Showing posts with label గొప్ప మనుషులు. Show all posts
Showing posts with label గొప్ప మనుషులు. Show all posts

మీకు అంటిన మసి మాకు ఎందుకు

బాధ్యతగల ఒకరి కష్టం వింటుంటే ఇలా తోచింది.

పాతరకి ఉన్న మసి కంటే అందులోని వంటకమే అందరికి ఇష్టం, 
ఆ మసే అంటకుంటే వంటకు రుచి పచి ఉండదు, 
మీరు మసిబారి ఎన్నో వంటలు చేస్తున్నారు, 
వంట రుచి చూస్తాము అంతే కాని మీకు అంటిన మసి మాకు ఎందుకు....

తనని తాను మరిచి అటు సమాజాన్ని ఇటు ఇంటిని  మోసే ప్రతి స్త్రీకి ఇది అంకితం 🙏

అమ్మ

ఉన్న ఒక్క పండు వాడిపోతే కొమ్మకెంత కష్టం,
ఆ కొమ్మ ఒక్కటే చెట్టున ఉంటే పిల్ల గాలి కూడా పెను భారం,
కానీ వాలిపోదు తూలిపోదు ప్రాణమంతా పొగుచేసి,
 తానే ఒక వృక్షమై,
నీడనిస్తూ ప్రాణమిస్తూ ఉండిపోతుంది,
ఆ కొమ్మ లోని అమ్మకు 🙏

మనసు కథ మనసులోలోనే కదా

ఎంత బరువు పెట్టినా పెట్టినట్టు ఉండదు..
ఎంత తట్టుకున్నా బరువు మోసినట్టు ఉండదు..
మనసు కథ మనసులోలోనే కదా..

చిల్ డ్యూడ్

చిల్ డ్యూడ్,
నీతో నేనున్నా,
కూల్ డ్యూడ్,
నీతో నేనొస్తా,
కలిసే ఎగురుదాం,
కలిసే పరుగెడతాం,
నీ గమ్యం నా గమ్యం వేరైనా,
ఒకరికి ఒకరై సాగుదాం,
ఇదే మన లోకం,
మనది మరో ప్రపంచం..

మనసును వాడేసుకోకు,
వయసును పారేసుకోకు,
వాచ్ చేస్తుందిలే టైంపాస్ నీకోసం,
ను పాస్ చేయకు ప్రతి అవకాశం,
బ్రోకెన్ హార్ట్ ని ఫిక్స్ చేస్కో,
బ్రోకెన్ వీట్ తో లంచ్ చేస్కో,
హెల్త్ అండ్ వెల్త్ నీదేలే,
నలుగురికి ను ఉండాల్లే..

ఓడిపోతే వోడ్కా,
బోల్తాకొడితే కొడితే బీరు,
దిగులుకు ఎందుకు మందు,
చుట్టే భూమిని చూడాలంటే,
గో ఔట్ అండ్ సీ ద వరల్డ్,
మత్తులో తూలి లేవాలంటే,
అచీవ్ వాట్ యు వాంట్,
కిక్కు ఉంది జిందగిలో,
నీ గెలుపును నువ్వు మిక్స్ చెసుకో..

గొప్పతనం

మురళిని పలికించే వాడికన్నా దానిని చేసినవాడి నేర్పే గొప్పది,
వెదురులో మౌనం కాదు రాగముందని తెలుసుకున్న వాడి మనసే మధురమైనది..

తోపుడు బండి










తోపుడు బండి తోపుడు బండి

నాలుగు కాళ్ళు తిరిగే బండి

ఆనాడు ఇది రధమండి

ఇప్పుడేమో జీవనమండి

బరువు ఎంతైనా మోయునండి

కొనేవారికి వస్తువులండి

పేదవానికి కిరాయిబండి

బండికి కష్టం ఏమి లేదండి

గాలి చాలు మరి పరిగెత్తునండి.....




ఒడిసి పట్టు విజయాన్ని












చిరు గాలి మళ్ళింది విజయ తీరాల వైపు

సుడిగాలిలా మారి తన ప్రయత్నాల వైపు

ఆ పయనం ఎప్పటికి అంతులేనిది

ఇంకే ఆలోచనకు తావులేనిది

కష్టమైనా కఠినంగా వ్యవహరిస్తోంది

ఐనా తను ఉన్నానంటూ నమ్మకాన్ని వదిలి వెళ్ళింది

నాలోమాటగా దానికి ప్రోత్సాహం అందిస్తూన్నా

తను చెప్పుకున్న మాటకోసం లక్ష్యాన్ని చేదించేవరకు ..




అలసట తెలియని మహా యోధులు..























జుట్టు తెల్లబారినా తెలియదు


ఒళ్ళు నల్లబారినా తెలియదు 


కష్ట మొక్కటే తెలుసు కార్మికులకు


 


ఎన్ని భవనాలు కట్టినా 


మన కలలను వారు నిజాము చేసినా


పేదవారే కాని ధనవంతులు కారు 





మన నాలుకకు రుచులు వారిచ్చినవే


మన మానానికి బట్టలు వారిచ్చినవే


అయినా రుచుల సౌకర్యాలు తెలియని వారు





మన రాచమార్గము వారి అడుగుల పుణ్యమే


పాదరక్షలు వారి చేతుల చలవే


అయినా ముళ్ళభాటపైనే  వారి అడుగులు 





వేకువతో మొదలౌతారు 


చీకటితో నిదురిస్తారు


అలసట తెలియని మహా యోధులు


వారినే నమ్ముకుంటూ హాయిగా జీవిస్తారు 


రైతన్న















అన్న రా మాయన్న ఆకలి తీర్చేటన్న...


మట్టిలో ఆడుకుంటూ సాగులు చేసేటన్న ...


ఎండిన ముత్యాలను పంటలుగా మార్చేటన్న..


కాలమేధైనా కష్టాన్ని నమ్మేటన్న ..


అందరిలో పెదన్న..


ఆ అన్నే మా రైతన్న...


మా మనసులలో వెలుగన్న...



నన్నే అడుగులు వేయించావు











అందని ఆకాశం నీవు

అందాల ఓ పావురం

నేలపై రాలిన ఎండుటాకులా

చేసాను ఓ సాహసం



రెక్కలు లేవు పక్షిని కాను

గాలికి తోడై వస్తున్నా

ఎంత సేపని గాలిలో ఉండను

చావని ఆశల బరువుతో ఉన్నా



నీతో స్నేహం కల అనుకున్నానే

నాకై చినుకై దిగివోచ్చావే

సీత కొకలా నటిస్తున్నా

నన్ను చిలుకలా మర్చేస్తున్నావే



నాపై అందరి అడుగులు పడకుండా

నన్నే అడుగులు వేయించావు

నీకిది తెలియదేమో

ఈ ఎండుటాకునే పైపైకి చేసి

ఒక నక్షత్రంల మర్చేస్తునావు

నీకెలా రుణపడి ఉండను

అ రుణాలకే అతీతంగా ఓ బందానిచ్చావే...


స్నేహానికి ఆలయం..





చూడని ఒక లోకం..

స్నేహానికి ఆలయం..

ఒక మనసులో అది పదిలం...

అది నీదే నీదే నా నేస్తం..



చేరువున్న చందమామలా ఒక్కటే నా కనులలో...

దూరమైన తారకవైనా నీపై ఆలోచనలు ఎన్నో నాలో...

నిదురే లేని చీకటై నన్ను హాయిగా లాలిస్తావే..

ఇంతకు ఆ హాయిని చూడలేదు కాని పిల్ల గాలుల మహిమలు తెలుసు...

ఎంతకు నిను మరువనని తెలుసు నన్ను నేను మరచిపోతు...

పేద





పువ్వు కూడా ఇష్టపడదు పరిమలించడానికి పేదవాడి చేయి తగలనిదే...

బియ్యపు గింజ కూడా ఆకలి తీర్చదు పేదవాని సాయం లేనిదే...

కట్టిన గూడు కూడా నిలిచి ఉండదు పేదవాడు ఇటుక కాల్చనిదే..

ఈ ప్రపంచమే కదలదు పేదవాడు బండి నడపనిదే..

మన దేశము పేధధైతే కీర్తి క్యాతులు మనదేగా...

గొప్పదౌతు పేదరికాన్ని మరిచిపోతోంది కష్టాన్ని మరిచిపోతోంది...

సరిచేసుకోవాలి అనుక్షణం.





శిధిలమైన మనసులో శికరమంటే ఆశలు,

కొంచమైన కోరికలతో మితిమీరె ఆలోచనలు,

బ్రతుక నేర్చుటకు వేసే అడుగులలో ఎన్నో తప్పటడుగులు,

ప్రేమను చేరే ఆలోచనతో కుంగిపొయే పెంచిన మమకారాలు,

ఎంత జేరిగిన ఆగకూడదు ఈ జీవితం,

తప్పు చేసిన సరిచేసుకోవాలి అనుక్షణం......



గొప్ప మనుషులు

తెలియదు వారికి కళలున్నవారని ....
తెలియదు వారికి నిజమైన వారని ....
తెలియదు వారికి మనసున్న వారని ....
తెలియదు వారికి వారు మంచి స్నేహితులని ....
తెలియదు వారికి అన్ని తెలిసినవారని ...
తెలియదు వారికి వారు గొప్ప మనుషులని..

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...