Showing posts with label రంగు. Show all posts
Showing posts with label రంగు. Show all posts

పసుపు పాదాలు


పసుపు పాదాలు, 
పారిజాతాలు,
పాల మేఘాలు నేలపై, 
ముద్దబంతి పరవళ్ళు, 
నిమ్మకూ అందని రంగులు,
తెలుగు గడప అలిగేంత 
సొగసు తాపడాలు,
బంగారమే వెలవెలబోయే 
మెత్తని పసిడి పాదాలు...

💕

ఆ రంగులతో నిన్ను గీసింది


హరివిల్లు తన రంగులను దానమిచ్చి బొమ్మ గీయమని కవితను కోరుకుంటే, కవితకు భావం కలిగి ఆ రంగులతో నిన్ను గీసింది...

When the rainbow generously donated its colors and requested the poem to draw a doll, the poem felt inspired and drew you using those hues...

❤️

నీ అందాన్ని రాస్తూ ఉంటే


నీ అందాన్ని రాస్తూ ఉంటే అక్షరాలు గీతలుగా మారేనా, ఆ గీతలన్ని వంగిపోతు నీ రూపాన్ని దిద్దుకుంటూ సాగేనా,
ఆకాశపు తోటలన్ని తిరిగి తిరిగి గాలి రంగులన్ని తెచ్చేనా, ఆ నింగి అద్భుతాలకు ప్రతిరూపంగా నువ్వు కానీ నీ అందంలో ఉన్నవి వాటిలో లేదు..

As I began to describe your beauty, the words transformed into intricate lines, each taking on a graceful shape. The wind itself carried colors from distant galaxies. You are a genuine reflection of nature, enriched with qualities it yearns for...

💜💜💜

రాత్రికి రంగు వేయడం తెలియదు

రాత్రికి రంగు వేయడం తెలియదు కానీ అంతా నల్లగా మారుతుంది, నీ మౌనానికి మోసగించడం తెలియదు కానీ నా మనసును తోలచివేస్తుంది...

Night doesn't color anything but everything at night appears dark,
Your silence doesn't mean to hurt but it tears down my heart...

💜

అసలైన రంగు

ఆకాశానిది అసలైన రంగు ఏమిటో కానీ తను చూపించే ప్రతి రంగు బాగుంటుంది...

The exact colour of sky is unknown but whatever the colour it exhibits is magical...

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...