Showing posts with label స్నేహం. Show all posts
Showing posts with label స్నేహం. Show all posts

స్నేహం

ఒక స్నేహంతో పలు స్నేహాల హారం కూర్చారు, ఒక్క మాటతో పలు భావాలని అందించారు, నా వెలుగు జీవితాన్ని మరింత వెలుగుమయం చేసారు, నాతో ఉన్నారు వచ్చారు తిరిగారు మాట్లాడారు పంచుకున్నారు నేర్పారు స్పూర్తిగా నిలిచారు, తేటతెల్లం మీ స్నేహం ఆణిముత్యం...

ప్రేమలో స్నేహం




పంజరంలో ఉందని తెలిసి చిలుకతో స్నేహం చేస్తే, ఆ స్నేహానికి పేరు ప్రేమ, ఎగిరే చిలుక నేల దిగి నీ ప్రేమకై నడిచొస్తే, ఆ ప్రేమకు పేరు స్నేహం...

When you befriend a parrot in a cage, the name of that friendship is love. When the flying parrot love to walk with you, then that love is called friendship..

💜💜💜

నీ బంధం


ప్రతి మాట గతి తప్పి నెల తప్పి నీ భావాన్ని పుట్టిస్తుంటే మైత్రినో మాయనో తెలియదు కానీ నీ పరిచయం ఒక పండుగే నీ తోడు నాకు వేడుకే, చేరువుగా ఉన్న వేల ఆకుల మర్రి చెట్టు నీడ కన్నా దూరంగా ఉండి నాపై వెలుగును చినుకును మంచును వసంతపు మాలికలను చల్లే నీ మేఘాల నీడలో ఉంటే చాలదా, పాత స్నేహాలు కొత్త స్నేహాలు అన్ని కలిపినా సరి తూగవు నీకు, చలువ చల్లే వెచ్చని దీపామా వెయ్యి వెన్నెలలు కలిసిన మనిహారమా, నీ మాటకు ఉప్పొంగి నాలో ఉబికే ఈ ఆత్మీయ లేఖ, నీ చెలిమి వ్రతాన్ని అందరూ చేయాలని అందరికీ అందాలని నా కోరిక...

I don't know whether every word that goes out of the way and delivers the feelings to you is an illusion or reality, but your acquaintance is like a festival to me. Even though you are far away like a cloud, your shadow shines on me like the sun, showering me with rain and snow, which is better than the thousands of shadows falling on me now. You are like a garland of spring flowers that adorns my neck. Whether it is old or new, no love can match yours. You are like a lamp that showers the snow and a necklace of a thousand moons. This heartfelt letter is my tribute to the love you have shown me. I wish everyone could celebrate your presence in their life and witness the loveliest being...

💜💜💜

పడ్డాను నీ మంచి మనసు లోయలో

జాబిలికే ప్రాణం ఉంటే నేలకలా దిగివచ్చేది, 
తానుకూడా మనిషే అయితే నీ అందానికి సరితూగేది,
చూపు లేదు దానికి,
ఉంటే నింగీలో నీ బొమ్మను గీసేది,
నీ చెలిమి తెలియదు దానికి,
తెలిస్తే రెయికి వెన్నెల తెలియకుండేది,
అంతగా ఏముందో నీలో,
పడ్డాను నీ మంచి మనసు లోయలో....

జ్ఞాపకాలుగా ఉండిపోతాయంటే

ఒక్కసారి వచ్చి పోయినా,
వేల కాంతులు వెదజల్లితే,
రెప్పలార్పక చూస్తూ ఉన్నా,
అవి నా జ్ఞాపకాలుగా ఉండిపోతాయంటే....

మా స్నేహం

విరిసిన పువ్వు వదిలిన రేకులు చూసుంటారు కానీ రేకులు పోగైతే విరిసిన పువ్వు మా స్నేహం...

స్నేహం

ఏదైనా ఇమిడే బంధం ఉంటే అది స్నేహం ఒక్కటే..

శుభోదయం

వెచ్చని హృ(ఉ)దయానికి చల్లనిది నీ కబురు...

నీతో కలిగిన బంధం చూపుతోటి కాదేమో

ప్రతి ఉదయం వెలుగు తాకినా, సూర్యుడిని చూడాలని అనిపించదు, 
రోజు వస్తాడని చులకనేమో,
కానీ నీ కబురు అందినపుడల్లా, 
నిన్ను కలవాలని అనిపిస్తుంది,
నీతో కలిగిన బంధం చూపుతోటి కాదేమో...

వెన్నెలొచ్చింది

చల్లగాలికని వచ్చి,
చిన్న కవితను రాసుకున్నాను,
అడిగి తీసుకెళ్లింది,
కానీ ఆ పిల్ల ఏమైంది?
వెతికేలోపే వెన్నెలొచ్చింది,
వెన్నెల కాదు తనేనని తాకి వెళ్ళింది..

బుంగమూతికి రాయనా బుజ్జగింపు లేఖ

నీ బుంగమూతికి రాయనా బుజ్జగింపు లేఖ?
ఏ వైపు చూసినా అంత ముద్దొస్తుంటే, నీది అలక అనుకోవాలా లేక అందం అనుకోవాలా?

మాటల బుడగలు

నీ మాటల బుడగలు ఎగురుతుంటే 
నా అల్లరి వాటితో స్నేహం కోరుకుంది...

స్నేహం ఓడిపోదు

ఎన్ని చినుకులు ధారపోసినా నేల నింగినంటదు,
ఎంత ఆవిరిని కానుకిచ్చినా,
నింగి నేల చేరదు,
దూరం తొలగకున్నా,
వాటి స్నేహం ఓడిపోదు,
పలుకులే కానుకలై ఒకరికొకరం ఇచ్చుకుంటే,
పరవశించే ప్రకృతే మన చెలిమి కూడా!

నీ స్నేహం

చిరునవ్వు చేజారి పోనీకు,
చిన్న ఆశ నాలో అది నీతోటే ఉండనివ్వు,
కలలు ఎక్కువైతే వదిలిపోనీకు,
కలలు రావు నాకు కాస్త అప్పు ఇప్పించు,
కన్నీళ్లు వస్తే నీ దోసిల్లలోనే ఉంచు,
అదీ నాలా ముత్యమౌతుంది నీ స్నేహం దానికి పంచు,
చదివి చదివి అలిసిపోయినా మళ్ళీ చదువు,
నా అక్షరానికి కాస్త విలువ పెంచు...

నీ కాగితం పైన నా అక్షరం అందం ఆనందం

కాగితంపై రాసుకున్నాను... 
పూల రేకులపై రాసుకున్నాను... 
ఎండుటాకులపై రాసుకున్నాను....
మనసులోను రాసుకున్నాను...
ఎక్కడ రాసినా లేని అనుభూతి ఇక్కడ చూస్తే కలుగుతోంది...
నీ కాగితం పైన నా అక్షరం అందం ఆనందం...

నిదురపుచ్చే కల

నిదురలో కలలు కన్నా కాని కలలే నిదురపుచ్చడం కొత్తగా ఉంది...

సాధ్యమా?

తూరుపు వెలుగు అందుకుంటూ ఉనప్పుడు,
నీటిలో తొంగి చూసి ప్రతిబింబం వద్దనుకోవడం....
నీతో స్నేహం కలుగుతునప్పుడు,
నీ మనసు చూసి ప్రేమ రాదనుకోవడం....
సాధ్యమా?

కనిపించు వినిపించు

నువ్వు వినిపించినా కనిపించని వేణు గానం,
కనిపించినా వినిపించని రవి కిరణం...
💓

మొహమాటం

మొహమాటానికి మోహమాటాలు తొలి అడుగులు వేసే స్నేహం లో సహజం,
మొహమాటం అంటూనే మాట ఆగకుంటే అది ముదిరిపోయే స్నేహానికి సంకేతం,
నిర్మొహమాటంగా చెలరేగిపోతే అది మోక్షం పొందిన స్నేహానికి దర్పణం...

ప్రేమకంటే గొప్పది

నువ్వు లేకున్నా దిగులు పడదు,
నీకోసమే ఉండిపోదు,
నువెవరో దానికి తెలియదు,
నీ కులం దానికి అర్థం కాదు,
శ్వాసానిచ్చే గాలికి ప్రాణం ఇవ్వడం తప్ప ప్రేమించడం రాదు,
నువ్వుగా వదిలితే తప్ప అది నిన్ను వదలదు,
ప్రేమకు అతీతం ప్రాణ దానం,
ప్రేమకు అతీతం ఆ స్నేహా భావం...

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...