లేదు

లేని ఆకాశంలో తార కనిపించదు,
లేని తోటలో పువ్వు ఉండదు,
లేని మనసులో ప్రేమ పొంగదు...

ఎవరా తోడు

ఎవ్వరికి చేరువౌతున్నా చెదిరిపోతోంది మనసు,
కానీ ఒంటరితనానికి అదంటే అలుసు,
అటా ఇటా తెలియక సతమతమౌతుంటే,
అద్దంలో ఒకతోడుందని అది నన్ను వదిలిపోదని తెలుసుకున్నా...

అమ్మ

కోటి దివ్యశక్తుల ఫలమైనా అది తనలో బస చేయకుంటే ప్రాణంగా మారదు,
నువ్వెంత వేగంతో దూసుకెళ్లిన నవమాసాలని తగ్గించలేవు,
వేగతరం ఈ ప్రపంచం కానీ నీ పుట్టుక నా పుట్టుక ఒక్కటే,
సందేహం లేని ప్రశ్న అంటూ ఉంటే అది ఎవరు జన్మనివ్వగలరు అన్నదే,
బరువు అనుకోదు బాధ్యత అనుకోదు ప్రాణం అనుకుంటుంది భారం మొస్తుంది,
జాతక చక్రాలు ఏమి చెప్పినా బిడ్డ వల్ల తన ఆయువే పోయినా,
చావుకు ఎదురెళ్లే ప్రతి తల్లికి అమ్మకు వందనం అభివందనం..

వెన్నెలొచ్చింది

చల్లగాలికని వచ్చి,
చిన్న కవితను రాసుకున్నాను,
అడిగి తీసుకెళ్లింది,
కానీ ఆ పిల్ల ఏమైంది?
వెతికేలోపే వెన్నెలొచ్చింది,
వెన్నెల కాదు తనేనని తాకి వెళ్ళింది..

వాడినా సరే విడిపోయి నిన్ను వెతుకుతున్నాయి

పూలపై నీ బొమ్మ గీస్తుంటే, కొమ్మనుంచి రాలిపోతున్నాయి, వాటికంటే కొమలత్వమా అని ఆశ్చర్యపోయి, వాడిపోయినా సరే కొమ్మను విడిపోయి నిన్ను వెతుకుతున్నా...