Showing posts with label మట్టి. Show all posts
Showing posts with label మట్టి. Show all posts

ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది


అందరూ మళ్ళీ వెళ్లి మట్టిలోనే కలిసినట్టు, నా మనసుకు ఊపిరి ఆగినప్పుడల్లా నీ జ్ఞాపకాలలో కలిసిపోతూ ఉంటుంది, అందులోనే మళ్ళీ జన్మ పోసుకొని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది...

Like all souls return to dust, my heart, when it ceases to beat, dissolves into memories of you. There, I am reborn, hopeful and waiting...

🩵

దాహం


ఎంతో సులువుగా పొడి మట్టి నుంచి నీరు పిండి నా దాహం తీర్చుకోగలిగాను, కానీ నా మది దాహం తీర్చే నీ ప్రేమను మట్టుకు పొందలేకున్నాను...

I have quenched my thirst by squeezing water from dry sand; it was so easy. Yet, the difficulty lies in quenching the thirst of my heart with your love...

मैंने सूखी रेत से पानी पीकर अपनी प्यास बुझाई है; यह बहुत आसान था। फिर भी, मेरे दिल की प्यास को आपके प्यार से बुझाने में ही कठिनाई है।

🩵

నీ గాలి


గాలి సోకందే మట్టిలో కదలిక రాదు, అంతమాత్రాన అది నిర్జీవి కాదు, నా హృదయాన్ని కదిలించే గాలి నువ్వు, నువ్వు లేకుంటే భావాలు పొంగవు అంతే తప్ప నీ గాలి సోకే వరకు అది ఎదురుచూస్తూ ఉంటుంది...

Sand doesn't move just like that, it needs a gust of wind, right? Still the sand remains alive. You are the only wind that moves my heart, otherwise my heart would also lie like sand, but would not die...

रेत अपने आप नहीं हिलती ना, थोड़ी सी हवा तो चाहिए होती है! फिर भी रेत तो जिंदा ही रहती है। तुम ही हो वो हल्की सी हवा जो मेरे दिल को झुंझलाती है, वरना मेरा दिल भी रेत की तरह पड़ा-पड़ा सूख जाता, मगर मरता नहीं।

🩵

ఇసుక చిమ్ముతోంది నా కళ్ళు


ప్రియతమా, గతంలో నేను ఉద్వేగానికి లోనైనప్పుడు, నా కళ్ళలోతు నుండి కన్నీళ్లు చిమ్మేవి, కానీ ఇప్పుడు, ఇసుక చిమ్ముతోంది, నిన్ను చూసే వరకు కళ్ళు ఎడారిగా ఉండిపోతుంది నన్ను బాధిస్తూ ...

My love, earlier, when I was emotional, tears would well up from the depths of my eyes, but now, it feels as if the sand is coming out, turning them into a desert, until I see you. It hurts so much I have to keep them closed until I catch a glimpse of you..

मेरी जान, पहले, जब मैं भावुक होता, तो मेरी आँखों की गहराई से आंसू छलक पड़ते थे, लेकिन अब, ऐसा लगता है जैसे रेत निकल रही है, उन्हें एक रेगिस्तान में बदल रही है, जब तक मैं तुम्हें नहीं देख लेता. ये दर्द इतना है कि मुझे उन्हें बंद रखना पड़ता है जब तक कि मैं तुम्हारी झलक नहीं देख लेता


💞


బంగారానికైనా ప్రెమకైనా అనువైన వాతావరణం ఉండాలి



మట్టిలో బంగారం దొరుకుతుందని తెలిసి కూడా మట్టి ముద్ద తెచ్చి బంగారం ఇవ్వమని అడగలేము, హృదయంలో ప్రేమ ఏర్పడుతుందని తెలిసి, హృదయాన్ని తెచ్చి ప్రేమ కోసం అడగలేము, బంగారానికైనా ప్రేమకైనా కలగాలి అంటే అనువైన వాతావరణం ఉండాలి..

Knowing that gold is available in soil, we can't bring a lump of soil and ask it to give gold. Similarly, knowing that love is formed in the heart, we can't bring a heart and ask it for love. Both for gold and love to form, there should be a suitable environment...

मिट्टी में सोना होने का मतलब ये नहीं कि हम मिट्टी का ढेला लेकर उससे सोना मांग लें। उसी तरह, दिल में प्यार पनपने का मतलब ये नहीं कि हम दिल को लाकर उससे प्यार मांग लें। सोने और प्यार दोनों को बनने के लिए एक उपयुक्त वातावरण जरूरी है।...

💞

మంచు దుమ్ము


నీ ప్రేమ కూడా పైన పడిన దుమ్ము లాంటిదే కానీ మట్టి దుమ్ము కాదు మంచు దుమ్ము, ఎంత పడితే అంత హాయి...

Your love is also like dust, not the dust of the soil, but the dust of the snow. The more it falls, the better it feels...

💜💜💜

నీటిలో మట్టి




ఎంత కలుపుకున్నా నీటిలో మట్టి అడుక్కు చేరాల్సిందే,
అలజడికి మళ్ళీ కలిసినా అడుక్కు చెరాల్సిందే,
చెలి నీలో నేనుండటమే చాలు నీ పెదవి చుట్టూ తిరిగే తూనీగలా కాకున్నా నీ పాదమడుగున దుమ్మలా అయినా సరే...

However much it mixes with water, mud has to settle at the bottom. Even if it jumps with joy at the slightest movement in the water, it still has to settle down eventually. Dear, it's enough for me as long as I am in you. It doesn't matter whether I am like a honey bee flying around your lips or like the dust under your feet.

💜💜💜

నీ అందం



మట్టి కూడా మొగ్గలా విరబూసే చోటు నీ పాదముంటే, మిణుగురులు చీకటనుకొని వెలుగుతూ మోసపోయే చోటు నీ కురులు అంటే,
మంచు ఆటవిడుపుకు వెళ్ళే చోటే నీ మేని అంటే,
తోటి మగువల అందాన్ని చిన్నబుచ్చే చూపులే నీ మొత్తం అందమంటే...

Your feet are the place where the soil blooms like a bud, and your black hair is the place where fireflies unknowingly turn on thinking it's night. Your body is the playground where snow goes for recreation. Your entire beauty is a gaze that diminishes the beauty of other women..

💜💜💜

వెన్న పరుచుకున్న నేల

నిన్ను చూస్తుంటే మట్టి నేలపై పూచిన పువ్వులా తోచట్లేదు, వెన్న పరుచుకున్న నేలపై వెన్నల ధారకు వికసించిన మల్లె పువ్వులా ఉన్నావు..

Looking at you, you do not look like a flower that has flourished on sandy soil; you look like a jasmine flower that has flourished on butter-spread land, shimmering with the stream of moonlight...

💜💜💜

ప్రాణం పోసుకున్న మట్టి

మట్టిలో నాటితే ప్రాణం పోసుకునే విత్తనం చూసారు, కానీ విత్తనం నాటితే ప్రాణం పోసుకునే మట్టిని చూసారా?
నా మాట్టి హృదయం ప్రాణం పోసుకుంది తను ప్రేమ నాటితే...

You have seen the seed come to life when planted in the soil, but have you seen the soil come to life when the seed is planted? My earthen heart has come to life when she sowed her love...

💜💜

నిన్నెవరూ వేరు చేయలేరు..

గాలి మనసును విరిచేదెవరు, మట్టి ప్రేమను తెంచేదెవరు, తార స్థానాన్ని మార్చేదెవరు,
ఎవ్వరూ చేయలేరు,
నానుంచి కూడా నిన్నెవరూ వేరు చేయలేరు..

Who can break the wind's heart? Who can break the soil's love? Who can change the star's place? 
No one can.
Likewise, no one can separate you from me..

💜💜

మూర్ఖత్వం

మట్టి బుడగను ఊది ఎగరేయలి అనుకోవడం మూర్ఖత్వం...

It is foolish to think that we can fly mud bubbles by blowing them...

💜💜

మారుతాను కానీ మాయమైపోను




నువ్వు ఉప్పొంగే అలవే, మహా కెరటానివే, కానీ నీ తీరంలో నేను మట్టి కోట కాను,నీ రాపిడికి కొంచం కొంచం మారుతూ, నున్నగా మారి, నీ తేమకు మెరిసిపోయే రాతి ముద్దను,చెలి ఎంత తాకిడి ఉన్నా నీకై మారుతాను కానీ మాయమైపోను...

You are a surging wave, a great wave, and I am not a mud fort on your shore. Rather, I am like a lump of stone that changes little by little with your friction, becoming smooth and shining with your moisture. No matter how much I crash, Dear, I will change for you but will not disappear...

💜💜

గుండెకు మట్టి

సాధారణంగా పాదాలకు దుమ్ము అంటుకుంటుంది, కానీ నీ ప్రేమతో బరువెక్కిన నా గుండె పట్టు లేకుండా పడిపోయి మట్టి అంటించుకుంది..

Usually, feet catch dust, but now my heart has caught the dust, as it has become heavy with your love and fallen down without any hold..

💜💜 

కలిసి కలవని ప్రేమలో తెలిసి తెలియని తియ్యదనం ఉంటుంది

కరగదు మట్టి నీరు తగిలితే కానీ మనసు కరిగిపోదా ఆ ఆ కలయికలో పరిమళం తాకితే,
ఏమనాలో తెలియదు కానీ కలిసి కలవని ప్రేమలో తెలిసి తెలియని తియ్యదనం ఉంటుంది...

sand won't melt with rain water,
but the fragrance from it so special,
I don't know how to call it,
but there is unknown sweetness in the relationship which is lovable without love...

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...