Showing posts with label అద్బుతం. Show all posts
Showing posts with label అద్బుతం. Show all posts

నీ భావాలకు చేరువగానే


భూమి నుండి దూరంగా పోతున్నట్టు కలలు వచ్చాయి, అప్పటికీ ఈ అద్భుతమైన విశ్వంలోనే ఉన్నా అని, ఎల్లప్పుడూ అందమైన వాటికి దగ్గరగా ఉన్నానని నేను గ్రహించాను. అదే విధంగా, నేను నీ మాటల నుండి వెనక్కి తగ్గినప్పటికీ నీ ప్రేమలోనే తేలియాడుతూ నీ భావాలకు చేరువగానే ఉన్నా అని తెలుసుకున్నాను..

I dreamt like I was flying away from Earth, but then I realized I'm still part of this amazing universe, always close to something beautiful. like, when I stepped back from your words, I am still swimming in your love and closer to the wonderful emotions you brought. So, I'm always close to you...

मैंने सपने में देखा मानो मैं धरती से दूर उड़ रहा हूँ, पर तब मुझे एहसास हुआ कि मैं इस अद्भुत ब्रह्मांड का हिस्सा हूँ, हमेशा किसी खूबसूरत चीज़ के करीब हूँ। जैसे, जब मैं आपके वाक्यों से पीछे हटा, मैं अभी भी आपके प्यार में तैर रहा था और आपके द्वारा लाए गए अद्भुत भावों के करीब था। तो, मैं हमेशा आपके करीब हूं...

💞

అందపు వెలుగుల సుగందాన్ని ఆపగలిగేది ఎవరు



నీలి ఆకాశానికి నీడను ఇవ్వగలిగే గొడుగుతో మట్టుకే నీ అందుపు వేడి ఎవ్వరికీ తాకకుండా ఆపగలము కానీ ఆ గొడుగును చేసేదెవరు నీ అందపు వెలుగుల సుగందాన్ని ఆపగలిగేది ఎవరు..

An umbrella capable of shading the blue sky is the only thing that can shield others from being captivated by your beauty. But who possesses the power to make such an umbrella and contain the enchanting allure you exude?

💜💜💜

నీ అందాన్ని రాస్తూ ఉంటే


నీ అందాన్ని రాస్తూ ఉంటే అక్షరాలు గీతలుగా మారేనా, ఆ గీతలన్ని వంగిపోతు నీ రూపాన్ని దిద్దుకుంటూ సాగేనా,
ఆకాశపు తోటలన్ని తిరిగి తిరిగి గాలి రంగులన్ని తెచ్చేనా, ఆ నింగి అద్భుతాలకు ప్రతిరూపంగా నువ్వు కానీ నీ అందంలో ఉన్నవి వాటిలో లేదు..

As I began to describe your beauty, the words transformed into intricate lines, each taking on a graceful shape. The wind itself carried colors from distant galaxies. You are a genuine reflection of nature, enriched with qualities it yearns for...

💜💜💜

మాటే అద్భుతం




కదిలిపోయే మేఘం ఆగి ఈ గడ్డిపోచను పలకరించడం అద్భుతం అనుకుంటే మరి ప్రేమ కురిపిస్తే ఏమనాలి?

It's a miracle that a running cloud stops and greets this grass leaf. What is it called if it showers love?

💜💜💜

కొంతసేపు ఆ మహాద్భుతాన్ని ఆస్వాదిస్తా

తేనె కొలనులో పడితే తియ్యటి అనుభూతి కలిగినా ఈదగలరా ఎవరైనా? సఖీ నీ చిక్కటి ప్రేమలోనూ ఎనలేని తియ్యదనం ఉంది కానీ ఈదడం మాని మునగడం నేర్చుకుంటున్నాను, తెలిసి కూడా ఈది తల్లడిల్లేకంటే మునిగిపోయి ప్రాణం ఉన్న కొంతసేపు ఆ మహాద్భుతాన్ని ఆస్వాదిస్తాను..

Can anyone swim in a pool of honey, even if it feels sweet? My dear, your love is thick with infinite sweetness. So I've stopped swimming and am learning to sink. Knowing that I will sink, I choose to embrace the greatness for a while instead of struggling..


💜💜

భూలోకపు వెన్నల

ఎన్నో అద్భుతాలకు నెలవు, లెక్కించలేనన్ని తారలు, ఎన్ని లేవు తన దగ్గర అయినా సందేహంతో అడిగాను చీకటి ఆకాశాన్ని, తను రెప్ప వాల్చినపుడు కలగంటుందా అని,
అవునని అంటోంది నిన్ను చూసి కలకంటుందని, నువ్వే తన భూలోకపు వెన్నలని....

Home to wonders and infinite galaxies, I harbored doubts as I questioned the night sky: Could it dream after closing its eyes? In response, it revealed that it dreams by looking at you and you are its earthly moon...

💜💜

ఎందుకో

ఇది వరకు చూడని అద్భుతాలు ఎన్నో ఉన్నా, 
నీ కలలో తొంగి చూడాలని కలిగే కోరికెందుకో,
లెక్కించినా తక్కువే తారలు,
కానీ నీ ఆలోచనలు ఎన్నో వాటిని లెక్కించలేనెందుకో...

Though many miracles remain unseen,
I long to see them in your dreams, serene.
Stars may be counted, or so it seems,
But your thoughts are beyond what numbers deem...

💜💜

తడి హృదయం

ఈ సాయంత్రపు వర్షంలో తడవకపోయినా నీ ఆలోచనలతో తడి చేరిన హృదయం మట్టి వాసన కంటే, కమ్మే పొగ మంచు కంటే, మెరిసే చినుకుల కంటే అద్భుతమేగా...

The wonder of this rainy evening is not in the smell of the soil, nor the fog, nor the shiny raindrops. It lies in my heart, which remains moist despite never having been soaked by nature's art, but has been touched by your little thought.

💜💜

ఎగిరే చేప

ఇప్పటివరకు నీటిలోని ఆకాశ ప్రతిబింబంలో ఈదుతున్న చేపకు రెక్కలొచ్చి ఆకాశానికే ఎగరగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో, నీ
పేరు వరకే ఉన్న పరిచయం, చనువుగా మారింది ప్రేమగా ఎదిగింది మరి ఇదీ అంతే అద్భుతం కాదా..


How wonderful it would be if a fish that was swimming in the reflection of the sky in the water could take wings and fly to the sky itself.
The relationship that I have only with your name turned into love and this is as wonderful as that flying fish..


यह कितना अद्भुत होगा यदि एक मछली जो पानी में आकाश के प्रतिबिम्ब में तैर रही थी पंख ले सकती है और स्वयं आकाश में उड़ सकती है।
तेरे नाम से जो रिश्ता है वो प्यार में बदल गया और ये भी उस उड़ती मछली की तरह खुबसुरत है..

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...