Showing posts with label చూపు. Show all posts
Showing posts with label చూపు. Show all posts

నీ ప్రేమికుడిగా మారిపోయాను


మళ్ళీ మళ్ళీ మేఘాలను నీ పేరుతో పిలిచాను, కానీ అవి నీలా మారలేదు, తారలను నీ ముద్దు పేరుతో పిలుచుకున్నా, కానీ వాటిలో మార్పు లేదు, నీ ఆలోచనలతో నిండిన కళ్ళతో ఆకాశాన్ని చూశాను, ఏ మార్పు లేదు, చివరికి నన్ను నేను నీ ప్రేమికుడిగా అనుకున్నంతటే మారిపోయాను, నీ ప్రేమికుడిగా మారిపోయాను... 

बार-बार मैंने अपने प्यार का नाम बादलों को दिया,
फिर भी वे कभी बदले नहीं।
मैंने चुपके से उनके प्यारे नाम तारों को सुनाए,
पर वे भी वैसे ही रहे।
मैंने आकाश को देखा, उनके ख्यालों से भरा हुआ,
फिर भी वह वही रहा, अपरिवर्तित।
अंत में, मैंने खुद को उनका प्रेमी कहा,
और उस पल, मैं बदल गया।

Time and again, I called the clouds by the name of my love,
Yet they never transformed.
I whispered her nickname to the stars above,
But they remained untouched.
I gazed at the sky, filled with thoughts of her,
Yet it stayed the same, unchanged.
Finally, I named myself her lover,
And in that moment, I transformed...

🩵

చూడకలా


చూడకలా ఎన్ని చిక్కుకుంటాయో నీ కనుసన్నల్లో నీకు తెలియదుగా, మేఘం ఆగిపోతే పోనీ కానీ నీ కబురు అందదు నాకు అందుకే నింగివైపు చూడకు, రాతిరి ఆగిపోతే పోనీ కానీ నాకు నీ కలలు అందవు అందుకే చీకటివైపు చూడకు, గాలి ఆగిపోతే పోనీ కానీ నీ పరిమళాల నన్ను చేరవు అందుకే గాలివైపు చూడకు, నన్ను చూడు ఆగిపోతాను నీతో ఉండిపోతాను...

💞

వెలుగు కిరణాన్ని నిలువరించగల చూపు నీది


వెలుగు కిరణాన్ని నిలువరించగల చూపు నీది, నా మనో భావాన్ని వశం చేస్కోవడం నీకెంత పని...

You are capable of stopping the light ray with a simple gaze, so isn't it easy for you to conquer my feelings...

आप एक नज़र से प्रकाश की किरण को रोक सकते हैं, तो क्या मेरी भावनाओं को जीत लेना आपके लिए आसान नहीं है...

💞

హృదయానికే హృదయం


నా హృదయానికే హృదయముందని, నిన్ను చూసినప్పుడే నన్ను వదిలిపోయిందని, నీ మాటలో ప్రేమ పొంగినపుడు, నీ కళ్ళలో చూపు మెరిసినపుడు తెలిసింది...

When I felt the love in your words, when your gaze sparkled, I realized that my heart had a heart, and it left me when it saw you..

जब मुझे आपके वचन में प्यार महसूस हुआ, जब आपकी निगाहें चमक उठीं, तो मुझे एहसास हुआ कि मेरे दिल में एक दिल था, और जब उसने आपको देखा तो उसने मुझे छोड़ दिया।

💞

నా ప్రతి అక్షరం నీకై ఎగురుతూనే ఉంటుంది

ఆవిరై మేఘాలను చేరే దాకా ఆగలేక రెక్కలు కట్టి ఎగిరిన కడలి చుక్కలా,
నీ చూపు తగిలేదాక ఆగకుండా నా ప్రతి అక్షరం నీకై ఎగురుతూనే ఉంటుంది..

Like a droplet flying with its wings, unable to stop until it evaporates and reaches the clouds,
Every letter of mine keeps flying to you without stopping...

💜💜💜


చూపుల బాణం




ఏ యోధుడు పొందలేని ప్రయోగించలేని ఆయుధం నీ చూపుల బాణం..

The weapon no warrior possesses nor can use is your piercing stare..

💜💜💜

మంచు ముద్దలే విరహ వేదనే


వెలుగు పడని లోకంలో ఎక్కడ చూసినా మంచు ముద్దలే, నీ చూపు పడని నా మనసులో ఎక్కడ చూసినా విరహ వేదనే...

The place devoid of sunlight is filled with ice, and my heart, which you are not looking at, is filled with sorrow...

💜💔💜

నీ అందం



మట్టి కూడా మొగ్గలా విరబూసే చోటు నీ పాదముంటే, మిణుగురులు చీకటనుకొని వెలుగుతూ మోసపోయే చోటు నీ కురులు అంటే,
మంచు ఆటవిడుపుకు వెళ్ళే చోటే నీ మేని అంటే,
తోటి మగువల అందాన్ని చిన్నబుచ్చే చూపులే నీ మొత్తం అందమంటే...

Your feet are the place where the soil blooms like a bud, and your black hair is the place where fireflies unknowingly turn on thinking it's night. Your body is the playground where snow goes for recreation. Your entire beauty is a gaze that diminishes the beauty of other women..

💜💜💜

అధరం




మధురామృతాలను పంచే కల్పవృక్షము నీ అధరము,
పంచభక్ష పరమాన్నాలు వడ్డించగల కంచమే నీ అధరము,
మనసు చేరడానికి అడ్డుగా వేసిన కంచనే నీ అధరము,
మాటలను చిలికి వెన్నను వడ్డించే ఆ కవ్వమే నీ అధరము,
వాటి అచ్చు తగిలితే చాలు విచ్చుకునే చూపులలోని ప్రాణమే నీ అధరము,
చలిని మరిపించి వెచ్చనీ తాపమిచ్చే ఆ కంబళి నీ అధరము..

Your lips are the kalpavruksha that can give the eternal nectar.
Your lips are the plate that can serve an infinite variety of dishes.
Your lips are the fence to reach your heart.
Your lips are the stick that can churn the butter.
Your lips are the life in the eyes that shines when touched.
Your lips are the warm blanket that can save from the winter waves..

💜💜💜

నీ చూపుకు పడిపోతాయి

ఇదివరకు భూమి ఆకర్షణకు మేఘాలు ఊడి పడలేదు, కానీ చెలి నువ్వు నింగి వైపు చూడకు, నీ చూపుకు పడిపోతాయి నీ చూపుకు పడిపోతాయి...

So far, the Earth's gravity has not pulled the clouds. But, my dear, if you refrain from looking at the sky, the clouds will remain in place. Please, do not look, as they may fall upon your sight...

💜💜💜

కనులెన్ని ఉన్నాయో లెక్కించుకున్నా

నిన్ను చూసే ముందు,
కనులెన్ని ఉన్నాయో లెక్కించుకున్నా,
అణువణువు నాలో కనులైనా సరిపోదంటూ దుఃఖిస్తున్నా,
ఓ సొగసరి నెమలి పించాన్ని వేడుకొని కనులను అప్పు తీసుకుంటా, 
నీ సిరుల ఝరిలో నా చూపులను కాస్త తడుపుకుంటా....

Before seeing you, I counted the number of eyes I have. Even though every cell in my body is like an eye, I grieve that it is not enough to feel you. May be I will beg the peacock feathers to lend me few more eyes and immerse my gaze in your beauty..

💜💜

చూపుకు సంకెళ్లు

నా చూపుకు సంకెళ్లు వేసే నేర్పు నీకు మట్టుకే ఉంది..

You only have the skill to put shackles to my sight..

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...