Showing posts with label జ్ఞాపకం. Show all posts
Showing posts with label జ్ఞాపకం. Show all posts

కలగా ఉండిపో


ఒకటి మేలుకోలేని నిదురలో కలగా ఉండిపో లేదా మెలకువలో నా జ్ఞాపకాలని తుడిచిపో.....

Either remain a dream in eternal sleep or erase all my memories in wakefulness...

💜

ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది


అందరూ మళ్ళీ వెళ్లి మట్టిలోనే కలిసినట్టు, నా మనసుకు ఊపిరి ఆగినప్పుడల్లా నీ జ్ఞాపకాలలో కలిసిపోతూ ఉంటుంది, అందులోనే మళ్ళీ జన్మ పోసుకొని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది...

Like all souls return to dust, my heart, when it ceases to beat, dissolves into memories of you. There, I am reborn, hopeful and waiting...

🩵

నీ జ్ఞాపకం శిధిలమైనా పదిలం


నువ్వు లేని హృదయంలో మంచుకొండ వెలసేనా ఆ మంచుకొండ లోతుల్లో నీ జ్ఞాపకం శిధిలమైనా పదిలంగా ఉండేనా...

The iceberg emerges in the heart without you; thus, though buried, the memories remain forever under it..

💞

పువ్వు నీడ


పువ్వు నీడ ఎవరికి సరిపోతుంది కానీ దాని పరిమళం జీవితాంతం గుర్తుండిపోతుంది, ఎక్కడో ఉండి వినిపించే నీ మాట నీడ నా మనసుకు సరిపోదు కానీ అందులోని ప్రేమ జీవితాంతం నాతోటే ఉండిపోతుంది...

The mere shadow of a flower may not suffice for someone, yet its fragrance lingers in their memory for a lifetime. Similarly, the distant echo of your words falls short for my emotions, but the enduring love within them remains eternally with me...

💞

నీ ప్రేమకై నా కృతజ్ఞతలు




జీవితంలోని క్షణాన్ని కచ్చితంగా చిత్రించడానికి దానిని ఆపక్కరలేదు, ప్రియతమా నువ్వు నా కోసం ఆగనక్కరలేదు, ప్రేమించనక్కరలేదు, మాయం అయిపోవచ్చు, వెలుగు వేగంతో కదులుతూ దూరం కావచ్చు, అయినా సరే నీ ప్రేమను పదిలపరచగలను, గుండెలపై చిత్రించగలను, నా ప్రేమ నా కనుపాపలో ఉంది అందులో ఎన్నో జ్ఞాపకాలు దాగున్నాయి, నా ప్రేమికవై ఉన్నందుకు నా కృతజ్ఞతలు...

The perfect snap of life is when you don't ask it to stop for capturing perfect frame, my dear you no need to stop for me, don't care for me, don't love me, keep moving keep moving, slow or steady or faster or with light speed or just vanish, I can still capture your love and preserve it in my heart, love is in my lens and it captured your memories forever, thanks for being my love.

💜🫶💜

తన గాలి లేని హృదయం




తన గాలి లేని హృదయాన్ని కుట్టి ఏమి చేసుకుంటావు,
తన జ్ఞాపకంగా ఉండిపోనివ్వు...

What will you achieve by stitching your heart, devoid of the air she once filled it with? Let it remain as a memory of her...

💔

జ్ఞాపకంగా ఉండాలి

జ్ఞాపకాలలో కాదు,
జ్ఞాపకంగా ఉండాలి...

Not in the memories,
Be the memory..

💜

మిగిలిపోయేది కాదు నా జ్ఞాపకం

మిగిలిపోయేది కాదు నా జ్ఞాపకం,
మిగిలిన జీవితాన్ని నడిపించేది,
కలిగితే కలతనిచ్చేది కాదు నా జ్ఞాపకం,
కలిగే కొద్ది కనులముందు నిన్ను నిలిపేది....

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...