బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
Showing posts with label వనిత. Show all posts
Showing posts with label వనిత. Show all posts
ముద్ద మందారం అనుకొకు
ముద్ద మందారం అనుకొకు ఎదిరిస్తావా ముల్ల రోజా అవుతుంది చెలిమి చేస్తావా జాబిలౌతుంది...
వజ్రం/Diamond
వజ్రం ఆభరణమైతే ఎంత అందంగా ఉంటుందో ఆయుధమైతే అంతే భయం కలిగిస్తుంది...
---------------------------------------------------------
Diamond is so beautiful as an ornament and it is equally dangerous as a weapon...
---------------------------------------------------------
Diamond is so beautiful as an ornament and it is equally dangerous as a weapon...
మనసు కథ మనసులోలోనే కదా
ఎంత బరువు పెట్టినా పెట్టినట్టు ఉండదు..
ఎంత తట్టుకున్నా బరువు మోసినట్టు ఉండదు..
మనసు కథ మనసులోలోనే కదా..
చేతికి సోగసునల్లింది .
నన్నే అడుగులు వేయించావు
| అందని ఆకాశం నీవు అందాల ఓ పావురం నేలపై రాలిన ఎండుటాకులా చేసాను ఓ సాహసం రెక్కలు లేవు పక్షిని కాను గాలికి తోడై వస్తున్నా ఎంత సేపని గాలిలో ఉండను చావని ఆశల బరువుతో ఉన్నా నీతో స్నేహం కల అనుకున్నానే నాకై చినుకై దిగివోచ్చావే సీత కొకలా నటిస్తున్నా నన్ను చిలుకలా మర్చేస్తున్నావే నాపై అందరి అడుగులు పడకుండా నన్నే అడుగులు వేయించావు నీకిది తెలియదేమో ఈ ఎండుటాకునే పైపైకి చేసి ఒక నక్షత్రంల మర్చేస్తునావు నీకెలా రుణపడి ఉండను అ రుణాలకే అతీతంగా ఓ బందానిచ్చావే... |
నీవు నేను ఒక్కటే
| దిగులు నిండిన మనసుతో ప్రేమకు తావులేని బంధాలతో నాలుగు గోడల నరకంలో ఎలా ఉన్నావు.. అందమునంతవరకు ఆరాధిస్తారు అది ఆవిరయ్యేవరకు ఆనందిస్తారు కన్నీటి కనులు తప్ప కప్పిన సోగాసునే చూస్తారు ఈ నిజమే నీకు తెలిసినా నిస్ప్రుహే వాడికి వదిలేసి కాలుతున్న కాగితమౌతు ఎలా ఉన్నావు... అమ్మ ప్రేమ లేదు తండ్రి లాలన లేదు తోబుట్టువల నీడ లేదు కట్టినమైన రాక్షసత్వము తప్ప! ఎలా వున్నావు నీవెలా ఉన్నావు.. మాములుగా మల్లెల సొగసుకు మోసపోవు కదా! చక్కని జీవితం ఇష్టం లేక కాదు కదా! నిలువ నీడ లేకనా నీవారి కోసమా! నీకోసమైనా సరే ఎలా వున్నావు నీవెలా ఉన్నావు.. నీకెంత ధైర్యం ఇచ్చినా సాయం చేసే చేతులు నాకు లేవు నేను నీలా కాకున్నా సమాజంతో కట్టబడి ఉన్నాను నీవు అందానర్పిస్తే నేను స్వేచ్ఛను అర్పిస్తున్నాను అందుకే నీవు నేను ఒక్కటే... |
ఓ వనిత నీకొక్క మాట.....
ఓ వనిత నీకొక్క మాట భయపడకు.... చేజారుతున్న జీవితాన్ని తుది ముట్టించు... అలుపన్నది లేదు నీకు గెలుపన్నది నీ పేరు... నిజమంటూ ఒకటుంటే నిర్భయంగా పోరాడు... అందరికి కలలు వారి నిదుర చేతులో... నీకంటూ కలలుంటే నీ చేతలలో... నీవే ఒక పువ్వై నలిగిపోతావో... లేక ఆ పువ్వునే మాలగా ధరిస్తావో.... అందరికి కారణం నీవైనపుడు నీకెందుకు తోడు... నీ నీడ కదలితే చాలు కష్టాలే కడతేరు... కదలిపో ఓ మహిళా మహా సంద్రమై... కబళించు అన్యాయాన్ని ఓ ఉప్పెనై... |
Subscribe to:
Posts (Atom)
అందమైన ఆయుధం
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...







