కరోన

సామాన్యుడికి ఒక అవకాశం,
కవచం కాకు,
ఆయుధం పట్టకు,
ఆవేశపడకు,
నువ్వు ఉన్న చోటే దేశ సరిహద్దు,
గడప దాటనిదే శత్రువుకు బలం లేదు,
దేశభక్తిని ఇక చాటుకో పౌరుడా,
కనిపంచని గుండె చప్పుడై,
లోన ఉండి ఈ ప్రపంచాన్నే కాపాడు...
🙏

మరో కథ

నీ కథ నువ్వే అడిగితే ఏం చెప్పగలను, 
నీపై ఉన్న ఇష్టాన్ని మరో కథలా మార్చలేను....

నవ్వు

చిన్న నవ్వు చూపించి,
మరో చిన్న నవ్వు వెలిగించు,
మంచి మాట వినిపించి,
ఒక మంచి మనసు గెలుపొందు...

అమ్మ

ఉన్న ఒక్క పండు వాడిపోతే కొమ్మకెంత కష్టం,
ఆ కొమ్మ ఒక్కటే చెట్టున ఉంటే పిల్ల గాలి కూడా పెను భారం,
కానీ వాలిపోదు తూలిపోదు ప్రాణమంతా పొగుచేసి,
 తానే ఒక వృక్షమై,
నీడనిస్తూ ప్రాణమిస్తూ ఉండిపోతుంది,
ఆ కొమ్మ లోని అమ్మకు 🙏

ఆఖరి పుస్తకం

ఒక పాఠకుడు అనేక పుస్తకాలను ఎంచుకోవచ్చు, కానీ ఒక పుస్తకం దాని పాఠకుడిని ఎంచుకుంటే, అది అతని చివరి పుస్తకం అవుతుంది... A reader can choose man...