Showing posts with label మోసం. Show all posts
Showing posts with label మోసం. Show all posts

చూసుకుంటా దాచుకుంటూ



చేతులు అందవని ఊరుకున్నా లేకుంటే మబ్బులన్నీ తోసేసి నిన్ను చూసుకుంటా, అక్షరాలకు మోసం చేయలేక ఊరుకున్నా లేకుంటే అన్నింటినీ తీసేసి నీ పేరులోని అక్షరాలనే దాచుకుంటూ..

💞

I am not able to reach; otherwise, I would wipe away all the clouds to see you. I am not able to cheat the letters; otherwise, I would remove all the letters except the ones forming your name..

హరివిల్లుల ప్రపంచానికి రాణివి


చెలి! మోసపోకు! నిన్ను మనిషిగా చూస్తారు, నిజానికి నువ్వు హరివిల్లుల ప్రపంచానికి రాణివి...

Don't fool yourself, as others see you as a human being, but you are indeed a queen in the world of rainbows...

💞

ఆకాశానికి గండి పెట్టి


చీకటిని మోసగించి వేకువను తెప్పించి నిన్ను మేలుకొలిపి మాట్లాడాలనే తపనతో నీపై ఉన్న రాతిరి ఆకాశానికి గండి పెట్టి కాస్త వెలుగు తెప్పించాను...

I tried to create a hole in the part of the night sky which is covering you, allowing some light to pass through, in an attempt to trick the nature into waking you up so we could talk...

💜💜💜


కదా నీపై మనసయ్యంది కదా

దివి దించిన కర్పూరమా,
దివ్వెలకు రారాణి నీ రూపమా,
మది పెంచిన మందారమా,
కంపించే భావాలకు ఆరాద్యమా,
లేత గాలి లేడీ పరుగు తీస్తుంటే ,
నాలో వేటగాడు బానమేస్తున్నాడే,
ఏడు జన్మలు నీతోటే అని తెలిసుంటే నాకు,
ప్రతి సారి ఇది మొదటి జన్మే అని విధిరాతను మోసం చేస్తుంటానే,
ముద్దాయిగా నన్ను నిలబడమంటే, 
నీ అడుగుల సాక్ష్యం మట్టుకే తీసుకుంటాను,
వాటికి ఏ అభ్యంతరం లేకుంటే,
మరిన్ని చిలిపి నేరాలు నీతో చేస్తూ పోతాను,
కదా నీపై మనసయ్యంది కదా,
కదా నాలో మెరుపొచ్చింది కదా,
అలా నిను చూస్తుంటే అలా,
కలా ఇది నిజమా కలా...

💜💜

మోసం

తననే అందంగా మలిచానని దేవుడు ఇచ్చిన మాటకు పొంగిపోయేలోపే నిన్ను చూసి మోసమని తెలుసుకుంది ఆ జాబిలమ్మ ...

As the moon basked in the glow of God's promise that it was the most beautiful creation, her radiance paled in comparison to the sight of you, and she came to the heartbreaking realization that the promise was untrue.

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...