Showing posts with label నవీన పోకడ. Show all posts
Showing posts with label నవీన పోకడ. Show all posts

మీకు అంటిన మసి మాకు ఎందుకు

బాధ్యతగల ఒకరి కష్టం వింటుంటే ఇలా తోచింది.

పాతరకి ఉన్న మసి కంటే అందులోని వంటకమే అందరికి ఇష్టం, 
ఆ మసే అంటకుంటే వంటకు రుచి పచి ఉండదు, 
మీరు మసిబారి ఎన్నో వంటలు చేస్తున్నారు, 
వంట రుచి చూస్తాము అంతే కాని మీకు అంటిన మసి మాకు ఎందుకు....

తనని తాను మరిచి అటు సమాజాన్ని ఇటు ఇంటిని  మోసే ప్రతి స్త్రీకి ఇది అంకితం 🙏

నవీన పోకడ

బంధాలు సాంకేతికమైతే భావాలు అక్షరాలకే పరిమితం అవుతాయి... 

మూఢనమ్మకం

పద్ధతులను ప్రశ్నించేవాడు తార్కికవాదే అయితే  దానిని వివరించలేని వారు పలాయనవాదులే,
స్పష్టత లేని ఏ నమ్మకం అయినా మూఢనమ్మకమే...

చిల్లి గవ్వ

చిల్లి గవ్వ లేకుంటే చలామని కాలేవు...
చినిగిన బట్ట వేసుకున్నా డబ్బు ఉంటే ఆదర్శం ఔతావు...
ఎదిగే కొద్ది ఒదగాలి...
ఎదగకుండా ఒదిగినా దేనికి కొరగావు...

తీరపు మనసును గాయపరిచిన కెరటం

ఎందుకో లేవనంది కెరటం,
తీరానికి మాట ఇచ్చి నింగి అంచులోనే ఆగిపోయిన కెరటం,
మనసులో తడి చేర్చుకుంటూ ఎదురుచూసే మట్టిని తాకలేక,
దాని కనులను తడిచేసిన కెరటం,
ఎండ వేడికి ఆవిరై తీరాన్ని తాకుతానంది,
కానీ మబ్బు నీడకు అక్కడే ఉండిపోయిన కెరటం,
సుదూరాలకు చేరుకొని దారి మరచిన కెరటం,
తీరపు మనసును గాయపరిచిన కెరటం...

ఎన్నో సంశయాలు...









అందనిది ఏదైనా అందంగా ఉంటుంది ..

అందితే ప్రేమైనా చులకనౌతుంది...

అందని ఆకాశం కూడా అయ్యింది ఒక గమ్యం..

అందే మమకారం ఎవరికి పరిహారం..

చుక్కలు లెక్కించే లెక్కల తెలివుంది..

మనసును తెలుసుకునే సమయం మనకేది..

పరిశోధనలకు పట్టాలు వ్యాఖ్యానాలకు బహుమతులు..

వరి పండించే చేతులకి చినుకంత ఓదార్పులు..

ఎవరనుకున్నా ఏమౌతుందని అనుకున్నా అది జేరిగేదేనా..

సందేహాలు సంసారాలు ఇలా ఎన్నో సంశయాలు...


నీవు నేను ఒక్కటే





దిగులు నిండిన మనసుతో

ప్రేమకు తావులేని బంధాలతో

నాలుగు గోడల నరకంలో ఎలా ఉన్నావు..



అందమునంతవరకు ఆరాధిస్తారు

అది ఆవిరయ్యేవరకు ఆనందిస్తారు

కన్నీటి కనులు తప్ప కప్పిన సోగాసునే చూస్తారు

ఈ నిజమే నీకు తెలిసినా నిస్ప్రుహే వాడికి వదిలేసి

కాలుతున్న కాగితమౌతు  ఎలా ఉన్నావు...



అమ్మ ప్రేమ లేదు

తండ్రి లాలన లేదు

తోబుట్టువల నీడ లేదు

కట్టినమైన రాక్షసత్వము తప్ప!

ఎలా వున్నావు నీవెలా ఉన్నావు..



మాములుగా మల్లెల సొగసుకు మోసపోవు కదా!

చక్కని జీవితం ఇష్టం లేక కాదు కదా!

నిలువ నీడ లేకనా నీవారి కోసమా!

నీకోసమైనా సరే ఎలా వున్నావు నీవెలా ఉన్నావు..



నీకెంత ధైర్యం ఇచ్చినా

సాయం చేసే చేతులు నాకు లేవు

నేను నీలా కాకున్నా సమాజంతో కట్టబడి ఉన్నాను

నీవు అందానర్పిస్తే నేను స్వేచ్ఛను అర్పిస్తున్నాను

అందుకే నీవు నేను ఒక్కటే...

 
  

మా తెలుగు తల్లివా లేక రాజకీయ బానిసత్వానికి తల్లివా?





కడుపులో బంగారు..

కనుచూపులో కరుణ...

చిరు నవ్వులో సిరులు...

వారికివే వరాలు అందినవన్నీ ఆస్తులు...

కడుపులో బంగారు ఉన్నంత వరకు అ గర్బాన్నే తొలచి వేస్తారు..

కనుచూపులో కరుణ ఉన్నంత వరకు నిన్నే హేళన చేస్తారు...

చిరునవ్వులో సిరులు ఉన్నంత వరకు ఎవరికీ వారు పంచుకుంటారు...

ఎవరికోసమిక నీ ఎదురు చూపులు ఎవరి మీద నీ ఆశలు..

తెలుగు తల్లి నీవెవరి తల్లి ?

మా తెలుగు తల్లివా లేక రాజకీయ బానిసత్వానికి తల్లివా?..  

నవీన పోకడ..



నడుము తాకు కురులు కాస్త మెడను తాకెను..  

చక్కనైన కట్టు చీర బాగా చురుకాయెను..

మాటలోని మాధుర్యం కఠినమాయెను....

మేని చాయలు ఎంతో మెరుగాయెను...

పత్తి లాంటి పాదాలు మొద్దుబారెను..

సిగలోని పూలు జడ పట్టిలాయెను..

చేతికుండు గాజులు చెవిపోగులాయెను..

ఆడదాన్ని ఉనికి చెప్పు గజ్జెలు మూగబోయెను.

సిగ్గుపడే చెక్కిళ్ళు కరువాయెను...

కళ్ళు దిద్దు కాటుక జడరంగులాయెను...


అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...