Showing posts with label ఆడదాని మనసు. Show all posts
Showing posts with label ఆడదాని మనసు. Show all posts

బంగారు వజ్రం

దేని విలువ దానిదే అయినా,
వజ్రంపై బంగారు పూత పూసి,
దాని విలువ పెంచాము అనుకునే రోజులు,
దీనికి మెచ్చుకోవాలా లేక దిగులుపడాలా?,
చేయగలిగినా చేతులు కట్టేసిన ఆడవారి దుస్థితి,
నేర్పు ఉన్నా నేర్చుకోలేని అభాగ్యుల మనోగతి...

మనసు కథ మనసులోలోనే కదా

ఎంత బరువు పెట్టినా పెట్టినట్టు ఉండదు..
ఎంత తట్టుకున్నా బరువు మోసినట్టు ఉండదు..
మనసు కథ మనసులోలోనే కదా..

నాకోసమే అ కవ్వింతలని....


















చక్కనోడు చందురోడు పున్నమై వచ్చాడు 

చల్లని మేఘాలనల్లి  నా చెలిని దాచాడు


తారలలో ఉందేమో చూపులను పంపిస్తే


వెన్నలను చూపించి నా కనులను దోచాడు


మభునై పయనిస్తూ విను వీధులు వెతుకుంటే


చల్లని గాలినే పంపి నన్ను చినుకులా మార్చాడు


నా ప్రయత్నమంతా మానుకొని అలా చూస్తున్దిపోతుంటే


తెలిసింది ఆ జాబిలే నా చెలి అని 

నాకోసమే అ కవ్వింతలని.... 









నీవు నేను ఒక్కటే





దిగులు నిండిన మనసుతో

ప్రేమకు తావులేని బంధాలతో

నాలుగు గోడల నరకంలో ఎలా ఉన్నావు..



అందమునంతవరకు ఆరాధిస్తారు

అది ఆవిరయ్యేవరకు ఆనందిస్తారు

కన్నీటి కనులు తప్ప కప్పిన సోగాసునే చూస్తారు

ఈ నిజమే నీకు తెలిసినా నిస్ప్రుహే వాడికి వదిలేసి

కాలుతున్న కాగితమౌతు  ఎలా ఉన్నావు...



అమ్మ ప్రేమ లేదు

తండ్రి లాలన లేదు

తోబుట్టువల నీడ లేదు

కట్టినమైన రాక్షసత్వము తప్ప!

ఎలా వున్నావు నీవెలా ఉన్నావు..



మాములుగా మల్లెల సొగసుకు మోసపోవు కదా!

చక్కని జీవితం ఇష్టం లేక కాదు కదా!

నిలువ నీడ లేకనా నీవారి కోసమా!

నీకోసమైనా సరే ఎలా వున్నావు నీవెలా ఉన్నావు..



నీకెంత ధైర్యం ఇచ్చినా

సాయం చేసే చేతులు నాకు లేవు

నేను నీలా కాకున్నా సమాజంతో కట్టబడి ఉన్నాను

నీవు అందానర్పిస్తే నేను స్వేచ్ఛను అర్పిస్తున్నాను

అందుకే నీవు నేను ఒక్కటే...

 
  

ఓడిపోదు ప్రేమ





వెలుగే నీతో పయనించడం ఆగిపోయిందా...

నీ ప్రాణం నీ కోసం ఉండనంటోందా       ..

ఏదో ఎదలో భారం తెలియని ఒక లోపం..

మనసే చెదిరే సమయం దానికి ఎవరు చేస్తారు సాయం...





తూరుపు వెలుగు వెళ్ళకు..

సంధ్యారాగం ఆపకు...

చీకటి పడకు తారలేందుకు...

జాబిలే లేకపోతే...





మత్తు పూల వాసనలు ఎందుకు...

మంచు పలకరింపులు ఎందుకు...

వాన జల్లుల ఓదార్పులేందుకు ..

మేఘమే తరలిపోతే..



కాని ప్రేమకోసం నిలచెంతగా నాలో స్పృహ ఎక్కడో దాగుంది..

దాని మాట కోసం ఉండేంతగా నన్నే మార్చివేసింది..

నిలిచివుంట ఒక నీడనై ఎండ వేడిలో ఓ చెట్టునై..

కలిసిపోతా ఈ కాలంతో రగులుతు ఓ వెలుగునై...

 

ఆడదాని మనసు





అన్నింటినీ దాచేలా ఒకటుండాలి..

దానిని దాచేలా ఓ చోటుండాలి..

దానికి చేరలేని దారుండాలి..

ఆ దారికి తెలియని గుర్తుండాలి..

ఆ గుర్తును ఆడదాని మనసునుంచాలి..











.

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...