Showing posts with label అలజడి. Show all posts
Showing posts with label అలజడి. Show all posts

నా మాట లో నీ అందం


హాయిగొలిపే ఎండుటాకుల అలజడిలా, నా అందం నా మాటలలో కనిపిస్తుంది, మెత్తని లేత పూరేకులా, నీ అందం నీ కోమలత్వంలో దాగుంది, నా మాటకు నాపై ప్రేమ కలుగుతుంది నీ అందంతో నీపై ప్రేమ కలుగుతుంది, మన ఇద్దరం ఒకటైతే ఆ తోటను ప్రతి ఒక్కరూ ప్రేమించరా...

My beauty lies in the sound of my words, akin to the rustle of dry leaves flowing in the wind. Your beauty lies in the tenderness you possess, resembling the soft petals of a flower. I am loved for my voice, and you are loved for your beauty. Together, we dwell in a garden cherished by all...

💞

ఎంత అలజడికైనా నేను సిద్ధమే


కొలనులో అలజడి కలిగించిన వాన చుక్క కొలనులోనే కలిసిపోయినట్టు, చెలి! నాలో నువ్వు కలిసిపోతానంటే, నాతో ఉండిపోతానంటే, ఎంత అలజడికైనా నేను సిద్ధమే....

Like the raindrop that ripples the pool, eventually blending in smoothly, dear! I can withstand any trouble that ripples my heart and patiently await until your love becomes a part of my heart...

जैसे बरसात का एक बूंद, जो तालाब में लहराता है, आखिरकार धीरे-धीरे मिल जाता है, प्रिय! मुझे कोई भी मुसीबत झेलने की ताकत है, जो मेरे दिल को लहराती है, और मैं धैर्य से इंतजार करता हूँ, जब तक आपका प्यार मेरे दिल का हिस्सा नहीं बन जाता।

💞

సంద్రంలో కొండను విసిరినా

సంద్రంలో కొండను విసిరినా అది కలిగించే అలజడి ఎంతమాత్రమూ తెలియదు, 
పడిన చోట గుర్తు తెలియదు,
కానీ నా భావ సంద్రంలో విసిరే నీ ఆవగింజంత పలకరింపైనా,
మది తీరాన్ని ముంచేలా అలజడి రేపుతుంది,
నింగిని తాకేలా అలలు ఎగసిపడతాయి...

Throwing a hill into the ocean does not reveal how much of a stir it will make, nor will it leave a mark on the place it is present. 
However, even if you throw a word the size of a mustard seed into my heart, 
it engulfs my heart's shore,
and it raises the waves sky high...

💜💜

ఓడిపోయాను

నీ మనసును వినాలనుకునే క్రమంలో నా వినికిడిని ఎంతగానో పెంచుకున్నా, 
నత్త వేసే అడుగుల చప్పుడు వినగలిగాను, 
మొగ్గ పువ్వుగా మారేటప్పుడు అది పగిలే శబ్దాన్ని వినగలిగాను,
ఉప్పు నీళ్ళ కలయికలో వచ్చే అలజడిని వినగలిగాను,
కదిలే మేఘాల అలికిడిని వినగలిగాను,
కానీ ఇంకా నీ మనసు పలికే మౌనాన్ని అందుకోలేకున్నాను ఓడిపోయాను...

In the process of hearing your heart, I enhanced my hearing.
I could hear the snail's footsteps.
I could hear the sound of a bud bursting into a flower.
I could hear the tumult of saltwater mixing.
I could hear the waves of moving clouds.
But still, I can't grasp the silence that speaks your heart, and I'm defeated...

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...