरा दिल यूँ ही आसानी से आपसे प्यार नहीं कर लेगा?

💞

కన్నీరు ఉండచ్చు కానీ భయం కాదు

నా కన్నీటితో నిండిన సరస్సు పుట్టుకొని రావచ్చేమో కానీ భయంతో నిండినది కాదు, ఎందుకంటే నీ ప్రేమలో మనసు గాయపడచ్చు ఆ బాధ ఎలా ఉంటుందంటే, తోటను చేరకుండా ఆపే కంచె లాగా ఉంటుంది కానీ రాయి కింద పడి నలగినట్టు కాదు, కంచె వెనకాల ఏముందో కనిపించే దాకా విశ్రమించను దాటే ప్రయత్నం చేస్తూనే ఉంటాను, కానీ కనిపించకుండా మొత్తం మూసేస్తే దానిపై విశ్రమిస్తానే కానీ వదిలి పోను...

In the realm of my love for you, tears fill the lake, not fears. Though love can bring pain, it resembles a fence that prevents me from entering the garden, rather than someone crushing me under a stone. I'll persist in crossing the fence as long as it lets me catch glimpses beyond. If not, I'll rest upon it, refusing to depart..

💜💜💜

గాజు మేఘం

నా మనసు గాజుతో చేసిందే,
కానీ గాజు మేడ కాదు గాజు మేఘం,
పగులుతుంది కానీ కాదంత సులభం,
విసరగలవా రాయిని అంత దూరం?

My heart is made of glass,
Not a glass structure, but a glass cloud.
It's fragile, yet not easy to break.
Can you throw a stone that far?

💜💜💜

నాలో నీ ప్రేమ

నీటిలోకి రాయి వేస్తే తరంగాలు వచ్చినట్టు, ఆకాశం వైపు వేస్తే తరంగాలు ఏమో కానీ అసలు అంత దూరం విసరలేము, కానీ ఓ ఆకాశమా! నీ ప్రతిబింబం నీటిపై పడాల్సిందే, ఆ నీటి తరంగాలకు నువ్వు మెదలాల్సిందే, నువ్వు రంగు మారినా నీ రూపాన్ని మారుస్తున్నా తప్పించుకోవడం అసాధ్యం. ఓ సఖి! నా మదిలోని నీ ప్రేమా అంతే, నువ్వెంత దూరంగా ఉన్నా సరే నా అంతరంగంపై నీ ప్రేమ పడకుండా దాచలేవు దాగలేవు నాతో పాటు నువ్వు ఆడకుండా ఉండలేవు...

If you throw a stone in the water, it ripples, if you throw it towards the sky, forget about ripples you cannot throw it that far, but oh sky! Your reflection must fall on the water, you must obey the waves of the water, even if you change color or change your form, it is impossible to escape. My dear, your love in my heart is the same, even if you are far away, you cannot hide your love from my innermost being and cannot stop yourself when my feelings ripples...

💜💜

నువ్వే నా దేవత

రాయికే పసుపు పూసి దేవత అని పూజిస్తుంటే, నా ఊహకు రూపమిచ్చిన నిన్ను నా దేవతగా ఆరాధించనా, ఆ రాయే కోరికలు తీరుస్తుందని నమ్ముతుంటే, నువ్వు మనసుగలదానవు కోరిక సరే కనీసం మాట వినిపించుకుంటే చాలదా...

When the stone painted with turmeric is idolized as a goddess, you gave real form to my imagination, so I admire you as my goddess. When it is believed that the stone can fulfill wishes, you have a lovely heart, so it is enough if you can at least hear what I say...

💜💜

మారుతాను కానీ మాయమైపోను




నువ్వు ఉప్పొంగే అలవే, మహా కెరటానివే, కానీ నీ తీరంలో నేను మట్టి కోట కాను,నీ రాపిడికి కొంచం కొంచం మారుతూ, నున్నగా మారి, నీ తేమకు మెరిసిపోయే రాతి ముద్దను,చెలి ఎంత తాకిడి ఉన్నా నీకై మారుతాను కానీ మాయమైపోను...

You are a surging wave, a great wave, and I am not a mud fort on your shore. Rather, I am like a lump of stone that changes little by little with your friction, becoming smooth and shining with your moisture. No matter how much I crash, Dear, I will change for you but will not disappear...

💜💜

రాతి హృదయం




నా హృదయం రాయిలాంటిది,
చిన్నపిల్లాడిలా సరదాగా తంతూ ఆడుకో,
నువ్వు ఉండగలిగేలా ఇంటిని కట్టుకో,
నీకు నచ్చినట్టు శిల్పిలా అందంగా మలుచుకో,
దానితో ఏమి చేయాలన్నా ఆ హక్కు నీ ఒక్కదానిదే...

My heart is akin to a stone,
Kick it playfully like a child,
Build a home with it where you can live,
Carve it like an artisan as you like, 
only you have the right to do anything with it...

💜💜

రాయిలా మారింది

నీ ప్రేమలో పడ్డ నా మనసు మంచులా కరగలేదు రాయిలా మారింది,
మరెవ్వరూ దానిని కరిగించలేరు విరవలేరు,
ఉలితో చెక్కినా సరే ఆ శిల్పము నీ రూపమే తీసుకుంటుంది కానీ ఉలికి లొంగిపోదు మరే రూపము తీసుకోదు...

My heart that fell in love with you did not melt like ice but turned like stone.
No one else can melt it nor break it,
Even if you carve it with a chisel, the sculpture will take your form, but it will not surrender to the chisel, it will not take any other form...

मेरा दिल जो तुम्हारे प्यार में पड़ गया वह बर्फ की तरह नहीं पिघला बल्कि पत्थर की तरह हो गया। कोई और इसे पिघला नहीं सकता और न ही इसे तोड़ सकता है, छेनी से भी तराशोगे, तो मूर्ति तुम्हारा रूप ले लेगी, पर छेनी के आगे न झुकेगी, और कोई रूप न लेगी...

💜

రాయి

కొందరు రాయిని విసిరెస్తారు,
కొందరు రాయిని శిల్పంగా మలుస్తారు,
కొందరు రాయితో జీవించేస్తారు,
కానీ ఒక్కరికి మాత్రమే తెలుసు అది రాయి ఎందుకు అయ్యిందని...


Few throw away the stone, 
Few try to shape the stone, 
Few live with the stone,
But only one knows why it is a stone..

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...