Showing posts with label మనస్సు. Show all posts
Showing posts with label మనస్సు. Show all posts

నత్త నడక


నత్త తన శ్లేష్మం సహాయంతో పదునైన కత్తిపై గాయపడకుండా కదలినట్లు, నేను నా ప్రేమ సాయంతో నీ పదునైన మనస్సుపై నడవగలను గాయపడకుండ..

Like the snail can move on a sharp razor with help of it's mucus, I can walk on your heart without getting hurt as I am protected with the layer of love...

💞

ఎడారి ఓడ


ఎడారిలో ఓడను కట్టి దూరాలకు చేరుకోలేవు, పిచ్చి మనసా తనపై ప్రేమను చూపి ఏమీ సాధించలేవు...

You can't travel by building a ship in the desert; you can't achieve anything by merely expressing love to her...

💞

కన్నీరు ఉండచ్చు కానీ భయం కాదు

నా కన్నీటితో నిండిన సరస్సు పుట్టుకొని రావచ్చేమో కానీ భయంతో నిండినది కాదు, ఎందుకంటే నీ ప్రేమలో మనసు గాయపడచ్చు ఆ బాధ ఎలా ఉంటుందంటే, తోటను చేరకుండా ఆపే కంచె లాగా ఉంటుంది కానీ రాయి కింద పడి నలగినట్టు కాదు, కంచె వెనకాల ఏముందో కనిపించే దాకా విశ్రమించను దాటే ప్రయత్నం చేస్తూనే ఉంటాను, కానీ కనిపించకుండా మొత్తం మూసేస్తే దానిపై విశ్రమిస్తానే కానీ వదిలి పోను...

In the realm of my love for you, tears fill the lake, not fears. Though love can bring pain, it resembles a fence that prevents me from entering the garden, rather than someone crushing me under a stone. I'll persist in crossing the fence as long as it lets me catch glimpses beyond. If not, I'll rest upon it, refusing to depart..

💜💜💜

గాలి తీరాన్ని చేరుకునట్టే

కష్టమైనవి కొన్ని అసాధ్యమైనవి కొన్ని, నీ మనసు తెలుసుకోవడం కూడా దాదాపు గాలి తీరాన్ని చేరుకునట్టే...

Few things are difficult, and few things are impossible. Knowing your heart is like almost reaching the shore of the wind...

💜💜

కదా నీపై మనసయ్యంది కదా

దివి దించిన కర్పూరమా,
దివ్వెలకు రారాణి నీ రూపమా,
మది పెంచిన మందారమా,
కంపించే భావాలకు ఆరాద్యమా,
లేత గాలి లేడీ పరుగు తీస్తుంటే ,
నాలో వేటగాడు బానమేస్తున్నాడే,
ఏడు జన్మలు నీతోటే అని తెలిసుంటే నాకు,
ప్రతి సారి ఇది మొదటి జన్మే అని విధిరాతను మోసం చేస్తుంటానే,
ముద్దాయిగా నన్ను నిలబడమంటే, 
నీ అడుగుల సాక్ష్యం మట్టుకే తీసుకుంటాను,
వాటికి ఏ అభ్యంతరం లేకుంటే,
మరిన్ని చిలిపి నేరాలు నీతో చేస్తూ పోతాను,
కదా నీపై మనసయ్యంది కదా,
కదా నాలో మెరుపొచ్చింది కదా,
అలా నిను చూస్తుంటే అలా,
కలా ఇది నిజమా కలా...

💜💜

ఇక్కడి దానవు కావు

ఓ దేవీ, పూల మబ్బుల తాకిడికి మెరిసే మల్లెల మెరుపుల ఆకాశమే నీ మేని సొగసు, నిన్ను చూసాక అనిపిస్తోంది, నువ్వు ఇక్కడి దానవు కావు, నదులు పారే నక్షత్రమా నీ ఊరు?
జాబిలినే చెలికత్తెగా తిరుగాడే రాజ్యమా నీ ఇల్లు?
ఎన్ని విశ్వాలు దాటితే నీవంటి అందం కనిపిస్తుందో తెలియదే, ఈ లోకంలో వచ్చి చేరావు నా మనసులో వెలుగు నింపావు...

O goddess, your beauty is like the sky, where the thunders of jasmine flash when the flowery clouds clash. When I see you, it seems like you don't belong here. Is your city a star where rivers flow? Is your home, the kingdom where the moon works as a maid? I don't know how many universes one has to cross to see a beauty like yours, but you came to this world and filled my heart with light...

💜💜

నా మది సంగతేంటో చెప్పేదేముంది?

నా ప్రేమలోని ఒక చిన్న ముక్కను కాల్చి చూసాను,
ఆ పొగ కమ్మిన చోటంతా ప్రేమ అల్లుకుంది, 
పూడ్చి చూసాను, ప్రతి ఇసుక రేణువులోనూ ప్రేమ కలిగింది, నింగిలోకి విసిరాను, వెన్నెలలో తారలలో వేకువలో చీకటిలో ప్రేమ పొంగింది, ఒక చిన్న ముక్క ఈ లోకాన్నే మార్చేస్తే, మిగతా ప్రేమ నాలోనే ఉంది, మరి నా మది సంగతేంటో చెప్పేదేముంది?

I burnt a little piece of my love, Wherever smoke touched, love entwined, I buried it, and every grain of sand fell in love, I threw it into the sky, love sparked in the moon in the stars in the dawn in the dark, if a small piece changes the world, the rest of the love is still in me, and I don't think I should explain how i feel?

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...