Showing posts with label నక్షత్రం. Show all posts
Showing posts with label నక్షత్రం. Show all posts

నీ ప్రేమ వేగం


కొన్నేళ్ల పాటు ప్రయాణించిన కాంతి కంటే నీ ప్రేమ వేగం ఎక్కువ, నక్షత్రాల కూటమి కంటే నీ ప్రేమ బరువు ఎక్కువ, ఈ చీకటి రాత్రి అంత హృదయం ఉంటే తప్ప నీ ప్రేమను నిలుపుకోవడం సాధ్యం కాదుగా...

Your love is faster than the light that has traveled for years, your love is heavier than the constellation of stars, it's not possible to hold your love unless one has the heart the size of this dark night....

आपके प्यार की रफ्तार, बरसों का सफर तय कर चुकी रोशनी से भी तेज है। आपका प्यार, तारों के समूह से भी ज्यादा भारी है। इस घने अंधेरे रात जितना विशाल दिल ना हो, तो आपके प्यार को समेट पाना नामुमकिन है।...

💞

నీవంటి అందం


ఎప్పుడైతే నక్షత్రాన్ని విత్తనంగా నాటగలమో, అప్పుడే నీలాంటి అందం ఈ భూమిపై మొలకెత్తుతుంది..

When a star can be grounded as a seed, then only beauty like yours sprouts on this earth...

💜💜💜

మల్లె సరాలు



వెండి వెలుగులు నీ వెన్ను మెరుపులు,
ఆ మల్లె సరాలు నక్షత్ర మండలాలు,
చీకటి ఆవల ఏముందో అనే ప్రశ్న కంటే,
ఆ చీకటి కురుల వెనక ఎవరా అన్న ఆరాటం ఎక్కువైందే.....

Your back is throwing the silver shine,
The string of jasmine flowers is like constellations,
Rather than finding what is behind the night sky,
The desire to know who is behind the dark hair is increasing...

💜💜💜

తెలుపవా నువ్వెలా వచ్చావు ఈ భూమికి?

తెలుపవా నువ్వెలా వచ్చావు ఈ భూమికి? తాను అప్పు తీసుకున్న ఆవిరిని అంతా కురిపించలేదని, కొన్ని చినుకులు తక్కువ అయ్యాయని, నింగి ఒక తారను బదులుగా నేలకు ఇచ్చేసిందా? ఇది కాకుంటే మరో అద్భుతమా? ఇలా ఏ అద్భుతం జరగకనే నువ్వు ఈ భూమిపై ఉన్నావు అంటే నమ్మకం కుదరదే...

Do you know how you came to this land? Did the sky pour out a few drops less from the vapors it borrowed, and give a star to the earth instead to balance the debt? If not this, then some other miracle? I can't believe that you are on this earth without any miracle happening like this...

💜💜💜

ఇక్కడి దానవు కావు

ఓ దేవీ, పూల మబ్బుల తాకిడికి మెరిసే మల్లెల మెరుపుల ఆకాశమే నీ మేని సొగసు, నిన్ను చూసాక అనిపిస్తోంది, నువ్వు ఇక్కడి దానవు కావు, నదులు పారే నక్షత్రమా నీ ఊరు?
జాబిలినే చెలికత్తెగా తిరుగాడే రాజ్యమా నీ ఇల్లు?
ఎన్ని విశ్వాలు దాటితే నీవంటి అందం కనిపిస్తుందో తెలియదే, ఈ లోకంలో వచ్చి చేరావు నా మనసులో వెలుగు నింపావు...

O goddess, your beauty is like the sky, where the thunders of jasmine flash when the flowery clouds clash. When I see you, it seems like you don't belong here. Is your city a star where rivers flow? Is your home, the kingdom where the moon works as a maid? I don't know how many universes one has to cross to see a beauty like yours, but you came to this world and filled my heart with light...

💜💜

ఆకాశం అనంతమని ఎవరు అన్నారు

ఆకాశం అనంతమని ఎవరు అన్నారు ?
నీతో మాట్లాడని మాటలన్నీ దానివైపు విసిరితే ,
కనీసం ఒక నక్షత్రాన్ని ఉంచగలిగే చోటైనా ఉంటుందా?

who said sky is unlimited?
can it even have a space to keep a star,
if I throw all the unspoken words with you towards it..

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...