Showing posts with label సారం. Show all posts
Showing posts with label సారం. Show all posts

తగ్గదు దానిలోని ప్రేమ సారం


చీకటితో మాసిపోదు నా అక్షరం,
వేకువతో వెలిగిపోదు నా అక్షరం,
నిరంతరం దానిది ఒకే అర్థం,
తగ్గదు దానిలోని ప్రేమ సారం...

Neither darkness can erase my words, nor morning can brighten them up; their meaning remains the same forever, and the essence of love never decreases..

💞

నీ అందాల సరస్సులో నేను ఒక చేపనై ఈదాలి





రోజా రేకులతో నిన్ను అద్ది ఆ సారంతో పసుపుకు మెరుగులు దిద్దాలి, నీపై గాలిలో ముంచి మొగలి సువాసనలు పెంచాలి, నీ స్పర్శని చూపించి పత్తికి మెత్తదనపు పాఠాలు నేర్పాలి, నీ అందాల సరస్సులో నేను ఒక చేపనై ఈదాలి...
I shall smear you with rose petals and enhance the beauty of turmeric with that essence. I shall let the scent of screwpine waft through the air around you, intensifying its fragrance. I shall showcase your touch and impart gentle lessons to cotton. Oh, dear lady! I desire to swim in the lake of your beauty like a fish...

💜💜💜

నీ అందంలోని రుచి చావదు

వేపతోటనంతా సారం తీసి కలిపినా నీ అందంలోని రుచి చావదు, ఎందుకింత అందంగా ఉన్నావు?

Your beauty's taste will not fade away, even if it were mixed with the essence of the entire neem garden. Why are you so beautiful?

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...