జో జో జో జో



జోకొట్టే జోరీగ రాగాలు నావి..

జో జో జో జో జో ..

కిట్టయ్య వేణువు రాగాలు నావి ..

జో జో జో జో జో...

పాపాయి పల్లకి ఊయలలో ..

పండిన వెన్నల నవ్వులలో..

నిండిన ఎదలో పొంగిన ప్రేమ...

చెప్పే తియ్యటి కబురే నాది...



ప్రేమ పంచె పాపాయికి

ఈ లాలి పాట ఒక ఈడగునా..

స్నేహం పెంచే ఈ చిట్టికి

నా మనసు మాట అంత హాయిచునా.

నాలో ఏదో ఉప్పొంగుతునా ..

భావాల వెల్లువ ఈ లాలి..

నాకై దాచిన ఈ ప్రాణంతో ..

చేసిన పాటనే ఈ లాలి..

ఈ లాలి నిదురోవాలి..

ఈ రేయి హాయినివ్వాలి..

నా స్నేహం నీతోటే..

కలకాలం నిజమవాలి..



జోకొట్టే జోరీగ రాగాలు నావి..

జో జో జో జో జో ..

కిట్టయ్య వేణువు రాగాలు నావి ..

జో జో జో జో జో...           

No comments:

కలల ఆహారం

కలలను ఆహారంగా తీసుకుంటున్నా, నిదురను ఆరగిస్తున్నా, కానీ నీ తీపి రూపం కానరాకుండా, ఈ విందు ఎలా పూర్తి అవుతుంది... I am having dreams as food, ...