Showing posts with label మొగ్గ. Show all posts
Showing posts with label మొగ్గ. Show all posts

పువ్వు నువ్వు


పువ్వు మొగ్గగా మారడం నేనెప్పుడూ చూడలేదు, నువ్వు నా ముందు చిన్న పిల్లలా ఉంటుంటే ఇలా అనిపిస్తుంది...

मैंने कभी किसी फूल को कली बनते नहीं देखा, ऐसा तब लगता है जब तुम मेरे सामने बच्ची बन जाती हो...

I have never seen a flower becoming a bud, it feels like this when you behave like a child in front of me...

🩵

సిగ్గు మొగ్గ


పూరేకులన్నీ ముడుచుకొని మొగ్గగా మారే తరుణమిది, నీ సొగసులన్నీ ముడుచుకొని సిగ్గుగా మారే సమయమిది...

It is the time when all the flower petals come closer to become a bud again; it is the time when all your beauty factors draw closer to feel shy again....

💞

హత్తుకునే చేతులు నీదైతే తప్ప


నా ప్రేమకు కఠినత్వాన్ని ఛేదించే శక్తి ఉంది, కానీ హత్తుకునే చేతులు నీదైతే తప్ప అది వికసించదు...

My love has the power to crack through the hardness but it won't surface unless the picking hands are yours..

💞

ప్రేమగా మారిపోదా


నేల వదిలి సంద్రమైన ఆకాశాన చేరిపోదా నువ్వే మేఘం అయితే, రాయి రప్ప పువ్వు మొగ్గ తారలుగా మారిపోవా నువ్వే నింగి వైతే, తలపులు నిండిన నా హృదయం ప్రేమగా మారిపోదా నువ్వే ఎదురొస్తే...

If you become the cloud, then the oceans will fly to stay with you. If you become the sky, the flowers, buds, and stones will become stars in the sky. My heart, full of feelings, will turn into love when I face you...

💜💜💜

నీ అందం



మట్టి కూడా మొగ్గలా విరబూసే చోటు నీ పాదముంటే, మిణుగురులు చీకటనుకొని వెలుగుతూ మోసపోయే చోటు నీ కురులు అంటే,
మంచు ఆటవిడుపుకు వెళ్ళే చోటే నీ మేని అంటే,
తోటి మగువల అందాన్ని చిన్నబుచ్చే చూపులే నీ మొత్తం అందమంటే...

Your feet are the place where the soil blooms like a bud, and your black hair is the place where fireflies unknowingly turn on thinking it's night. Your body is the playground where snow goes for recreation. Your entire beauty is a gaze that diminishes the beauty of other women..

💜💜💜

ఓడిపోయాను

నీ మనసును వినాలనుకునే క్రమంలో నా వినికిడిని ఎంతగానో పెంచుకున్నా, 
నత్త వేసే అడుగుల చప్పుడు వినగలిగాను, 
మొగ్గ పువ్వుగా మారేటప్పుడు అది పగిలే శబ్దాన్ని వినగలిగాను,
ఉప్పు నీళ్ళ కలయికలో వచ్చే అలజడిని వినగలిగాను,
కదిలే మేఘాల అలికిడిని వినగలిగాను,
కానీ ఇంకా నీ మనసు పలికే మౌనాన్ని అందుకోలేకున్నాను ఓడిపోయాను...

In the process of hearing your heart, I enhanced my hearing.
I could hear the snail's footsteps.
I could hear the sound of a bud bursting into a flower.
I could hear the tumult of saltwater mixing.
I could hear the waves of moving clouds.
But still, I can't grasp the silence that speaks your heart, and I'm defeated...

💜💜

మంచు పొరలు

பனி அடுக்கடுக்காய் படர்வது போல, நீ பேசும் ஒவ்வொரு முறையும் உன் காதல் என் இதயத்தில் ஒரு புதிய தடம் பதிக்கிறது. பனி கரைய காலம் மாறலாம்; இந்தக்...