కరోన కలకలం

గుండెను అరచేతిలో పెట్టుకొని బ్రతకడం కాదు అరచేతిని మూతి మీద పెట్టకుండా ఉంటే చాలు నీ గుండె పదిలం...

మొహమాటం

మొహమాటానికి మోహమాటాలు తొలి అడుగులు వేసే స్నేహం లో సహజం,
మొహమాటం అంటూనే మాట ఆగకుంటే అది ముదిరిపోయే స్నేహానికి సంకేతం,
నిర్మొహమాటంగా చెలరేగిపోతే అది మోక్షం పొందిన స్నేహానికి దర్పణం...

ప్రేమకంటే గొప్పది

నువ్వు లేకున్నా దిగులు పడదు,
నీకోసమే ఉండిపోదు,
నువెవరో దానికి తెలియదు,
నీ కులం దానికి అర్థం కాదు,
శ్వాసానిచ్చే గాలికి ప్రాణం ఇవ్వడం తప్ప ప్రేమించడం రాదు,
నువ్వుగా వదిలితే తప్ప అది నిన్ను వదలదు,
ప్రేమకు అతీతం ప్రాణ దానం,
ప్రేమకు అతీతం ఆ స్నేహా భావం...

ఆరాటం పోరాటం

ప్రేమలో ఆరాటం ఉండాలి కానీ పోరాటం కాదు....
ప్రేమకోసం పోరాడాలి కానీ ప్రేమతో కాదు....

నిదురకు నిచ్చెన వెయ్యి

కలతకు తగిన సమయం కాదిది...
పెదవి విరుపులు మానుకొని...
రెప్పల కిటకిటలు ఆపుకొని...
కనులకు కలల సాయం చెయ్యి...
నిదురకు నిచ్చెన వెయ్యి...

రుణం

జీవం మట్టుకే దేవుడు ఇస్తాడు ప్రాణం తల్లి పోయాల్సిందే....శ్రామికుల సేవకుల గర్భం లో మేము ఉన్నాము తలదాచుకొని....వారికి బిడ్డలం మేము ఋణపడి ఉంటాము... 🙏

బంగారు వజ్రం

దేని విలువ దానిదే అయినా,
వజ్రంపై బంగారు పూత పూసి,
దాని విలువ పెంచాము అనుకునే రోజులు,
దీనికి మెచ్చుకోవాలా లేక దిగులుపడాలా?,
చేయగలిగినా చేతులు కట్టేసిన ఆడవారి దుస్థితి,
నేర్పు ఉన్నా నేర్చుకోలేని అభాగ్యుల మనోగతి...

అందమైన అద్భుతం

నీ మనసు తగిలి ఆ మెరుపు, 
నీ నవ్వు తగిలి నాకు ఆ వెలుగు, 
నీపై ప్రేమ కలిగి నాలో మైమరపు.... 
నా జీవితంలోని అందమైన అద్భుతానికి శుభోదయం

స్నేహం ప్రేమ

నీకు అర్థం కానిది నాకు అర్థమైందేమో,
అందుకే నీకు తన ప్రేమ దొరకలేదు కానీ నాకు తన స్నేహం దొరికింది....

మరో ప్రాణంకై తపించేవాడే మనిషి

భయం ఉంది నేను సామాన్యుడినే,
జాగ్రత్తలు ఎక్కువయ్యాయి నేను పిరికివాడినే,
అమ్మమ్మలు తాతలు చెప్పడానికి ఎవ్వరు లేరు,
కానీ నాకోసం నేను చేసుకుంటున్నాను,
నేను సమర్థుడినే,
పోయేదేముంది ఓపిక లేదు అని అనే రోజులు,
పోయేది ప్రాణం అని తెలిస్తే ఎక్కడ లేని ఓపిక ఇప్పుడు,
డబ్బు ఉంది కాని హంగులు లేవు,
ఒక సబ్బు బిళ్ళ నా వెన్నుతడుతోంది,
అంటరానితనము ఉంది కానీ కులాలను చూడటం లేదు,
దాణం చేసేవాడే దేవుడు,
వైద్యం రాని వైద్యులు ఇక లేరు,
నిజమైన వైద్యులు ప్రాణాలు ఇస్తున్నారు,
చేదు పసుపు అమృతం,
పుల్లని నిమ్మకాయ వజ్ర కవచం,
కూరగాయలే రక్షణ వలయం,
గడప దాటకున్నా మెరుగైన జీవితం,
నవీణతకు వీడుకోలు ఉత్తరం,
ఎవరికి పని లేకున్నా నాగలికి పని ఇచ్చారు,
కర్మాగారాలు మూత పడినా,
రైతు కర్మకు సెలవు లేదు,
ఎండలో ఏదో ఉందని అందరూ తెలుసుకున్న తరుణం,
ఏసీలు నడవ కూడదని ఆదేశాలు,
అవసరం మించి మించకూడదు ఏది,
మితం ఏ సమ్మతం,
ప్రాణం కంటే ఏది విలువైనది కాదు,
చిన్నదంటూ పెద్దదంటూ ఏది లేదు,
చిన్న చూపు వద్దు,
పొట్టకూటికై పని చేసేవాడే మన పొట్ట నింపుతున్నాడు,
చదువుకున్నవాడు కాలక్షేపం చేస్తుంటే,
నిజమైన పౌరులు సేవలందిస్తున్నారు,
మన వంటలే మనకు గొప్ప,
అదీ ఒక సాధనే అనట్టు బడాయిలు,
ఎగతాళి చెయ్యడం లేదు,
కానీ అసలైన బాధ్యతను మరువవద్దు,
పౌరుడిగా ఏమి చేసావు గుర్తు తెచ్చుకో,
ఇంట్లో ఉండటం బాధ్యత కాదు నీ ప్రాణానికి భరోసా అంతే,
అంతకు మించి ఏమి చేసావు?
ప్రశ్నించుకో స్వీయ ప్రక్షాళన చేసుకో,
సాటి మనిషికై స్పందించు,
అందరిలో ప్రాణం ఉంటుంది కానీ మరో ప్రాణంకై తపించేవాడే మనిషి,
నువ్వు మనిషివేనా?
ఈ సవాలును గెలవగలవా?
నిరూపించుకో నిన్ను నువ్వు,
సాటివాడికై పలుకుతానని చేయందిస్తానని,
నిరూపించుకో నిన్ను నువ్వు,...

నువ్వుంటే

నిదురలో రావాల్సిన కలలు కళ్లముందుంటే కలలతో పనేముంది...
అడగకుండానే జాబిలి పలకరిస్తుంటే చీకటి వెన్నలకు విలువేముంది...

స్నేహానికి బొమ్మ గీశావు

ఎన్నో కలుగుతుంటాయి,
ఎన్నో జరుగుతుంటాయి,
నా చూపులో నువు వాలినపుడు,
నా తొలి స్నేహానికి బొమ్మ గీశావు...

భావానికి సెలవు

నీ తలంపు లేని రోజు నా భావానికి సెలవు...
నీ చెలిమి లేని రోజు నా ఆఖరి స్నేహం నువ్వే అవుతావు...

నీ స్నేహం

ఒక్కసారి జరిగితే అదృష్టం...
అప్పుడప్పుడు జరుగుతుంటే యాదృచ్ఛికం...
ప్రతి రోజు జరిగితే అది నీ స్నేహం...

దృతి

బొమ్మకు నీకు అనుబంధం ఉందేమో...
ముద్దుగా ఉంటావు మా మనసు దోచుకున్నావు...
ప్రేమకు లాలనకు నువ్వు పుట్టావేమో...
కష్టాన్ని మరిపిస్తావు నవ్వుతో మనసును దోచేస్తావు...
ముద్దు మూట కడితే దృతిలా ఉంటుందేమో...
మమ్మల్ని పసివారిని చేసి ఆడుకుంటావు...

నువ్వు

తెలుగు అక్షరం నీ నవ్వు,
ఆకాశం నీ మనసు,
ఆనందం నీ చెలిమి,
అనుబంధం నీ రూపం...

ఓ తెలుగమ్మాయి ఈ నాలుగు వరుసల కావ్యం నీకు అంకితం.

అత్యాశకు కొలత లేదు

నీ సంకల్పం చిన్నదైతే నీ ఆశ అత్యాశ అవుతుంది...
అంతే కాని అత్యాశకు కొలత లేదు...

ఎదురుచూపు

నువ్వు లేని సమయం గడిచిపోతుంది, 
కానీ అందులో జ్ఞాపకం మిగిలిపోతుంది, 
నీ మాట చేరని రోజు రాతిరి వస్తుంది, 
కానీ కలలు నీకోసం వేచివుంటాయి, 
ఏమి ఇచ్చావో ఎంత ఇచ్చావో, 
దాచలేనంత స్నేహాన్ని నాలో పొగుచేసావు...

చీరకట్టు ఇంక్యుబేటర్

ఊపిరు ఆడని సంస్కృతికి ఇంక్యుబేటర్ మీ చీరకట్టు,
వైరస్ పట్టిన సంస్కృతికి సానీటైజర్ మీ చీరకట్టు,
రోజుకొక్కసారి కడుతుంటే,
పాశ్చాత్య క్రిములు నశించి,
మన అంటీబాడీస్ వెలుగు చూస్తాయి,
ఇంటికొక దేవత అవతరిస్తూ,
నవ భారతం మళ్ళీ ఊపిరందుకుంటుంది...

చీరకట్టుకై యుద్ధం

చీర కట్టాలంటే,
ప్రపంచ యుద్ధమే జరగాలి,
లేకుంటే తీరిక ఏది?
రక్కసి జన్మించాలి,
లేకుంటే దేవతా మూర్తికి అవసరమేంటి?

చీరకట్టు

తోక చుక్క అరుదు,
నీలి నింగి జాబిలి అరుదు,
వడగళ్లు అరుదు,
హరివిల్లు అరుదు,
చీరకట్టు కూడా అరుదాయెరా,
 అంత కష్టమైనదా చీర కట్టు?
నువ్వైనా చెప్పరా శంకరా....

బుట్టబొమ్మ

బుట్టబొమ్మ,
వెన్నెలమ్మ,
చీర కట్టి,
జాబిలైతివే,
నీ నవ్వుతోటి,
వేకువను చిన్నబుచ్చావే...

ఆత్మవిశ్వాసం

దూరంగా ఉనప్పుడు,
చెక్కినట్టి కనులు చూసి,
ఎంత సొగసో అనుకున్నా,
మనసు నిండా నవ్వు చూసి,
ఎంత హాయో అనుకున్నా,
కానీ చేరువైతే తెలిసింది,
సొగసైన కనులు అలసటకు వాడుతాయని,
నిండైన మనసు ఒత్తిడికి లోనౌతుందని,
ఎలా ఉన్నా నీలో చెరగని ఆత్మవిశ్వాసమే నిజమైన అందమని..

ప్రేమ కాటు

తేనెటీగ కాటుకి సిద్ధంగా లేకుంటే తేనెపట్టును ముట్టుకోకు.. यदि आप मधुमक्खी के डंक के लिए तैयार नहीं हैं, तो छत्ते को न छुएं... If you are not ...