Showing posts with label సూర్యుడు. Show all posts
Showing posts with label సూర్యుడు. Show all posts

ప్రేమతో కోపం


ప్రతిరోజూ, సూర్యుడు లేత ఆకులకు వేడి పంచి, వాటిని పెంచుతాడే కానీ దహించడు. అదేవిధంగా, నీ కోపం ప్రేమతో కూడుకున్నది అది ప్రేమను పెంచుతుందే కానీ ద్వేషాన్ని కాదు...

Every day, the sun heats up the tender leaves, not to burn them, but to nurture them. Similarly, your anger arises out of love to foster more love, rather than from hate or disagreement...

हर रोज़, सूरज कोमल पत्तियों को गर्म करता है, उन्हें जलाने के लिए नहीं, बल्कि उन्हें पालने के लिए। उसी तरह, आपका गुस्सा प्यार से उत्पन्न होता है, और और अधिक प्यार को बढ़ावा देने के लिए, न कि नफ़रत या असहमति से।..

💞

పొగలేని అందం


సూర్యుడిలో నిజమైన అందం ఏంటంటే,
 పొగ లేకుండానే మండుతూ వెలుగు ఇస్తుంటాడు, ప్రియతమా నీ చిరునవ్వు లోని అందమూ అలాంటిదే, ఎవ్వరినీ మాయ చేయకుండా వెలుగునిస్తూ ఉంటుంది..

The allure of the sun lies in its smokeless radiance. Much like you, my dazzling star, you consistently radiate the beauty of a smile, never casting a shadow on anyone's vision...

💞

చల్లని తాపం


దేవుడు ఈ భూమిని తీసి సూర్యుడికి దగ్గర పెడితే వెలుగు లేనిది అవుతుందేమో ప్రపంచం ఆ భానుడిని చల్లబరుస్తుంది నీ చల్లని తాపం...

If God were to take this Earth and place it near the Sun, this world would become dark as the Sun cools down due to your cool nature...

💜💜💜

దూరం సులువు



నన్ను దూరం పెట్టాలి అంటే చాలా సులువు,
నీలో ప్రేమను ఒప్పుకొని వెళ్ళిపో అను,
సూర్యుడు కళ్ళు తెరిచి చూసినా కనిపించనంత దూరం పోతాను,
అదే ప్రేమ దాచి వెళ్ళిపో అని అంటే,
చీమ కళ్ళ మధ్య ఎంత దూరం ఉంటుందో అంత దూరం కూడా కదలను...

It's so easy to keep me away:
Admit your love and ask me to stay away.
I will go so far away that not even the eyes of the sun can reach.
But if you ask me to stay away, hiding the love,
I won't even move as far as the distance between the eyes of an ant...

💜💜💜

ఆవగింజ బరువుకు కొండలు పిండికాని

రతనాలు రాలని ,
ముత్యాలు కురవని,
నేలనే నింగికేగి వీడుకోలు పలకని,
ఆవగింజ బరువుకు కొండలు పిండికాని,
పసుపు సూరీడు పండులా మారని ,
ఇన్ని అసాధ్యాలు సుసాధ్యమైతే ,
మన బంధము తెగిపోని.... 

Let the gems fall,
let the pearls rain,
let the land fly to the sky and bid farewell,
let the mountains crush under the weight of a mustard seed,
let the yellow sun turn into a fruit,
if so many miracles are possible,
let our bond also break..

💜💜

చంద్రుడు మండడు

చంద్రుడు ఎంత ప్రయత్నించినా సూర్యుడిలా మండలేడు. చల్లటి కాంతిని చల్లడం లేదా దాగడం తప్ప మండటం తెలియదు..

However hard the moon try it cannot be as hot as the sun,
It doesn't know anything other than showering the cool light or hide itself but it never cause burns..

💜

నువ్వు నా చెంతనే ఉంటే

నువ్వు నా చెంతనే ఉంటే అర్ధరాత్రి సూర్యుడిని మరియు మధ్యాహ్న చంద్రుడిని చూసే అవకాశం నాకు ఉంటుంది..

If you're by my side, I'll get to see the midnight sun and the midday moon..

अगर तुम मेरे बगल में हो तो मुझे आधी रात का सूरज और दोपहर का चांद देखने का मौका मिलेगा

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...