మట్టికి కూడా తెలియని నీ లేలేత అడుగు జాడలు, నా స్నేహపు తీరంపై ఇంకా చెరగలేదు చెరిగిపోదు, అలజడి లా వచ్చే అ అలలను తాకనివ్వను , కన్నీటి ధారలా మోసం చేసే ఆ చినుకులను తాకనివ్వను, ఇంకే అడుగును కూడా దానిపై పడనివ్వను, ఎండబారిన నేలనై నే శిధిలమై పదిలపరుస్తా కాని, అ ముచ్చటైన చెలిమి గుర్తులను మరువలేను, ఇకపై ఆ చెలిమిని పెంచాలని వేడుకుంటాను... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
Showing posts with label కరువు. Show all posts
Showing posts with label కరువు. Show all posts
చెలిమి గుర్తులను మరువలేను
నీవు నేను ఒక్కటే
| దిగులు నిండిన మనసుతో ప్రేమకు తావులేని బంధాలతో నాలుగు గోడల నరకంలో ఎలా ఉన్నావు.. అందమునంతవరకు ఆరాధిస్తారు అది ఆవిరయ్యేవరకు ఆనందిస్తారు కన్నీటి కనులు తప్ప కప్పిన సోగాసునే చూస్తారు ఈ నిజమే నీకు తెలిసినా నిస్ప్రుహే వాడికి వదిలేసి కాలుతున్న కాగితమౌతు ఎలా ఉన్నావు... అమ్మ ప్రేమ లేదు తండ్రి లాలన లేదు తోబుట్టువల నీడ లేదు కట్టినమైన రాక్షసత్వము తప్ప! ఎలా వున్నావు నీవెలా ఉన్నావు.. మాములుగా మల్లెల సొగసుకు మోసపోవు కదా! చక్కని జీవితం ఇష్టం లేక కాదు కదా! నిలువ నీడ లేకనా నీవారి కోసమా! నీకోసమైనా సరే ఎలా వున్నావు నీవెలా ఉన్నావు.. నీకెంత ధైర్యం ఇచ్చినా సాయం చేసే చేతులు నాకు లేవు నేను నీలా కాకున్నా సమాజంతో కట్టబడి ఉన్నాను నీవు అందానర్పిస్తే నేను స్వేచ్ఛను అర్పిస్తున్నాను అందుకే నీవు నేను ఒక్కటే... |
మా తెలుగు తల్లివా లేక రాజకీయ బానిసత్వానికి తల్లివా?
| కడుపులో బంగారు.. కనుచూపులో కరుణ... చిరు నవ్వులో సిరులు... వారికివే వరాలు అందినవన్నీ ఆస్తులు... కడుపులో బంగారు ఉన్నంత వరకు అ గర్బాన్నే తొలచి వేస్తారు.. కనుచూపులో కరుణ ఉన్నంత వరకు నిన్నే హేళన చేస్తారు... చిరునవ్వులో సిరులు ఉన్నంత వరకు ఎవరికీ వారు పంచుకుంటారు... ఎవరికోసమిక నీ ఎదురు చూపులు ఎవరి మీద నీ ఆశలు.. తెలుగు తల్లి నీవెవరి తల్లి ? మా తెలుగు తల్లివా లేక రాజకీయ బానిసత్వానికి తల్లివా?.. |
మీ వంతు సాయం చేయండి ...
మీ వంతు సాయం చేయండి ...
మీ వంతు చేయూతనివ్వండి...
మీ వంతు కాస్త దానము చేయండి...
జపనీయులకి మన సహాయం కావాలి. వారిని ఆదుకునే బాధ్యత మనమీద వుంది.
Go through the above link to donate the needy . Its the right time to do it . Don't count please do it
కరువు
మాసిపోయిన బుగ్గలలోనూ చిరునవ్వు దాగుంటుంది... రాత రాని చేతులలోను బంగారు భవిష్యత్తు దాగుంటుంది.. కుమిలిపోయిన మనసులోనూ ప్రేమ ఆకలి నిన్డుంటుంది.. ఇవన్ని గుర్తించి నిర్మూలించిన యావత్ ప్రపంచం సశ్యశ్యామలం అవుతుంది.. కరువు అనే ఆకలి మంట చల్లారుతుంది.. |
Subscribe to:
Posts (Atom)
అందమైన ఆయుధం
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...






