అవుతున్నా నేనే ఓ చకోరం.























అ చిత్రాన్ని బహుకరించిన సుభ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ... :) 






దాహం తీర్చే మేఘం... 

తనువును పులకరింప జేసె మేఘం.... 

మట్టిలోని ప్రాణాన్ని చిగురింపజేసే మేఘం....

జల్లులుగా మారి చిగురాకులపై ఊయలలూగే మేఘం.

 అలలలో కలగా కలిసిపొయే మేఘం..

 రతనాల తోటలో ముత్యమై మెరిసే మేఘం... 

అర విరిసిన కుసుమాలపై ముద్దులు కురిపించే మేఘం... 

అలాంటి ఆ మేఘం కోసం అవుతున్నా నేనే ఓ చకోరం... 


5 comments:

సుభ/subha said...

కల్యాణ్ గారు ప్రత్యేకంగానా? .. మీరు అడగడమే నాకు ఎంతో సంతోషం. నేను వేయకుండా ఉంటానా చెప్పండి.. నాకు మీ బ్లాగులో కూడా అవకాశం ఇచ్చినందుకు మీకే నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మొత్తానికి చాలా బాగా ముస్తాబు చేసారు కవితని.

రసజ్ఞ said...

సుభగారి చిత్రం దానికి తగ్గ చక్కని వర్ణన బాగా కుదిరాయి! రెండూ పోటా పోటీగా ఉన్నాయి! చిత్రాన్ని చూసి కవిత రాసారా లేక కవితని బట్టి చిత్రం వేసారా?

Kalyan said...

@రసజ్ఞ గారు మొదట మాట వచ్చింది తరువాత సుభ గారు మెరుపు వేగంతో గీసిచ్చేసారు దానికి తగ్గటుగా చెప్పాలంటే కొన్ని వాక్యలు కూడా జోడించారు ..
అన్ని విధాలుగా తన నైపుణ్యం అందులో అంతర్గతంగా దాగుంది అన్నమాట ..

జ్యోతిర్మయి said...

చిత్రం, కవిత రెండూ కూడా చాలా చక్కగా కుదిరాయి.

Kalyan said...

@జ్యోతిర్మయి gaaru dhanyavadhaalu :)

మూర్ఖత్వం

అగ్నిపర్వతాన్ని ఆర్పాలని అనుకోవడం, నీపై నా ప్రేమను అడ్డుకోవడం, రెండూ మూర్ఖపు ఆలోచనలు... The idea of extinguishing a volcano and stopping my ...