Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

కరోన

సామాన్యుడికి ఒక అవకాశం,
కవచం కాకు,
ఆయుధం పట్టకు,
ఆవేశపడకు,
నువ్వు ఉన్న చోటే దేశ సరిహద్దు,
గడప దాటనిదే శత్రువుకు బలం లేదు,
దేశభక్తిని ఇక చాటుకో పౌరుడా,
కనిపంచని గుండె చప్పుడై,
లోన ఉండి ఈ ప్రపంచాన్నే కాపాడు...
🙏

గుడ్ ఫ్రైడే








సిలువ పొందిన ఏసువు కష్టాలు తీరుస్తాడు

కరుణామయుడి రూపము మన తోడే ఎల్లపుడు

మనసారా కొలిస్తే ఒక వెలుగై వస్తాడు

ప్రార్ధించి చూడు పాపాలను తొలగిస్తాడు

తానై కదలివస్తాడు వరములు అందిస్తాడు

ఏ బేధము లేని ఆత్మబంధువు .....



అగరవత్తి



















తలకు నిపెట్టినా పరిమళాలు చిందిస్తూ...

పరవశించే మనసుకు పరమాత్మకు వారధిగా...

తాను బూడిదై రాలిపోతున్నా గుబాళిస్తూ...

మంచి గుణముతో వెలిగిపోయేనీ అగరవత్తి....


స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ...









ఆశయం మీ చేతిలో ఒక అనువైతేనే స్వాన్తంత్రయం మా జీవితాలకు ఆయువుపోస్తుంది...

అంకితభావం మీ గుండెల్లో నాటుకుంటేనే అన్ని వేళలా మా స్వప్నాలు సాకారమౌతాయి ...

మాకోసమే జీవించే మీ నిస్వార్దానికి జోహార్లు మీకు మా స్వాన్తంత్రయదిన శుభాకాంక్షలు ...



अगर नियोग है तुम्हारी जिंदगी का बाग़ है थो हम जिंदगी पा सकते हो ,

अगर तुम्हारे दिल मे उमंगें बार धे जय तो तुम अपने सपनो को पूरा कर सकए हो

मेरे सैनिको तुम्हे तुमारी मतलबी न होना के लिए सलाम और मुबारक हो तुम्हे ये स्वतन्त्र दिवस - Translated by my friend parul bansal



only if machine is a part of your life we get the lives..

only if dedication is filled in your hearts our dreams come true...

o my indian soldiers salute to your selflessness and wish you happy independence day...           


శ్రీ రామ నవమి శుభాకాంక్షలు





సిరి నీవేకద సిరి నీవేకద శ్రీరామా ..

సిరి సంపదలన్నీ నీ నామమే కదా..

అది ఒక కాలము అయోధ్యా రాజ్యము...

ఇది కలి కాలము అన్యాయమే రాజ్యము...

విల్లులు అంబులు పనిచేయని రోజులయ్య...

ఏ మంత్రములు పనికిరావయ్య..



హిందువు నీవని ముస్లామాను కావని...

నరహరి నీవని క్రైస్తవుడివి కావని...

ఎన్నో కొత్త మంత్రాలు మనుగడలోనికి...

ఏమని పూజించను ఓ మనిషిగా నే ఏమని పూజించను...



భరత మాత కోసం బంధాలు విడనాడి...

పోరాడే యోధులు ఉన్నారు నీలాగ...

అదే నేలను కండాలుగా విడదీసే రావనులున్నారు..

ఏ రాముడు వస్తాడో ఎలా సంహరిస్తాడో..



నీ పుట్టిన రోజుకు నవ్వులు కావు..

మా కష్టాలే నీకు విన్నపాలు..

మళ్ళి రావయ్య ఈ రాజ్యమేలవయ్య...

అన్యాయాలు అక్రమాలకూ పరసురాముడిగా...

ప్రేమకు అభిమానాలకు కౌసల్య రాముడిగా..

భక్తికి ముక్తికి సీతా సమేతుడిగా...

దిగిరావయ్య రాజకీయ రాజ్యమును యేలవయ్య....

సిరి నీవేకద శ్రీరామా సిరి నీవేకద శ్రీరామా ..

సిరి సంపదలన్నీ నీ నామమే కదా.. 

జైహింద్





భరతమాత ఉనికి తెలిపే సబ్ధమే జైహింద్...

ప్రతివాని గుండెలో నిత్య చప్పుడై పాడాలి జైహింద్..

పరవాడు కూడా మన భక్తి చూసి పలకాలి జైహింద్..

ఏ శక్తికి అందని ఆపలేని వేగమే జైహింద్...

ఘనత తెచ్చిన చరిత్ర ఉన్న భవిష్యత్తు జైహింద్...

కస్టాలు నేర్చి రక్తాన్ని ఒడ్చిన స్వాతంత్రమే జైహింద్...

శాంతము సౌక్యము స్నేహమే ఈ జైహింద్...

మన నడతలోను మాటలోనూ కలవాలి జైహింద్..

అందరం కలిసి పాడుదాం జైహింద్ జైహింద్ జైహింద్....

ఏడుకొండలవాడి వైభోగం





వైభోగమే నీది వైభోగమే..

నిత్య కళ్యాణ వైభోగమే..

ఎనలేని భోగాల వైభోగమే..

ఏడుకొండలవాడి వైభోగమే..

రథమెక్కి మా స్వామీ తరలి వస్తుంటేను

చూచే కనులకు వైభోగమే..

పసిదికంతి వెదజల్లు ఆ చిట్టి బుగ్గలకు

దిష్టి చుక్కైనా వైభోగమే..

కోరిన వరములిచ్చేటి ఆ కొండల రాయునికి

తిరుమాడ వీధులలో వైభోగమే ....

రాముడెట్లుండునో





నీ నామమునకు వున్నపాటి మహిమ కూడా నీకు

లేకపోయెర రామ..

రామ రామ అనుదురు కాని నిన్నెవరు చూసినారయ నీ

రూపమును ఎవరు వేడినారయ..

విల్లంభులు ధరించి నీ సపరివారముతో వుండిన నిన్ను

గుర్తిన్చురు కాని నేవెట్లుండునో ఎవరికి తెలియును...

నీవు నా మొర ఆలకించి దర్శనమిచ్చిన నే చాటి చెబుతాను..

రాముడు ఇట్లుండునని చూడచక్కని వాడని,ఆజాను బాహుడని,కరునామయుడని,నీలమేఘస్యాముడని,

అవతారపురుషుడని......

నారాయణ





వినిపించిన చాలు నీ నామము..

ఎన్ని జన్మల పాపమైనా తొలగిపోవునే..

కలియుగాన కరువాయే నీ నామము...

తెలిసికూడా పలుకరే నీ నామము..

ముక్తి కలుగు మంత్రమే నీ నామము...

మరల మరల రుచి చూడ తగు నామము...

భోగాలకు తెలియదే నీ నామము...

కస్టాలు కల్గినపుడే తారక మంత్రము నీ నామము..

ఇంతకి ఆ నామమే నారాయణ రూపము..

భక్తి





దైవ భక్తి తోడుంటే సాధించవచ్చు ఏదైనా..

గురు భక్తి తోడుంటే నెరుంగవచ్చు దేన్నైనా..

మాతృ భక్తి తోడుంటే సకలము నీ ముంగిట్లోన..

దేశ భక్తి తోడుంటే చావులేదు ఎపుడైనా.. 

 



దేవుడు తోడు



దేవుడెంతో తెలివైన వాడు..

అంతకు మించి మనసున్న వాడు..

జీవితమనే పూలను తీసి..

కష్టాలనే దారానికి అల్లాడేమో ..

బాధలే లేకుంటే పూలన్నీ చెదిరి..

అందమైన మాలగా లేకుండా..

ఒంటరిగా మిగిలేవేమో..

మనకన్నా పైవాడికే కష్టాలేకువ్వ..

ఈ మాలను వేసుకునేది అతనేగా.

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...