Showing posts with label ముద్దు. Show all posts
Showing posts with label ముద్దు. Show all posts

నా చేతి ఆకాశాన పండిన జాబిలి


నా చేతి ఆకాశాన పండిన జాబిలి నువ్వే కదా, నీడైనా నువ్వు నిజమే కదా, చీకటి కలతలకు చిక్కని నీ నవ్వు, నీడలోనూ ముద్దొచ్చే చందమామవు...

You are the moon in the sky of my hands; you are true even if you are a shadow. The sorrowful darkness cannot dim your smile, and even your shadow is so beautiful...

💞

కోమలం


గాలిలో ముద్దు కూడా నిన్ను గాయపరిచేంత కోమలంగా ఉన్నావు, అందం అన్న పదం నీ తరువాత జన్మించిందేమో...

You are so delicate that even a kiss could hurt you; perhaps the word "beauty" was born only after you..

आप इतनी कोमल हैं कि एक चुंबन भी आपको चोट पहुँचा सकता है; शायद "सुंदरता" शब्द आपके बाद ही जन्मा होगा।

💞

నీడనే ముద్దు కోరితే


నీ నీడనే నీకు ముద్దు పెట్టేంతగా ముద్దొస్తున్నావు, చెలి నీ అందాన్ని నేను ఏమని వర్ణించను...

आप इतनी प्यारी हैं कि आपकी परछाई भी आपको चूमना चाहती है, मेरी जान, आपके खूबसूरती का वर्णन मैं कैसे करूं...

You are so cute that your own shadow wants to kiss you, my dear how can I describe your beauty...

💞

మనసంతా ధారపోసిందని


నింగికెగిరి మబ్బును ముద్దాడే పువ్వు మనసులో ఉన్నది ప్రేమైనా సరే కోరికైనా సరే మొక్కను వదిలి అంత దూరం వెళ్లే సాహసం చేసినప్పుడే తెలిసింది తన మనసంతా ధారపోసిందని..

Whether it is love or lust, what is that in the heart of the flower that left the plant and flew to the sky to kiss the cloud, is pure involvement...

💜💜💜


పాదాలు పెట్టే ముద్దులు



అందరూ నేలపై అడుగులని అనుకుంటున్నారు కానీ ఆ తీరానికి కదా తెలుసు అవి నీ పాదాలు పెట్టే ముద్దులని...

All believe these are your footprints,
Yet only the shore knows: they are the tender kisses of your feet...

💜💜💜

నీ బుగ్గలు

బుగ్గల పండగకి దేవత నువ్వేగా ,
బూరెలు కూడా ఓడిపోయే బుగ్గలు నీవేగా ,
నూనెలో వేగకున్నా ఉబ్బిన పూరీలు ,
తాకితే చేతికి అందేటి పువ్వుల చెక్కిళ్ళు,
పడితే చినుకు కూడా ఎగురుతూ ఆడుకోదా,
నీ బుగ్గపై ముద్దులు అమ్మితే స్వర్గమే కొనవచ్చుగా,
పాలరాతి చిట్టి బొమ్మ ఎంత అందమైనా ఓడిపోదా,
ఎంగిలి ఎంత అదృష్టం చేసుకుందో దాని చుట్టే ఉంటుంది,
బుగ్గ దాటి ఏముందో నీ కళ్ళు కూడా చూడలేకుంది,
సాగే సంసారాన్ని మరవాలంటే నీ సాగే బుగ్గలు తాకితే చాలు,
నీ ముద్దు మురిపాలతో అన్ని మరచిపోవచ్చు .... 

అలాగైనా నాకని అనుకుంటా

ఓ గాలి నేను చూస్తున్నప్పుడు,
కాస్తంత దుమ్ము మోసుకెళ్ళు ,
తనపై చల్లు ,
ఊదే తన పెదవులను చూసి ,
నాకు ప్రసాదించిన ముద్దని సంతోషిస్తాను ...

O wind, as I watch,
Carry some dust,
Caress it upon her,
I would be happy to see her lips gently swaying,
and imagine that it's the kiss bestowed upon me..

💜💜

ముద్దొస్థావు

ప్రేమను చెప్పకుండా చుపించినప్పుడు నువ్వు చాలా ముద్దొస్థావు..

It's so cute when you show love without expressing it..

💜

నీతో నేను

ఎంత ముద్దాడిన గాలితో సాగదు పువ్వు,
ఎంత ముంచెత్తినా నీటిలో కరగదు ముత్యం,
కానీ గాలి లేనిదే పువ్వు ఆడదు,
సంద్రం లేనిదే ముత్యం కలగదు...

How much ever it kisses,
Flower doesn't fly with the wind,
How much ever it cares,
Pearl won't dissolve in Ocean's love,
But flower won't wiggle without wind,
Pearl cannot form without water..

💜

నీ నవ్వు చాలా పొడవు

Your smile is so lengthy that I can land billions of kisses between the two cheeks...

నీ రెండు బుగ్గల మధ్య కొన్ని కోట్ల ముద్దులను పెట్టగలను ఎందుకంటే నీ నవ్వు చాలా పొడవు...

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...