Showing posts with label అక్షరం. Show all posts
Showing posts with label అక్షరం. Show all posts

ప్రేమాక్షరం


అక్షరం పైన అక్షరం వాలితే దాని రూపం మాసిపోతుంది, కానీ నా ప్రేమ ఆ అక్షరం కాదు, మరో ప్రేమ దానిపై వాలలేదు...

If a letter overlaps with another, its form disappears. But my love is not like that; no other love can overshadow it...

💞

తగ్గదు దానిలోని ప్రేమ సారం


చీకటితో మాసిపోదు నా అక్షరం,
వేకువతో వెలిగిపోదు నా అక్షరం,
నిరంతరం దానిది ఒకే అర్థం,
తగ్గదు దానిలోని ప్రేమ సారం...

Neither darkness can erase my words, nor morning can brighten them up; their meaning remains the same forever, and the essence of love never decreases..

💞

నీ అందాన్ని రాస్తూ ఉంటే


నీ అందాన్ని రాస్తూ ఉంటే అక్షరాలు గీతలుగా మారేనా, ఆ గీతలన్ని వంగిపోతు నీ రూపాన్ని దిద్దుకుంటూ సాగేనా,
ఆకాశపు తోటలన్ని తిరిగి తిరిగి గాలి రంగులన్ని తెచ్చేనా, ఆ నింగి అద్భుతాలకు ప్రతిరూపంగా నువ్వు కానీ నీ అందంలో ఉన్నవి వాటిలో లేదు..

As I began to describe your beauty, the words transformed into intricate lines, each taking on a graceful shape. The wind itself carried colors from distant galaxies. You are a genuine reflection of nature, enriched with qualities it yearns for...

💜💜💜

నా ప్రతి అక్షరం నీకై ఎగురుతూనే ఉంటుంది

ఆవిరై మేఘాలను చేరే దాకా ఆగలేక రెక్కలు కట్టి ఎగిరిన కడలి చుక్కలా,
నీ చూపు తగిలేదాక ఆగకుండా నా ప్రతి అక్షరం నీకై ఎగురుతూనే ఉంటుంది..

Like a droplet flying with its wings, unable to stop until it evaporates and reaches the clouds,
Every letter of mine keeps flying to you without stopping...

💜💜💜


కరగని అందం

నీ అందాన్ని మోసి తీసుకురావాలని వాలే ప్రతి చినుకుకు పని ఇచ్చాను, మబ్బులు కరిగిపోయాయి,
సంద్రం నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని కురిపించింది,
సంద్రం మాయమైంది,
ఎంత మోసినా తరగనిది నీ అందం అని తెలిసి ప్రయత్నాన్ని విరమించుకున్నా, అక్షరాలతో నా వరకు వచ్చిన అందాన్ని నింపుతున్నా..

I entrusted every rain drop to carry your beauty; the clouds melted away.
The sky borrowed drops from the oceans and poured it,
The oceans vanished,
Knowing that your beauty is inexhaustible.
No matter how much I carry it, I gave up the effort,
Instead, I am reforming the beauty that came to me with letters...

💜💜

అయిపొతుందెమో అని

నీ సందేశాలను చదవడానికి చాలా సమయం పడుతుంది. భాష తెలుసు కానీ ప్రతి అక్షరాన్ని దాటి వెలుతుంటే ఎక్కడ అయిపొతుందెమో అని దిగులు కలుగుతుంది...

What takes too long is to read your messages. I know the language but I am worried about reaching the end word quickly...

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...