ఆడుతోంది నా యవ్వనం...














చల్లని చిరు గాలితో

చినుకుల సయ్యాటతో

పులకరించి పరవశించే ఈ సమయం

మెరుపుల మేనత్తకు

మబ్బుల మావయ్యకు

గొడవలతో హోరెత్తే ఈ సమయం

ఆగమన్నా ఆగనంది వయసుమీద ఉల్లాసం

చాలన్నా బలవంతం చేస్తోంది ఆ మేఘం

దారి తెలియక తికమక తో వాగు వంక పోతుంటే

చాలధంటూ చలి మంచు దారి కప్పుతుంటే

ఆగకుండా ఆవేశంతో ఆడుతోంది నా యవ్వనం...


4 comments:

జ్యోతిర్మయి said...

అయితే మీకు జల్లంత కవ్వి౦తతో పాటు ఒళ్లంత తుళ్ళింత వచ్చేసి౦దన్నమాట..బావుంది కళ్యాన్ గారూ..

సుభ/subha said...

మెరుపుల మేనత్తా, మబ్బుల మావయ్య ఐతే మరదలు ఉరుమేమో.. జాగ్రత్త కల్యాణ్ గారూ..ఏదేమైనా కాస్త విరామం తర్వాత హఠాత్తుగా యవ్వనం గుర్తొచ్చింది మీకు.

రసజ్ఞ said...

వానా వానా వల్లప్పా అని పాడే చిన్నతనం
జల్లంత కవ్వింత కావాలిలే అనే చిలిపితనం
ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా అనే కొంటెతనం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ అనే కుర్రతనం
వాన కాదు వానా కాదు వరదరాజా అనే యవ్వనం
అన్నిటి అనుభూతీ లభించింది కళ్యాణ్ గారూ!

ఆఖరి వరుస ఆగకుండా ఆవేశంతో ఆడుతోంది అంటే ఇంకా బాగుంటుంది అనిపించింది!

Kalyan said...

@జ్యోతిర్మయి హ నిన్న వాన వదలకుండా పడింది తిరుపతి లో అందుకే అలా వచ్చేసింది :)

@సుభ గారు మరి మరదలు ఆ మాత్రం వురుములా లేకపోతే ఎం బాగుంటుంది చెప్పండి

@రసజ్ఞ ఓహ్ చాలా సంతోషం :) నిన్న నాకు కూడా అలానే అనిపించింది వానలో తడుస్తుంటే ఎంత బాగుందో మరి ... అవను చివరి వరుస చూడలేదు తప్పు వచ్చేసింది చక్కగా సరి చేసారు ధన్యవాదాలు మార్చేసాను కూడా ఇపుడు

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...