Thursday, September 16, 2021

పడ్డాను నీ మంచి మనసు లోయలో

జాబిలికే ప్రాణం ఉంటే నేలకలా దిగివచ్చేది, 
తానుకూడా మనిషే అయితే నీ అందానికి సరితూగేది,
చూపు లేదు దానికి,
ఉంటే నింగీలో నీ బొమ్మను గీసేది,
నీ చెలిమి తెలియదు దానికి,
తెలిస్తే రెయికి వెన్నెల తెలియకుండేది,
అంతగా ఏముందో నీలో,
పడ్డాను నీ మంచి మనసు లోయలో....

Sunday, September 12, 2021

జ్ఞాపకాలుగా ఉండిపోతాయంటే

ఒక్కసారి వచ్చి పోయినా,
వేల కాంతులు వెదజల్లితే,
రెప్పలార్పక చూస్తూ ఉన్నా,
అవి నా జ్ఞాపకాలుగా ఉండిపోతాయంటే....

Monday, September 6, 2021

స్వాతంత్య్రం అంటే?

స్వాతంత్య్రం అంటే?


జెండాకు వందనం,

తీపిని పంచడం,

సేవలకు దూరమవ్వడం,

సెలవును ఆస్వాదించడం,

ఇదేనా స్వాతంత్య్రం అంటే? కాదు


శత్రువుల చెరల నుంచి విముక్తి పొందితే వచ్చిందని పుస్తకాలు చెప్పాయి,

పాఠశాల గంటలో ఉందని విద్యార్థులు చెప్పారు,

ఒడి చెరనుంచి పారిపోయే అడుగులలో ఉందని బిడ్డ చెప్పింది,

ప్రేమను  సాధించటంలో ఉందని యువకుడన్నాడు,

అప్పులు లేని వ్యాపారంలో ఉందని వర్తకుడు అన్నాడు ,

ఆరోగ్యంలో ఉందని  రోగి అన్నాడు ,

ఇదేనా స్వాతంత్య్రం అంటే? కాదు


ఎక్కడ పడితే అక్కడ ఎంగిలి ఉమ్మడం , 

స్వేచ్ఛగా చెత్తను ఉన్నచోటే పారేయడం ,

ఎవ్వరు చూడనపుడు తప్పు చేయడం,

వ్యాపారం పేరుతో దోచుకోవడం,

లంచాలు ఇచ్చి శిక్షను తప్పించుకోవడం,

విదేశీ రుచికోసం ఆరోగ్యాన్ని వదులుకోవడం,

అవసరం కోసం నియమాలను ఉల్లంఘించడం,

ఇదేనా స్వాతంత్య్రం అంటే? కాదుఓ సామాన్యుడా మేలుకో,

శత్రువులు పోయారు,

మనకు స్వేచ్ఛనిచ్చిన నేతలు పోయారు,

కానీ స్వాతంత్య్రం ఏది?

మన అడుగులు దేనివైపు?

శత్రువు లేని సమాజాం కోసమే అయితే నీ పోరాటంతో పనిలేదు సైనికులు ఉన్నారు,

ఆకలి తీర్చే ప్రయాసపడకు కర్షకులు సేవకులు ఉన్నారు,

రోగాలతో పోరాడకు వైద్యులున్నారు,

నీ రక్షణకై బయపడకు రక్షకభటులున్నారు,

ఇంకా మెరుగైన సమాజమా నీ లక్ష్యం?

అయితే నీ ఒక్క చిన్న చర్యను సరిచేసుకో,

అదే స్వాతంత్య్రం ఆరోజే నిజమైన స్వాతంత్య్ర దినోత్సవం..... 


What is independence?


A Salute to the flag,

Handing out candy,

Staying away from services,

Enjoying the holiday,

Is this independence?


The books say that we got it by freeing ourselves from enemies,

Students say that it is in the last school bell,

The baby said it is when he can walk or run,

The young man said that it is when he can get the love,

The trader said it is in a debt-free business,

The patient said it is in good health,

Is this independence?


you are free to spit anywhere,

You are free to throw the garbage anywhere,

You are free to make a mistake when unnoticed,

Robbery in the name of business,

Violating the rules for our necessities,

Giving up the health for the foreign taste,

Is this independence?Wake up, O commoner,

The enemies are gone,

We have lost the leaders who set us free,

But what is independence?

Which way are our feet?

Do you want to fight with our enemies? don’t worry soldiers are taking care,

Do you want to fulfil hunger? don’t worry, farmers are there,

There are doctors to fight diseases,

There are police to protect you,

If you still want a better independent society?

Correcting your one small action will bring all of us the same,

And that day is the real independence day…..
Sunday, September 5, 2021

మా స్నేహం

విరిసిన పువ్వు వదిలిన రేకులు చూసుంటారు కానీ రేకులు పోగైతే విరిసిన పువ్వు మా స్నేహం...

Friday, August 27, 2021

బుగ్గ శిఖరాన

నీ బుగ్గ శిఖరాన నునివెచ్చని ముద్దుల కిరణాలు ప్రసవించనా?

Monday, August 23, 2021

అందం

కృష్ణ బిలం లాంటి సాంద్రమైన నీ అందాన్ని దాటేసే వీలులేక అందులో చిక్కుకున్న నా చూపును నీకు అంకితం చేస్తున్నాను....

Sunday, August 8, 2021

కలువకు కోరిక కలిగే

నీ అందచందాల కథలు విన్న కలువకు,
కనులు కావాలని కోరిక కలిగే...

A lily that heard the stories of your charms desired to have eyes...

Sunday, August 1, 2021

స్నేహం

ఏదైనా ఇమిడే బంధం ఉంటే అది స్నేహం ఒక్కటే..

Thursday, July 29, 2021

గుడ్డి నమ్మకం

కడలిని నమ్మి పడవ సాగదు,
పోటు ఎక్కువైతే మునగక తప్పదు,
నమ్మకం ఎప్పుడైనా వమ్ము కావచ్చు,
 అన్నిటికి సిద్ధపడితే ప్రయాణం సుగమం కావచ్చు,
నిజం గ్రహిస్తే మరో దారి ఉంటుంది లేకుంటే నీ గుడ్డి నమ్మకమే నీకు శత్రువౌతుంది...

Wednesday, July 28, 2021

తేలిపోతోంది

ఆగని ప్రవాహంలో ఎండుటాకు తేలిపోయినట్టు 
నను పట్టించుకోని నీ చూపుల ప్రవాహంలో నా ఎదురుచూపు తేలిపోతోంది...