Showing posts with label సహనం. Show all posts
Showing posts with label సహనం. Show all posts

అమావాస్య లేని ఇందులేఖవు

రెప్పలను తడపకుండా వెనక్కి వెళ్ళే కన్నీటి బొట్ల పేరేంటో తెలుసా, మనోధైర్యం..
నోటి తలుపులు తట్టకుండా వెనక్కి వెళ్లిన ఆ కేకల అర్థం ఏంటో తెలుసా, సహనం..
ఎంత గుచ్చినా గాయం ఆర్పుకునే నీ హృదయం పేరేంటో తెలుసా, ప్రేమ..
సాగిపో ముందుకు, నువ్వు అమావాస్య లేని ఇందులేఖవు..

Do you know the name of tears that flow back without touching your eyelids? Courage.
Do you know the meaning of those cries that retreat without knocking the door of the mouth? Patience.
Do you know the name of your heart that heals the wounds no matter how deep they pierce? Love.
Go ahead, you're a moon that never shrinks..

💜💜

పూలు పారిపొవు నదులు వలసపోవు

మండుతున్న ఎండలకు భయపడి పూలు పారిపోవు,
గడ్డకట్టే చలికి ఉండలేక నదులు వలసపోవు, సహనంతో వేచి ఉంటాయి ఎందుకంటే
వాటికి తెలుసు మారే వాతావరణం కొత్త మెరుపులు తీసుకొస్తుందని,
ఓ సఖి నేను అదే సహనంతో వేచి ఉన్నాను,
ఎందుకంటే మన ప్రేమ గొప్పది,
ప్రతి అడ్డంకిని దాటి మళ్ళీ చిగురిస్తుంది...

Amidst the scorching sun, flowers don't run away,
And freezing winters won't make rivers migrate,
They wait and endure, for they know,
That the changing climate will bring a new glow.
So, my love, I too shall wait,
For our bond, I know, is true and great,
Our love shall survive, through every test,
And in the end, we'll thrive, at our best..

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...